BigTV English

Jayasudha Son: నాన్న చనిపోతాడని ముందే తెలుసు.. ఆయన ఆత్మహత్యకు కారణం ఇదే.. జయసుధ కొడుకు

Jayasudha Son: నాన్న చనిపోతాడని ముందే తెలుసు.. ఆయన ఆత్మహత్యకు కారణం ఇదే.. జయసుధ కొడుకు


jayasudha son About His Father Suicide: సహజ నటి, అలనాటి హీరోయిన్ జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్,కృష్ణ వంటి అగ్ర హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. ఒకప్పుడు అగ్ర నటిగా రాణించిన ఆమె ప్రస్తుతం తల్లి, అత్త పాత్రల్లో మెప్పిస్తున్నారు. స్టార్ సెలబ్రిటీ అయినప్పటికీ జయసుధ ముందు నుంచి తన వ్యక్తిగత విషయంలో గొప్యత పాటిస్తుంటారు. తన పర్సనల్ లైఫ్ ని మీడియాకు దూరంగా ఉంచుతారు. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ వివాదాలకు దూరంగా ఉండేవారు. అయితే బాలీవుడ్ నిర్మాత నితిన్ కపూర్ ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఇద్దరు కుమారులు.

భర్త మరణంతో డిప్రెషన్ లోకి ..


నటి ఓవైపు.. భార్య, తల్లిగా మరోవైపు జీవితం సాఫీ సాగుతున్న తరుణంగా ఆమె భర్త ఆత్మహత్య జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ ఘటనతో ఒక్కసారిగా ఆమె జీవితం కుదేలైంది. 2017లో ఆమె భర్త నితిన్ కపూర్ ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ అంశం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఈ విషయంలో జయసుధపై కొన్న ఆరోపణలు కూడా వచ్చాయి. భర్త మరణం, మరోవైపు నిందలు ఆమెను మరింత కుంగదీశాయి. మానసిక ఒత్తిడికి గురై కొంతకాలం ఇండస్ట్రీకి దూరైమంది. ఆ తర్వాత అమెరికాలో చికిత్స అనంతరం తిరిగి రీఎంట్రీ ఇచ్చింది. అయితే తాజాగా తన తండ్రి ఆత్మహత్యపై జయసుధ కొడుకు నిహార్ కపూర్ స్పందించాడు.

నాన్న చనిపోతాడన ముందే తెలుసు

పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు చిత్రంలో కీలక పాత్రలో పోషించిన నిహార్ తాజా ఓ ఇంటర్య్వూలో తన తండ్రి ఆత్మహత్యపై స్పందించాడు. తన తండ్రి చనిపోతాడని తమకు ముందే తెలుసని, తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ తరచూ చెబుతుండేవారంటూ షాకింగ్ విషయం బయటపెట్టారు. ‘నాన్నకు చిన్న వయసులోనే డయాబెటిస్ వచ్చింది. అందుకు ఆయన ఫిట్ నెస్ విషయంలో జాగ్రత్తగా ఉండేవారు. తరచూ జిమ్ చేస్తుండేవారు. అయితే నాన్న నిర్మాతగా చేసిన కొన్ని సినిమాల ఆడాయి.. మరికొన్ని ఫెయిల్ అయ్యాయి. చాలా వరకు ఆయన చిత్రాలు ఆడేవి కాదు.

ఆత్మహత్యకు కారణమిదే

అదే సమయంలో ఓ నిర్మాత ఆయన సినిమాకు లాక్కున్నారు. ఎన్ని చేసిన కూడా ఫలితం కనిపించకపోయేది. దీంతో నాన్న తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. దీంతో ఏళ్ల తరబడి ఆయన డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఒత్తిడిలో ఉన్నవాళ్లు తన చూట్టూ ఉన్నవాళ్లని బాధపెడుతున్నాని, తన వల్ల తమ వారి జీవితాలు నాశనం అవుతున్నాయని అనుకుంటారు. నాన్న విషయంలో అదే జరిగింది. పదేళ్ల నుంచి చనిపోతానని అంటుండేవారు. ఒకరోజు ముంబైలోని తన ఇంటి నుంచి దూకేసి చనిపోయారు. దానికి ముందు మేమంత బంధువుల ఫంక్షన్ వెళ్లాల్సి ఉండే. ఆయన కొత్త బట్టలు కూడా తీసుకున్నారు. అంతలోనే ఆయన ప్రాణం తీసుకున్నారు. ఈ ఘటన నుంచి బయటకు రావడానికి అమ్మకు చాలా కాలం పట్టింది. తను కూడా కొంతకాలం డిప్రెషన్ లోకి వెళ్లింది.

Also Read: Kissik Talks: గోవా వీడియో.. బాయ్ ఫ్రెండ్ తో గొడవలు.. పెళ్లి వద్దురా బాబూ అనిపించింది..

Related News

Peddi : రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా బ్లాస్ట్, సీక్రెట్స్ రీవీల్ చేసిన జాన్వీ కపూర్  

Rishab Shetty : వివాదంపై స్పందించిన రిషబ్ శెట్టి, అప్పుడు తెలుగులో మాట్లాడుతా

Naga Vasmsi: సినిమా హక్కుల కోసం నాగ వంశీ ప్రయత్నం, ప్రభాస్ తో పోటీ అవసరమా?

Mega158 : మెగాస్టార్ సినిమా ముహూర్తం క్యాన్సిల్? ఆ సెంటిమెంట్ కోసమే వెయిటింగ్

Dimple Hayathi: వివాదంలో డింపుల్ హయతి… రహస్యంగా పెళ్లి కూడా చేసుకుందా?

Priyanka Mohan : పవన్ తో OG బ్యూటీ రొమాంటిక్ ఫోజులు.. ఆ క్లోజ్ నెస్ చూశారా?

Poonam Kaur: బాలయ్య vs చిరంజీవి.. పూనమ్ సంచలన పోస్ట్…అగ్గి రాజేసిందిగా!

IMDB Movie list: 25 ఏళ్లలో మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ జాబితాలో ప్రభాస్, బన్నీ మూవీలు!

Big Stories

×