Grasberg Gold Mine: మనదేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారతదేశ సంస్కృతిలో బంగారం శుభప్రదమైన చిహ్నంగా, సంపదకు ప్రతీకగా పరిగణిస్తారు. పెళ్లిళ్లు, పండుగలు ఇలా ముఖ్యమైన వేడుకల్లో బంగారం కీలక పాత్ర పోషిస్తుంది. ప్రతి ఏడాది దీపావళి, అక్షయ తృతీయ వంటి సందర్భాలలో బంగారం కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతుంటాయి. ఎందుకంటే ఈ సమయంలో బంగారం కొనడం శుభసూచకమని ప్రజలు నమ్ముతారు. అలాగే ఆర్థికంగా బంగారం సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తారు. ద్రవ్యోల్బణం, దేశంలో ఆర్థిక అస్థిరతలు కొనసాగుతున్న సమయంలో బంగారం విలువ స్థిరంగా ఉంటుందని భారతీయుల నమ్మకం. గ్రామీణ ప్రాంతాల్లో, బ్యాంకు సౌకర్యాలు తక్కువగా ఉన్న చోట బంగారం ఆర్థిక భద్రతకు ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా మహిళలకు బంగారం అమితంగా ఇష్టపడతారు. ప్రపంచంలో బంగారం వినియోగంలో భారతదేశం అగ్రగామిగా ఉందంటే అర్థం చేసుకోవచ్చు. 2024లో భారతదేశం సుమారు 800-900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసినట్లు అంచనా. బంగారం ధరలు పెరిగినప్పటికీ, దాని సాంస్కృతిక, ఆర్థిక విలువ కారణంగా డిమాండ్ మాత్రం స్థిరంగా ఉంటుంది.
భారతీయ మహిళలకు బంగారంపై ప్రేమ ఎక్కువగా ఉంటుంది. బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, సంపద, హోదా, శుభంలకు చిహ్నం. వివాహాలు, పండుగల వంటి సందర్భాల్లో బంగారం ఆకర్షణీయమైన బహుమతిగా ఉంటుంది. ఇది ఆర్థిక భద్రతను అందిస్తూ, కుటుంబ సంప్రదాయాలను కొనసాగిస్తుంది. బంగారం ధరించడం ద్వారా మహిళలు తమ సౌందర్యాన్ని, సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తారు. ఆధునిక కాలంలోనూ బంగారం పట్ల ఈ ప్రేమ తగ్గలేదు. బంగారం ధర లక్ష దాటినా భారతీయ మహిళల కొనేందుకు మాత్రం వెనుకాడడం లేదు. బంగారం రేటు ఎంత పెరిగినా.. భారతీయ మహిళలు కొనడానికి సిద్ధంగా ఉంటారు. అందుకే భారతదేశంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ.. ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న దేశాలలో బంగారు వనరులు ఎక్కువగా ఉన్నాయి. ప్రపంచంలోనే ముస్లిం జనాభా ఎక్కువగానున్న దేశాల్లో బంగారం నిల్వల పరంగా ఫస్ట్ స్లేస్ లో ఉన్న దేశం ఇండోనేషియా. అయితే అక్కడ ఉన్న అతి పెద్ద బంగారు గని పేరు ఏంటి..? అక్కడ నుంచి ఎంత బంగారం ఉత్పత్తి అవుతుంది..? ఎంత మంది ఉద్యోగులు ఆ బంగారు గనుల్లో పని చేస్తారు..? అనే విషయాల గురించి తెలుసుకుందాం…
⦿ ఇండోనేషియా గ్రాస్‌బర్గ్ గని విశిష్టతలు
ఇండోనేషియాలోని పాపువా ప్రాంతంలో ఉన్న గ్రాస్‌బర్గ్ గని ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గనులలో ఒకటి. ఇది అతిపెద్ద రాగి గనిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ గని సుమారు 4,100 మీటర్ల ఎత్తులో సుడైమాన్ పర్వత శ్రేణిలో ఉంది. ఇది చాలా ప్రఖ్యాతి గాంచిన బంగారు గని. ఇది దాని భౌగోళిక స్థానం వల్ల ప్రత్యేకమైనది. ప్రతి ఏడాది ఇక్కడ నుంచి 48 టన్నుల బంగారం ఉత్పత్తి అవుతోంది. అలాగే మంచి క్వాలిటీ ఉన్న రాగి కూడా భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతోంది. ఇక్కడ ఖనిజాలు భూమిలో పై స్థాయిలోనే ఉండడం వల్ల సులభంగా వెలికి తీస్తున్నారు. ఈ కారణంగానే.. గ్రాస్ బర్గ బంగారు గని చాలా ఫేమస్. ఖనిజ పరిశ్రమల్లో తనకంటూ ఓ ముఖ్యమైన స్థానాన్ని దక్కించుకుంది. గ్రాస్‌బర్గ్ గనిని ఇండోనేషియా ప్రభుత్వంతో భాగస్వామ్యంతో.. అమెరికాకు చెందిన ఫ్రీపోర్ట్-మెక్‌మోరాన్ సంస్థ నిర్వహిస్తుంది.
⦿ గ్రాస్‌బర్గ్ గనిలో 20వేల మంది ఉద్యోగులు…
ఈ గని చిన్న నగరాన్ని పోలి ఉంటుంది. ఇక్కడ 20వేలకు పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఓ విమానశ్రయం, ఒక పోర్టు, హాస్పిటల్స్, స్కూల్స్, బిల్డింగులు ఉన్నాయి. మొదట ఈ ప్రాంతలో ఓపెన్ పిట్ మైనింగ్ ద్వారా ఖనిజాలను బయటకు తీసేవారు. ఇప్పుడు మట్టిలోని ఖనిజాలు తగ్గిపోవడంతో.. భూగర్భ మైనింగ్ కు ఛేంజ్ అయ్యారు. గణాంకాల ప్రకారం, ఈ గని నుంచి ఏడాదికి సుమారు 1.6 మిలియన్ ఔన్సుల బంగారం, 1.8 బిలియన్ పౌండ్ల రాగి ఉత్పత్తి అవుతుంది. ఈ గనిలోని ఖనిజ నిక్షేపాలు 3 బిలియన్ టన్నులకు పైగా ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇది ఓపెన్-పిట్ మైనింగ్, అండర్‌గ్రౌండ్ మైనింగ్ రెండింటినీ కలిగి ఉంది.
⦿ గని లోతు ఎంత ఉంటుందంటే…?
గ్రాస్‌బర్గ్ గని దాని అధునాతన సాంకేతికత, ఇంజనీరింగ్‌కు ప్రసిద్ధి. ఓపెన్-పిట్ గని వ్యాసం సుమారు 4 కిలోమీటర్లు ఉంటుంది. లోతు 1.2 కిలోమీటర్లు వరకు ఉంటుంది. గని నిర్వహణలో ఆటోమేటెడ్ యంత్రాలు, రిమోట్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి ఆధునిక సాంకేతికతలు ఉపయోగిస్తున్నారు. అండర్‌గ్రౌండ్ మైనింగ్‌లో బ్లాక్ కేవింగ్ పద్ధతి ఉపయోగిస్తున్నారు. ఇది అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన పద్ధతి.
⦿ దేశ జీడీపీలో కీలక రోల్..
గ్రాస్‌బర్గ్ గని ఇండోనేషియా ఆర్థిక వ్యవస్థకు కీలకమైనది. ఇది దేశ జీడీపీలో గణనీయమైన భాగాన్ని పోషిస్తుంది. అలాగే వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ గని నుండి వచ్చే ఆదాయం దేశ ఆర్థికాభివృద్ధికి, మౌలిక సదుపాయాల అభివృద్ధికి దోహదపడుతుంది. గ్రాస్‌బర్గ్ గని పర్యావరణ, సామాజిక సవాళ్లను ఎదుర్కొంటుంది. గని వల్ల స్థానిక పర్యావరణంపై ప్రభావం, స్థానిక పాపువాన్ తెగల జీవనోపాధి సమస్యలు విమర్శలకు దారితీశాయి. ఫ్రీపోర్ట్ సంస్థ పర్యావరణ పరిరక్షణ, స్థానిక సంఘాల అభివృద్ధి కోసం కొన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ, ఈ సమస్యలు కొనసాగుతున్నాయి.
⦿ అత్యంత సంపద గల గనిగా గ్రాస్ బర్గ్…
గ్రాస్‌బర్గ్ గని దాని ఖనిజ సంపద, సాంకేతిక ఆధునికత, ఆర్థిక ప్రాముఖ్యతతో ప్రపంచ గనన రంగంలో విశిష్ట స్థానం కలిగి ఉంది. గ్రాస్‌బర్గ్ మైన్ అనేది అత్యంత సంపద గల గనిగా భావించవచ్చు. ఇది ఒకే ఒక గనితో దేశానికి ఎంత ఖ్యాతి తీసుకురాగలదో చూపించడానికి బెస్ట్ ఎగ్జాంపుల్. ముస్లింలు అధికంగా ఉన్న దేశాల్లో ఇండోనేషియాకు ఈ గని ఓ ముఖ్యమైన ఆర్థిక సంపత్తిగా నిలిచింది. భవిష్యత్తులో, ఇలాంటి గనులను మరింత సద్వినియోగం చేసుకుంటే ఇండోనేషియా కూడా ప్రపంచంలోని టాప్ బంగారం ఉత్పత్తిదారుల్లో ఒకటిగా నిలవగలదు.
ALSO READ: Iconic Cable Bridge: హైదరాబాద్‌లో మరో అద్భుతమైన ఐకానిక్ బ్రిడ్జ్.. రెండు కళ్లు సరిపోవు..