E-Paper
Advertisement

Genelia : నేను సినిమాలకు దూరం అవ్వడానికి అదే కారణం

Genelia : నేను సినిమాలకు దూరం అవ్వడానికి అదే కారణం
Advertisement

Genelia : ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు జెనీలియా. దాదాపు తెలుగులో సినిమా చేసి 13 సంవత్సరాలు అవుతుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన బాయ్స్ సినిమా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాలో హరిణి అనే పాత్రలో నటించింది జెనీలియా. అది తమిళ్ సినిమా అయినా కూడా శంకర్ కి ఉన్న పేరు వలన తెలుగులో కూడా బాయ్స్ పేరుతో విడుదలైంది. ఆ సినిమాతో జెనీలియా కు మంచి పేరు వచ్చింది.

సుమంత్ హీరోగా చేసిన సత్యం సినిమాలో జెనీలియా నటించింది. ఆ సినిమా తర్వాత వరుసగా తెలుగులోనే అవకాశాలు వచ్చాయి. సాంబ, హ్యాపీ, సై, నా అల్లుడు వంటి సినిమాల్లో నటించింది. జెనీలియా ఎన్ని సినిమాలు చేసినా కూడా తన పేరు చెప్పగానే టక్కున గుర్తు వచ్చే పాత్ర హాసిని. బొమ్మరిల్లు సినిమా అప్పట్లో భారీ స్థాయిలో హిట్ అయింది. ఎప్పటికీ కూడా హాసిని అనే పాత్ర ప్రత్యేకంగానే ఉంటుంది.

Advertisement

అందుకే సినిమాలకు దూరం 

జెనీలియా ప్రస్తుతం గాలి జనార్ధన రెడ్డి కుమారుడు గాలి కిరీటి నటిస్తున్న జూనియర్ అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు జెనీలియా. ఇక ఈ సినిమా రేపు రిలీజ్ కి సిద్ధంగా ఉన్న తరుణంలో, ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూలో 13 సంవత్సరాలు ఎందుకు సినిమాలకు దూరంగా ఉన్నారు అని సుమ అడగగానే, నాకు హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు అంటూ చెప్పుకొచ్చారు. నాకు కూడా పిల్లలు ఉన్నారని సుమా చెప్పగానే, మీరు బాగానే ఉన్నారు. కానీ నాకు రెండు బ్యాలెన్స్ చేయడం ఎలానో తెలియలేదు. నిర్మాతగా సినిమాలు తీయడం, సొంతంగా ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయడం వలన తెలుగు సినిమాకు కాస్త దూరంగా ఉండాల్సి వచ్చింది ఇన్నాళ్ళూ అంటూ క్లారిటీ ఇచ్చింది.

Advertisement

మంచి బజ్ క్రియేట్ అయింది 

గాలి కిరీటి నటిస్తున్న జూనియర్ సినిమా మీద మంచి క్రియేట్ అయింది. సాయి కొర్రపాటి నిర్మాతగా చేస్తున్నారు కాబట్టి ఈ ఈవెంట్ కు ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమౌళి హాజరైన తర్వాత ఈ సినిమా మీద అంచనాలు మరికొంత పెరిగాయి. రాజమౌళి పనిచేసిన చాలామంది టెక్నీషియన్స్ ఈ సినిమా కోసం పనిచేశారు. ఇక ఈ సినిమా నుంచి ఇదివరకే రిలీజ్ అయిన వైరల్ సాంగ్ కూడా మంచి పాపులర్ అయింది. ఆ పాటలో డాన్సులతోనే అందరినీ ఆకర్షించాడు గాలికిరీటి. ఇక రేపు విడుదల కాబోయే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్క్ అవుట్ అయితే ఒక కొత్త హీరో దొరికినట్లే.

Also Read : Garividi Lakshmi : గరివిడి లక్ష్మి ఫస్ట్ లుక్ అనౌన్స్మెంట్, సరికొత్త పాత్రలో ఆనంది

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×