BigTV English

OTT Movie : రాత్రిపూట అమ్మాయిలు మిస్సింగ్… తెల్లారితే ఊహించని ట్విస్ట్… గ్రిప్పింగ్ అండ్ రా క్రైమ్ కథ

OTT Movie : రాత్రిపూట అమ్మాయిలు మిస్సింగ్… తెల్లారితే ఊహించని ట్విస్ట్… గ్రిప్పింగ్ అండ్ రా క్రైమ్ కథ

OTT Movie : ఒక ఎమోషనల్, సస్పెన్స్‌ఫుల్ స్టోరీతో తెరకెక్కిన సినిమా రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. IMDbలో ఈ సినిమాకి 8.0/10 రేటింగ్ కూడా ఉంది. సిద్ శ్రీరామ్ పాడిన రెండు పాటలు స్టోరీని ఫార్వర్డ్ చేస్తాయి. రాహుల్ రాజ్ కంపోజ్ చేసిన “ఓసారిలా రా” ఈరీ, ఎమోషనల్ టోన్‌తో సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. గోపీ సుందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నైట్ సీన్స్‌లో ఇంటెన్స్ వైబ్ ఇస్తుంది. ఇందులో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ భార్య మిస్సింగ్ తో అతని జీవితం తలకిందులవుతుంది. ఇతను హత్య కేసులో కూడా ఇరుక్కుంటాడు. ఆ తరువాత స్టోరీ ట్విస్టులతో మలుపులు తిరుగుతూ ఉంటుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


Sun NXTలో స్ట్రీమింగ్

‘ఒక పథకం ప్రకారం’ (Oka Pathakam Prakaram) తెలుగు క్రైమ్-సస్పెన్స్-థ్రిల్లర్ మూవీ. దీనికి వినోద్ విజయన్ దర్శకత్వం వహించారు. ఇందులో సాయిరాం శంకర్ (సిద్ధార్థ్ నీలకంఠ), ఆశిమా నర్వాల్ (సీత), శృతి సోఢి (పోలీస్ ఆఫీసర్), సముద్రిరాజు (రఘురాం) ప్రధాన పాతల్లో నటించారు. ఇది వినోద్ విహాన్ ఫిల్మ్స్, విహారి సినిమా హౌస్ నిర్మాణంలో తెరకెక్కింది. 2025 ఫిబ్రవరి 7 న ఈ సినిమా 300కు పైగా థియేటర్లలో రిలీజ్ అయింది. 132 నిమిషాల రన్‌టైమ్, రాహుల్ రాజ్, గోపీ సుందర్ మ్యూజిక్, సిద్ శ్రీరామ్ పాటలతో ఈ సినిమా అలరిస్తోంది. Sun NXTలో 2025 జూన్ 27 నుంచి స్ట్రీమింగ్‌లో ఉంది.


Read Also : 16 ఏళ్ల అమ్మాయితో 60 ఏళ్ల ముసలాడు… కుర్రాడి ఎంట్రీతో ఊహించని మలుపులు

స్టోరీలోకి వెళితే

సిద్ధార్థ్ నీలకంఠ (సాయిరాం శంకర్) విశాఖపట్నంలో ఒక నీతిమంతుడైన పబ్లిక్ ప్రాసిక్యూటర్. అతను సీత (ఆశిమా నర్వాల్)ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. కానీ అనుకోకుండా సీత ఒక రోజు మిస్సింగ్ అవుతుంది. దీంతో సిద్ధార్థ్ జీవితం తలకిందులవుతుంది. ఆతరువాత అతను డ్రగ్స్‌కి అడిక్ట్ అవుతాడు. తన భార్యని వెతుక్కుంటూ బతుకు గాడి తప్పుతాడు. ఇంతలో అతని క్లోజ్ ఫ్రెండ్ దివ్య (భానుశ్రీ) దారుణంగా హత్యకు గురవుతుంది. ఆ కేసులో సిద్ధార్థ్‌ని పోలీస్ ఆఫీసర్ రఘురాం (సముద్రిరాజు) అరెస్ట్ చేస్తాడు. సిద్ధార్థ్ లాయర్‌గా తన స్కిల్స్ ఉపయోగించి, కోర్టులో తన ఇన్నోసెన్స్‌ని ప్రూవ్ చేసుకుంటాడు.

కానీ అతను ఊపిరి పీల్చుకునేలోపే, మరో లాయర్ భార్య హత్య అవుతుంది. మళ్లీ సిద్ధార్థ్‌నే ఫ్రేమ్ చేస్తారు. ఈ రెండు హత్యలు ఒక పథకం ప్రకారం జరిగినట్లు కనిపిస్తాయి. ఇక సిద్ధార్థ్ తన ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు విశాఖపట్నంలో ఇలాంటి మరిన్ని హత్యలు బయటపడతాయి. అతను పోలీస్ ఆఫీసర్ శృతి సహాయంతో ఈ కన్‌స్పిరసీని అన్‌రావెల్ చేస్తాడు. కిల్లర్ ఐడెంటిటీ షాకింగ్ ట్విస్ట్ తో రివీల్ అవుతుంది. ఈ మర్డర్స్ వెనుక ఒక సీరియల్ కిల్లర్ ఉన్నాడా? లేక సిద్ధార్థ్‌ని ఎవరో టార్గెట్ చేస్తున్నారా? సిద్ధార్థ్ భార్య ఏమవుతుంది ? సిద్ధార్థ్ వీటన్నిటిని ఎలా ఎదుటుకుంటాడు ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

OTT Movie : మెయిడ్ గా వచ్చి యజమానితో రాసలీలలు… ఈ అత్తా కోడళ్ళు ఇచ్చే షాక్ అరాచకం భయ్యా

OTT Movie : రాత్రికి రాత్రే వింత చావులు… అర్ధరాత్రి పీకలు తెగ్గోసే కిల్లర్… గూస్ బంప్స్ పక్కా

OTT Movie : బాబోయ్ దెయ్యంపైనే ప్రయోగం… కట్ చేస్తే గూస్ బంప్స్ ట్విస్ట్…. ముచ్చెమటలు పట్టించే హర్రర్ మూవీ

OTT Movie : అనామకుల చెరలో ఇద్దరమ్మాయిలు… కిల్లర్స్ అని తెలియక కలుపుగోలుగా ఉంటే… బ్లడీ బ్లడ్ బాత్

OTT Movie : ప్రెగ్నెంట్ వైఫ్ ఫోటో మార్ఫింగ్… ఒక్క రాత్రిలో ఫుడ్ డెలివరీ బాయ్ లైఫ్ అతలాకుతలం… సీను సీనుకో ట్విస్ట్

Mohanlal: ఓటీటీ స్ట్రీమింగ్ కి సిద్ధమవుతున్న మోహన్ లాల్ బ్లాక్ బాస్టర్ మూవీ!

Little Hearts OTT: దసరాకు ఓటీటీలోకి ‘లిటిల్‌ హార్ట్స్‌’.. వారికి మేకర్స్‌ స్వీట్‌ వార్నింగ్, ఏమన్నారంటే!

OTT Movie : పెళ్లి చెల్లితో, ఫస్ట్ నైట్ అక్కతో… కట్ చేస్తే బుర్రబద్దలయ్యే ట్విస్టు … ఇదెక్కడి తేడా యవ్వారంరా అయ్యా

Big Stories

×