BigTV English

Sharmila Hot Comments: దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు.. అందరికీ కలిపి వడ్డించేసిన షర్మిల

Sharmila Hot Comments: దమ్ము, ధైర్యం, చీము, నెత్తురు.. అందరికీ కలిపి వడ్డించేసిన షర్మిల

ఏపీ ఎంపీలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. టీడీపీ, వైసీపీ, జనసేనకు చెందిన ఎంపీలంతా బీజేపీకి బానిసలేనని తేల్చి చెప్పారామె. పార్లమెంట్ సమావేశాల వేళ రాష్ట్ర హక్కులపై గళమెత్తాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకంటే ఎంపీల స్వప్రయోజనాలే వారికి ముఖ్యం అన్నారు. కేవలం ప్రధాని మోదీ మెప్పుకోసమే వారు పనిచేస్తున్నారని చెప్పారు. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ, జనసేన ఎంపీలతోపాటు పేరుకి ప్రతిపక్షంలో ఉన్నా వైసీపీ ఎంపీలది కూడా అదే బాట అని అన్నారు షర్మిల. వైసీపీ ఎంపీలు కూడా కేంద్రంలోని ఎన్డీఏకు పరోక్షంగా సహకారం అందిస్తున్నారని, ఇప్పటికే పలుమార్లు ఈ విషయం రుజవైందన్నారామె.


మోదీ జపం..
ఏపీ ఎంపీలంతా మోదీ జపం చేస్తున్నారని, పార్లమెంట్ సమావేశాలలో తమ నోరుని హక్కులకోసం కాకుండా, మోదీ జపం కోసం మాత్రమే తెరుస్తున్నారని విమర్శించారు షర్మిల. పదవులు అనుభవించడం మీద మన ఎంపీలకు ఉన్న శ్రద్ధ విభజన హామీలను అమలుచేసే విషయంపై లేదన్నారు. ఈమేరకు షర్మిల ఓ ట్వీట్ వేశారు. ఎంపీలకు దమ్ము, ధైర్యం, పౌరుషం ఉంటే.. వారు ఈ రాష్ట్ర బిడ్డలే అయితే, వారిలో పారుతోంది చీము, నెత్తురే అయితే రాష్ట్ర ప్రయోజనాలకోసం గళమెత్తాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

నష్టపోయాం..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే విభజన హామీలు అమలై ఉండేవని చెప్పిన షర్మిల.. ఎన్డీఏ ప్రభుత్వం ఏపీని చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు. ప్రజలు నమ్మి ఓటు వేస్తే ఎంపీలు విభజన హామీల అమలుకోసం కృషి చేయడం లేదన్నారు. వారంతా మతపిచ్చి పార్టీకి ఊడిగం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి చెందిన 25 మంది లోక్ సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలు మోదీ చేతిలో రబ్బర్ స్టాంప్స్ గా మారారన్నారు. వారంతా బీజేపీ కోసం పని చేసే కీలుబొమ్మలని ఎద్దేవా చేశారు.

ప్రత్యేక హోదా ఏది..?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదాకోసం మీటింగ్ లు పెట్టి హడావిడి చేసిన జగన్, ఆ తర్వాత అధికారంలోకి వచ్చాక సైలెంట్ అయ్యారని విమర్శించారు షర్మిల. ప్రత్యేక హోదా మాటే మరచిపోయారని అన్నారు. ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నవారు ఆ తర్వాత ఎందుకు వారి ముందు మోకరిల్లారని వైసీపీని సూటిగా ప్రశ్నించారు. హోదా గురించి అడిగే దమ్ము ఏపీ ఎంపీలకు లేదన్నారు. కనీసం రాజధానికి నిధులు అడిగే సత్తా కూడా వారికి లేకపోవడం దురదృష్టకరం అన్నారు షర్మిల. పోలవరాన్ని ముంచుతుంటే ఎదురు తిరిగే ధైర్యం లేక సాగిలపడ్డారని విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నా సైలెంట్ గా ఉన్నారని, బీజేపీ అక్రమ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్ప మన ఎంపీలకు ఏమీ చేతకాదని విమర్శించారు షర్మిల.

నిలదీయండి..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే.. ఈ పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర హక్కులపై నిలదీయాలని ఏపీ ఎంపీలకు సూచించారు షర్మిల. మోదీ మోసాన్ని ప్రశ్నించాలన్నారు. తిరుపతి వేదికగా ఇస్తామని ప్రకటించిన ప్రత్యేక హోదా ఏమైందో అడగాలన్నారు. ఢిల్లీని తలదన్నే రాజధాని ఏదని అడగాలన్నారు. అమరావతికి నిధులు కాకుండా అప్పులు ఎందుకిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. జీవనాడి పోలవరం ఎత్తు 41.15 మీటర్లకు కుదించి ఎందుకు జీవం తీశారంటూ ఉభయ సభలను స్తంభింపజేయాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉండదని మోదీచేత అధికారిక ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు షర్మిల.

Related News

YS jagan: ఏపీలో అన్నదాతపోరు.. యధావిధిగా జగన్ కేరాఫ్ బెంగళూరు

Duvvada Tulabharam: దువ్వాడ తులాభారం.. మాధురి ఏం సమర్పించిందో చూడండి

Turakapalem: తురకపాలెంలో ICAR బృందం పర్యటన..

AP Politics: పార్టీ పదవుల కోసం.. టీడీపీలో డిమాండ్

Ayyanna Patrudu: స్పీకర్ సంచలన వ్యాఖ్యలు.. వరాలిచ్చే అధికారం తనకు లేదు, జగన్‌ నిర్ణమేంటి?

Tirupati To Shirdi: తిరుపతి నుంచి షిర్డీకి ప్రతీ రోజూ ట్రైన్.. సీఎం చంద్రబాబు సూచన, రైల్వేశాఖ ఆమోదం

×