BigTV English

Ghaati Collection : దారుణంగా పడిపోయిన కలెక్షన్స్… పాపం అనుష్కకు ఐదు కోట్లు కూడా రాలేదు

Ghaati Collection : దారుణంగా పడిపోయిన కలెక్షన్స్… పాపం అనుష్కకు ఐదు కోట్లు కూడా రాలేదు
Advertisement

Ghaati Collections : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటించిన తాజా చిత్రం ఘాటీ.. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. చాలాకాలం తర్వాత అనుష్క చేసిన సినిమా కావడంతో ఈ సినిమాపై ముందు నుంచే భారీగా అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ మూవీ గత కొద్ది రోజులుగా వాయిదా పడుతూనే వచ్చింది. ఎట్టకేలకు సెప్టెంబర్ 5న థియేటర్లలోకి వచ్చేసింది.. మొదటి షో తోనే మిక్సీ్డ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ మూవీ కలెక్షన్లు కూడా అంతంత మాత్రమే వచ్చినట్లు తెలుస్తుంది. వీకెండ్ కూడా ఈ సినిమాకు పెద్దగా కలిసి రాలేదని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇప్పటివరకు ఎన్ని కోట్లు వసూలు చేసిందో ఒకసారి తెలుసుకుందాం..


“ఘాటీ” వీకెండ్ కలెక్షన్స్..

అనుష్క శెట్టి గత కొద్ది రోజులుగా తెలుగు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా ఈమె ప్రత్యేకమైన స్టోరీ తో ఘాటీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించింది. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. గతంలో ఎన్నడు లేని విధంగా ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించింది అనుష్క శెట్టి. ఇందులో ఈ ముద్దుగుమ్మ గిరిజన యువతి పాత్రలో నటించింది. ఆమె ఈ సినిమాలో తన పాత్రకు న్యాయం చేసిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మొదటిరోజు ఓపెనింగ్స్ పరవాలేదు అనిపించినా కలెక్షన్స్ మాత్రం దారుణంగా పడిపోయినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో మొదటి రోజు ‘ఘాటీ’ సినిమాకు మంచి కలెక్షన్స్ రాలేదు. మూడు రోజులకు గాను 4.9 కోట్లు నెట్. గ్రాస్ దాదాపు 10.5 కోట్లు వసూల్ చేసింది. నిన్న ఈ సినిమాకి కేవలం ఒక కోటికి పైగానే వసూలు చేసినట్లు తెలుస్తుంది. తమిళంలో ఈ సినిమాకు ఆశించిన స్పందన లేదట. అక్కడ నుంచి చెప్పుకోదగ్గ కలెక్షన్లు రాలేదు.. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకి చెప్పుకోదగ్గ కలెక్షన్లు అయితే రాలేదని తెలుస్తుంది. ఇక రెండో వరం ఈ సినిమా కలెక్షన్స్ ఏ మాత్రం పెరుగుతాయో చూడాలి..

Also Read: ఈ వారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు స్పెషల్..!


ఘాటి స్టోరీ విషయానికొస్తే.. 

క్రిష్ డైరెక్షన్, యువి క్రియేషన్స్ వంటి టాప్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్ వాల్యూలకి చాలా అట్రాక్షన్స్ ఉన్నాయి. అన్నిటి కంటే ముఖ్యంగా టీజర్, ట్రైలర్ ప్రేక్షకులలో క్యూరియాసిటీ కలిగించాయని చెప్పవచ్చు. రిలీజ్ కి ముందు భారీ అంచనాలు క్రియేట్ అయినా సరే రిలీజ్ అయిన తర్వాత అంత బజ్ రాలేదని చెప్పాలి. హీరో ప్రభు కుమారుడు విక్రమ్ ప్రభు నటించారు. జగపతి బాబు, రాజు సుందరం, జాన్ విజయ్, జిష్షు సేన్ గుప్తా, లారిస్సా బోనేసి, వీటీవీ గణేష్ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటించారు. ఓడిశా, ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని తూర్పు కనుమల్లో గంజాయి మాఫియా సామ్రాజ్యాన్ని కుందల నాయుడు, కాష్టాల నాయుడు తమ కనుసైగల్లో శాసిస్తు ఉంటారు.ఆ ప్రాంతంలోనే శీలావతి కండక్టర్‌గా ఉద్యోగం చేస్తూ.. వైద్య వృత్తిలో ఉన్న దేశీ రాజును ప్రేమిస్తుంది. గంజాయి ముఠాల్లోకి శీలావతి ఎలా ప్రవేశించింది. ఆమెకు జరిగిన అన్యాయం గురించి ఆమె ఎలాంటి రివెంజ్ తీర్చుకున్నది అన్నది ఈ సినిమా స్టోరీ.  ఏదో కొత్త మెసేజ్ ఇవ్వాలని క్రిష్ అనుకున్న కూడా అది కాస్త బెడిసి కొట్టిందని తెలుస్తుంది.. ఏది ఏమైనా కూడా ఇన్నాళ్లకు వచ్చిన అనుష్క సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోవడం పై అభిమానులు నిరాశ చెందుతున్నారు.

Related News

Spirit : కేవలం పోలీస్ కాదు ఖైదీ కూడా, సందీప్ రెడ్డి వంగ గట్టిగానే ప్లాన్ చేశాడు

Dheekshith Shetty : ఒక సినిమా అవ్వకముందే ఇంకో సినిమాకి అల్లు అరవింద్ అడ్వాన్స్ ఇచ్చారు

Upasana -Ramcharan: కవల పిల్లలకు జన్మనివ్వబోతున్న ఉపాసన.. పోస్ట్ వైరల్!

Dude Movie: 100 కోట్ల క్లబ్ లో చేరిన ప్రదీప్ డ్యూడ్.. ముచ్చటగా మూడోసారి!

OG Collections: ముగిసిన థియేట్రికల్ రన్.. ఓజీ టోటల్ కలెక్షన్స్ ఎంతంటే?

RGV : సీడీ లు అమ్ముకునే నేను అలా డైరెక్టర్ అయ్యాను

Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?

SYG : సినిమా నిర్మించడానికి అష్ట కష్టాలు, మళ్లీ డిస్ట్రిబ్యూషన్ మీద ఆశలు

Big Stories

×