OTT Movies : ప్రతివారం కొత్త సినిమాల సందడి ఎక్కువగా ఉంటుంది. అటు థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలు మాత్రమే కాదు. ఓటీటీల్లోకి ప్రతివారం బోలెడు సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. థియేటర్లలోకి వచ్చే సినిమాలు కన్నా డిజిటల్ ప్లాట్ఫారం లోకి వచ్చే సినిమాలకే ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. గతవారం థియేటర్లోకి వచ్చిన మూడు సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ కలెక్షన్లు పరంగా మాత్రం కాస్త ఆసక్తికరంగానే వసూలు చేస్తున్నాయి. మూడు సినిమాల్లో లిటిల్ హార్స్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి తేజ్ సజ్జా ‘మిరాయ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘కిష్కంధపురి’ చిత్రాలు థియేటర్లలోకి రాబోతున్నాయి.. ఈవారం ఈ రెండు సినిమాలపై కాస్త అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. మరి ఏ మూవీ ప్రేక్షకులను మెప్పిస్తుందో చూడాలి..
థియేటర్లలో మాత్రమే కాదు ఓటీటీల్లో ఈవారం ఆసక్తికర సినిమాలు ఎన్నో స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నాయి. ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే.. రజినీకాంత్ ‘కూలీ’, హిట్ బొమ్మ ‘సు ఫ్రమ్ సో’ ఈ వీకెండ్ స్ట్రీమింగ్ కానున్నాయి. బాలీవుడ్ హిట్ మూవీ సయరా కూడా ఈ వారం ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. కేవలం సినిమాలు మాత్రమే కాదు.. డబ్బింగ్ సినిమాలతో పాటుగా వెబ్ సిరీస్ కూడా రిలీజ్ అవుతుండడంతో ఈవారం మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి. మరిక ఆలస్యం ఎందుకు? ఈవారం స్ట్రీమింగ్ కి రాబోతున్న చిత్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందాం..
డాక్టర్ సెస్ రెడ్ ఫిష్, బ్లూ ఫిష్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 08
సయారా (హిందీ సినిమా) – సెప‍్టెంబరు 12 (రూమర్ డేట్)
సు ఫ్రమ్ సో (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 09
ఓన్లీ మర్డర్స్ ఇన్ ద బిల్డింగ్ సీజన్ 5 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 09
రాంబో ఇన్ లవ్ (తెలుగు సిరీస్) – సెప్టెంబరు 12
హెల్లువా బాస్ సీజన్ 1 & 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 10
ద గర్ల్‌ఫ్రెండ్ (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 10
వెన్ ఫాల్ ఈజ్ కమింగ్ (ఫ్రెంచ్ సినిమా) – సెప్టెంబరు 10
కూలీ (తెలుగు డబ్బింగ్ మూవీ) – సెప్టెంబరు 11
డూ యూ వాన్నా పార్టనర్ (హిందీ సిరీస్) – సెప్టెంబరు 12
ఎవ్రీ మినిట్ కౌంట్స్ సీజన్ 2 (స్పానిష్ సిరీస్) – సెప్టెంబరు 12
ల్యారీ ద కేబుల్ గాయ్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12
జెన్ వీ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) – సెప్టెంబరు 12
డిటెక్టివ్ ఉజ్వలన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – సెప్టెంబరు 12
ద రిట్యూవల్ (ఇంగ్లీష్ మూవీ) – సెప్టెంబరు 12
మీషా (మలయాళ సినిమా) – సెప్టెంబరు 12
బకాసుర రెస్టారెంట్ (తెలుగు మూవీ) – సెప్టెంబరు 12
Also Read : సాగర్ పై రామారాజుకు అనుమానం.. అడ్డంగా బుక్ చేసిన శ్రీవల్లి.. కళ్యాణ్ కు దిమ్మతిరిగే షాక్..
మొత్తంగా చూస్తే ఈవారం 18 సినిమాలు స్ట్రీమింగ్ కి రాబోతున్నాయి. గతవారంతో పోలిస్తే ఈవారం నాలుగైదు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. హిందీ డబ్బింగ్ చిత్రాలు కూడా ఇందులో ఉండడంతో ప్రేక్షకులు ఎక్కువగా ఈ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు . ఇక తేజా సజ్జ నటిస్తున్న విజువల్ వండర్ మూవీ మిరాయ్ కోసం అభిమానులు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందులో ముఖ్యంగా వైబ్ ఉంది బేబీ అంటూ రిలీజ్ అయిన సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. మరి థియేటర్ లోకి వచ్చిన తర్వాత ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ని అందుకుంటుందో చూడాలి…