Vijay Devarakonda: మళ్లీ రావా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం గౌతం తిన్ననూరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత గౌతమ్ చేసిన జెర్సీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. జెర్సీ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. విజయ్ దేవరకొండ హీరోగా ప్రస్తుతం కింగ్డమ్ అనే సినిమా పూర్తి చేశాడు గౌతమ్.
జులై 31న కింగ్డమ్ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ రెడ్డి వంగ విజయ్ దేవరకొండ మరియు గౌతమ్ తిన్నానూరితో ఒక పాడ్ కాస్ట్ వీడియో చేశారు. ఈ వీడియోని కొద్దిసేపటి క్రితం అధికారికంగా రిలీజ్ చేసింది సితార ఎంటర్టైన్మెంట్.
విజయ్ కథ సరిగ్గా వినలేదు
మళ్లీ రావా సినిమాను గౌతమ్ చాలామందికి చెప్పే ప్రయత్నం చేశాడు. పెళ్లిచూపులు సినిమా రిలీజ్ అవ్వడానికంటే ముందు ఎవడే సుబ్రహ్మణ్యం అనే సినిమాలో విజయ్ ను చూసి తనకు కూడా చెబుదామని అనుకున్నాడు. మొత్తానికి విజయ్ ఫ్రెండ్ ద్వారా తనను ఒక ఆఫీస్ కి పిలిచాడు. అదే రోజు పెళ్లిచూపులు సినిమా విడుదలైంది. పెళ్లిచూపులు సినిమా ఎంత సక్సెస్ సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదటి షో పడిన వెంటనే ఆ సినిమాను విపరీతంగా ప్రేక్షకులు మోసారు. అయితే ఆరోజు విజయ్ కు గౌతం తిన్ననూరి మళ్లీ రావా సినిమా కథను చెప్పాడు. అయితే కథను వింటున్న టైంలో విజయ్ కు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఇంట్రెస్ట్ గా విజయ్ కథ వినడం లేదు. అతని మైండ్ ఎక్కడో ఉంది అని గౌతమ్ కి అర్థమైంది.
మధ్యలో వెళ్లిపోయాడు
కథ వింటున్న టైంలో ఆఫీస్ బాయ్ వచ్చి విజయ్ కు సమోసా ఇచ్చాడు. విజయ్ ఆ సమోసా తిన్న తర్వాత గౌతమ్ వైపు చూసి ఏదో అడగబోయాడు. కథలోని ఏమైనా డౌటు ఉంటే అడుగుతాడేమో అనుకున్నాడు గౌతం. కానీ విజయ్ ఇంకో సమోసా ఉందా అని అడిగాడు. వెంటనే ఆఫీస్ బాయ్ తీసుకొచ్చి సమోసా ఇచ్చాడు. ఇక కథ చెప్పిన కాసేపటి తర్వాత, పెళ్లిచూపులు సినిమాకి సంబంధించి ఒక ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వాల్సి ఉంది కాబట్టి విజయ్ గౌతమ్ కి ఓపెన్ గా చెప్పేసాడు. సారీ బాస్ నువ్వు ఏం చెప్తున్నావో నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. నేను కొంచెం బయటకు వెళ్లాలి ఏమనుకోకండి అని చెప్పేసి మధ్యలోనే వెళ్లిపోయాడు విజయ్ దేవరకొండ. ఈ విషయాన్ని స్వయంగా గౌతమ్ తెలియజేశారు.
Also Read: Fahadh Faasil : ఆ సినిమా గురించి మాట్లాడను, పుష్పపై ఫహద్ వ్యాఖ్యలు ?