Telugu Film Chamber: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో గందరగోళ వాతావరణ పరిస్థితులు ఏర్పడ్డాయి. గతంలో మాదిరి సినిమాలకు ప్రస్తుతం ఆదరణ లభించడం లేదని చెప్పాలి. ప్రేక్షకులు సినిమాలను చూడటానికి థియేటర్లకు రావడానికి ఏమాత్రం ఇష్టపడటం లేదు తద్వారా థియేటర్ యాజమాన్యులు పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటున్నారు. అలాగే సినిమాల కలెక్షన్లపై కూడా తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది. ఈ క్రమంలోనే శ్రీకాకుళం(Srikakulam) విజయనగరం (Vijayanagaram)థియేటర్ యాజమాన్యులు సినిమాల విషయంలో తెలుగు ఫిలిం చాంబర్ కు లేఖ రాశారు.
సినిమా టికెట్ల రేట్లు పెరగటమే కారణమా?
ప్రస్తుతం ప్రేక్షకులు థియేటర్ కు వచ్చే సినిమా చూడాలంటే ఎంతో భయపడుతున్నారని అందుకు గల కారణం సినిమా టికెట్ల రేట్లు(Ticket Price) పెరగడమేనని తెలియజేశారు. పెరిగిన టికెట్ల ధరలు దాదాపు రెండు వారాలపాటు అమలులో ఉన్న నేపథ్యంలో కుటుంబం మొత్తం థియేటర్ కి వచ్చే సినిమా చూసే పరిస్థితిలో లేవు అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడానికి ప్రేక్షకులు కూడా వెనకడుగు వేస్తున్నారు. తద్వారా మరొక రెండు వారాలు ఉంటే సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పుడే చూడవచ్చనే ఆలోచనలో ఉన్నారు. అందుకే సినిమా టికెట్ల రేట్లు పెంచకుండా యధావిధిగానే సినిమాలను విడుదల చేయాలి అటు శ్రీకాకుళం విజయనగరం థియేటర్ యాజమాన్యులు ఫిలిం ఛాంబర్ ను కోరారు.
సినిమా టికెట్ల రేట్లు పెంచకూడదు..
*సినిమా టికెట్ల ధరలు పెంచకుండా యధావిధిగా సినిమాలను విడుదల చేయాలని కోరారు.
*ఒకవేళ సినిమా టికెట్ల ధరలు పెంచాలి అంటే మొదటి మూడు రోజుల మాత్రమే పెంచేలా చర్యలు తీసుకోవాలి.
*అభిమానుల కొరకు బెనిఫిట్ షోలకు నిర్మాతల ఇష్ట ప్రకారం సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవచ్చు.
* సినిమా టికెట్ల రేట్లు పెంచితే హీరోను బట్టి రెండు కేటగిరీలుగా రూ. 50 నుంచి100 వరకు మాత్రమే పెరిగేలా చర్యలు తీసుకోవాలని థియేటర్ యాజమానులు కోరారు.
*అలాగే టికెట్ ధరలు పెంచేటప్పుడు థియేటర్ కు చెందవలసిన ఎంసీ చార్జీలు కూడా ఉన్నదానికి రెండింతలు రెట్టింపు చేయాలి అంటూ థియేటర్ యజమాను సంఘం తరఫున కోరుతూ ఫిలిం ఛాంబర్ కు కొన్ని ప్రతిపాదనలను చూచిస్తూ లేఖ రాశారు.
థియేటర్లకు కష్టకాలం…
పై తెలిపిన నిర్ణయాల వల్ల ప్రతి ఒక్కరికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుందని అలాగే తిరిగి ప్రేక్షకులను థియేటర్ వైపు నడిపించడానికి మార్గం సులబతరం అవుతుందని, ఈ నిర్ణయాలు ఇండస్ట్రీ అభివృద్ధికి తోడ్పడతాయని ఆశిస్తూ థియేటర్ యాజమానులు ఆశాభావం వ్యక్తం చేశారు. మరి విషయంపై ఫిలిం ఛాంబర్ నిర్ణయం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇటీవల ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా థియేటర్లో విడుదలైన నాలుగు వారాలకే ఓటీటీలో చూసే వెసులుబాటు ఉన్న నేపథ్యంలో చాలామంది థియేటర్ కు రావడానికి ఇష్టపడటం లేదు. తద్వారా ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.. వీటిపై కఠినమైన చర్యలు తీసుకుంటేనే థియేటర్లు బ్రతుకుతాయని లేకుంటే థియేటర్లో మూసేసుకోవాల్సిన పరిస్థితులు కూడా ఏర్పడతాయని చెప్పాలి.
Also Read: Vishal Dhansika: విశాల్, ధన్షిక.. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా..అంత తేడా ఉందా?