E-Paper
Advertisement

యష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మళ్లీ వాయిదా పడ్డ టాక్సిక్.. ఇప్పట్లో లేనట్లేనా?

యష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మళ్లీ వాయిదా పడ్డ టాక్సిక్.. ఇప్పట్లో లేనట్లేనా?
Advertisement

Toxic Movie:కన్నడ నటుడిగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్న యష్ కమర్షియల్ యాడ్స్, సీరియల్స్ ద్వారా పాపులారిటీ తెచ్చుకొని.. ఆ తర్వాత కన్నడలో సినిమాలు చేస్తూ హీరోగా అవతరించారు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 1 , 2 చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో ఇమేజ్ దక్కించుకున్నారు. అంతేకాదు కేజీఎఫ్ 2 ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్లు సాధించి రికార్డులు సృష్టించింది . అలా గ్లోబల్ ఇమేజ్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్న యష్ తాజాగా లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం టాక్సిక్.

యష్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..

మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా ఇప్పటికీ తెరపైకి రాకపోవడం అభిమానులను ఆందోళనలకు గురిచేస్తోంది . పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా జూన్ 4వ తేదీన ఎట్టకేలకు విడుదల తేదీని ఖరారు చేసుకుంది. కానీ ఇప్పుడు ఆ తేదీని కూడా మార్చేస్తూ విడుదల ఆలస్యం కాబోతోంది అంటూ స్వయంగా యష్ ప్రకటించడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

టాక్సిక్ మళ్ళీ వాయిదా.. స్వయంగా ప్రకటించిన హీరో..

Advertisement

తాజాగా యష్ అధికారికంగా టాక్సిక్ విడుదల వాయిదాపై స్పందిస్తూ.. “మీరందరూ అనుకున్నట్టుగానే జూన్ 4న టాక్సిక్ మూవీ రావడం లేదు. కొన్ని సినిమాలు ఆడియన్స్ ఎప్పటికీ గుర్తు పెట్టుకునేలా, ప్రేమలో పడేలా చేస్తాయి. మా టాక్సిక్ ప్రయాణం కూడా అంతే .సినిమాకాన్ అనే అంతర్జాతీయ వేదిక మీద మా సినిమాను ప్రదర్శించినప్పుడు అక్కడ వచ్చిన రెస్పాన్స్ మమ్మల్ని ఆలోచనలో పడేసింది. అందుకే ఈ సినిమా పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ వైడ్ ప్రేక్షకులను ఆకట్టుకుందనే నమ్మకం మాలో కలిగింది. టాక్సిక్ సినిమా పూర్తయింది. వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ కోసం ప్రయత్నిస్తున్నాం . ఇంతకుముందు ప్రకటించినట్టుగా జూన్ 4వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయడం లేదు. అన్ని దేశాలకు సరిపడే ఒక రిలీజ్ డేట్ ను త్వరలోనే ప్రకటిస్తాము. త్వరలోనే మీ అందరి ముందుకు టాక్సిక్ వస్తుంది అంటూ స్పందించారు. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అంతర్జాతీయ వేదికలపై ఇండియన్ సినిమా..

ఇకపోతే ఇదే విషయంపై యష్ ఇంకా మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా మన సినిమా సత్తాని, టాక్సిక్ ప్రభావాన్ని ఉండేలా ఒక నిర్మాతగా, నటుడిగా నాకు ఒక గొప్ప అవకాశం లభించింది.. ప్రస్తుతం మన సినిమాలు అంతర్జాతీయ వేదికలపై మన దేశాన్ని ప్రతిబింబించేలా ఉంటున్నాయి. అందుకు తగ్గట్టుగానే టాక్సిక్ తో సిద్ధమవుతున్నాము. ఈ ప్రయాణంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా.. మా వెంటే ఉండి నడిపిస్తూ.. అండగా నిలుస్తూ.. ప్రేమను పంచుతున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కొన్ని కథలు సహనాన్ని పరీక్షిస్తే.. కొన్ని ప్రయాణాలు డిమాండ్ చేస్తాయి.. ఏది ఏమైనా సినిమాని ప్రతి ఒక్కరూ సెలబ్రేట్ చేసుకునేలా టాక్సిక్ రూపొందించాము” అంటూ ప్రకటించారు.

కొత్త విడుదల తేదీ ఎప్పుడు?

Advertisement

మొత్తానికి అయితే సినిమాను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు కానీ కొత్త డేట్ ను ప్రకటించలేదు. మరి ఈ సినిమాను ఎప్పుడు థియేటర్లలోకి తీసుకొస్తారో.. కొత్త డేట్ ని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి.

also read:శ్రీముఖి చేసిన పని ఎప్పటికీ మర్చిపోను.. జబర్దస్త్ కమెడియన్ కామెంట్స్!

 

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×