BigTV English

Gild Producers: రేపు మరోసారి భేటి కానున్న గిల్డ్ ప్రొడ్యూసర్స్.. మేనేజర్స్… సమ్మెపై మళ్ళీ చర్చలు!

Gild Producers: రేపు మరోసారి భేటి కానున్న గిల్డ్ ప్రొడ్యూసర్స్.. మేనేజర్స్… సమ్మెపై మళ్ళీ చర్చలు!

Gild Producers: ఇన్ తెలుగు సినీ కార్మికులు ఇటీవల పెద్ద ఎత్తున సమ్మె నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 20 రోజులపాటు ఈ సమ్మెను నిర్వహించడంతో ఎన్నో సినిమాలు షూటింగ్ బంద్ కావడమే కాకుండా నిర్మాతలకు భారీ స్థాయిలో నష్టాలు వచ్చాయి. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలను పెంచాలని నియమం ఉన్నప్పటికీ ఈసారి తమకు ఏకంగా 31% వేతనాలు పెంచాలి అంటూ సినీ కార్మికులు సమ్మె నిర్వహించారు. అయితే ప్రతి మూడు సంవత్సరాలకు ఇలా కార్మికులు సమ్మె చేయడం జరుగుతుందని, గతంలో ఒకేసారి 50 రోజులపాటు సమ్మె జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.


వేతనాల పెంపు కోసం సమ్మె..

ఇలా కార్మికుల డిమాండ్లను కచ్చితంగా నిర్మాతలు నెరవేర్చాలని తమకు 31% వేతనాలు పెంచితేనే షూటింగ్స్ లోకి వస్తాము అంటూ డిమాండ్ చేశారు అయితే ఈ వ్యవహారం కొనసాగుతూ ఉన్న నేపథ్యంలో చివరికి తెలంగాణ ప్రభుత్వం కూడా జోక్యం చేసుకొని ఫిలిం ఫెడరేషన్ అలాగే ప్రొడ్యూసర్ గిల్డ్ మధ్య పలు ఒప్పందాలను కుదరచ్చడంతో కార్మికుల సైతం సమ్మె విరమించి సినిమా షూటింగ్స్ లోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం సినిమాలన్నీ తిరిగి షూటింగ్ పనులు జరుపుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలోనే రేపు మరోసారి గిల్డ్ ప్రొడ్యూసర్స్, మేనేజర్లు బేటి కాబోతున్నారని తెలుస్తోంది.


గిల్డ్ ప్రొడ్యూసర్స్.. మేనేజర్స్ భేటీ..

ఈ భేటీ రేపు హోటల్ దస్పల్లాలో జరగబోతుందని సమాచారం అయితే ఈ సమావేశంలో భాగంగా సినీ కార్మికుల సమ్మె తర్వాత జరిగిన పరిణామాలు అలాగే కార్మికుల స్కాలర్షిప్స్ గురించి, సినిమా షూటింగ్స్ కోసం బయట నుంచి వచ్చే వారి అంశాలపై చర్చలు జరగబోతున్నట్టు సమాచారం. ఇలా సమ్మె నిర్వహిస్తున్న నేపథ్యంలో బయట నుంచి కార్మికులు షూటింగ్స్ లో పాల్గొన్నప్పటికీ పెద్ద ఎత్తున ఫిలిం ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ షూటింగ్స్ బంద్ చేయించారు. ఈ క్రమంలోనే ఈ విషయాలన్నింటి గురించి కూడా రేపు గిల్డ్ ప్రొడ్యూసర్స్, మేనేజర్లు బేటి కాబోతున్నారని తెలుస్తుంది.  మరి ఈ భేటీలో ఏ విధమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.

చొరవ తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం…

సినీ కార్మికుల కోసం ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచే విధంగా నియమం ఉంది. అయితే ఈసారి తమకు 31% పెంచాలని డిమాండ్ చేశారు. అంత మొత్తంలో ఇవ్వలేం అంటూ నిర్మాతలు కూడా తమ అభిప్రాయాన్ని తెలియజేయడంతో సమ్మె తీవ్రతరం అయింది. ప్రస్తుతం నిర్మాతలు ఒక సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం కోసం ఎంతో కష్టపడుతున్నప్పటికీ వారి కంటూ ఏ విధమైన లాభాలు లేవని అయినప్పటికీ సినిమాలపై ఉన్న ఫ్యాషన్ తోనే కోట్లు ఖర్చు చేసి సినిమాలు చేస్తున్నామని నిర్మాతలు తమ వాదనలను వినిపించారు. అదేవిధంగా కార్మికుల సైతం హీరోల కోసం వందల కోట్ల రెమ్యూనరేషన్ చెల్లించే నిర్మాతలు కార్మికుల కోసం 31% వేతనాలు ఎందుకు చెల్లించలేరు అంటూ వారి అభిప్రాయాలను కూడా వ్యక్తపరిచారు. ఇలా ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపించారు.

Also Read: Telugu Film Chamber: దయచేసి టికెట్ల రేట్లు పెంచొద్దు…  వేడుకున్న థియేటర్ యాజమానుల సంఘం!

Related News

Janhvi Kapoor: నా పెళ్లి అయిపోయింది.. అతనే నా భర్త అంటున్న జాన్వీ కపూర్

Jana Nayagan : సినిమా సంక్రాంతి కే, కానీ తలపతి ఫ్యాన్స్ కు దివాళి తో పండగ మొదలుకానుంది

Sunny Leone: సన్నీకి ప్రెగ్నెన్సీ అస్సలు వద్దు… కానీ పిల్లలు కావాలంట… అందుకే అలా!

Mamitha baiju : సూర్యతో ఛాన్స్ మిస్ చేసుకున్నా… ప్రేమలు బ్యూటీ ఆవేదన

Mowgli Glimpse : సుమ కొడుకు బానే కష్టపడ్డాడు, ఈసారి సక్సెస్ ఖాయమా.?

Anchor Suma: సుమ కొడుకు రోషన్ చిన్నప్పటి నిక్ నేమ్ అదేనా..అలా ఎలా సింక్ అయ్యింది భయ్యా!

Big Stories

×