భారతీయ రైల్వేలో ప్రయాణీకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆహ్లాదకరంగా ప్రయాణించేందుకు కొన్ని నిబంబంధనలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. రైల్లో వెళ్లే ప్రతి ఒక్కరు ఆ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించే ప్యాసింజర్లు మద్యంపానం, ధూమపానం చేయకూడదు. ఒకవేళ అలా చేస్తే రైల్వే పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారు. అయితే, నిబంధనలు ఉన్నప్పటికీ, చాలా మంది వాటిని పట్టించుకోవడం లేదు. తాజాగా ఓ మహిళ ఏకంగా ఏసీ కోచ్ లోనే సిగరెట్ కాల్చింది. పైగా అలా కాల్చకూడదని చెప్పిన వారి మీద ఒంటికాలితో కస్సున లేచింది. ఆమె ఓవరాక్షన్ ను ఎదురుగా ఉన్న ప్రయాణీకుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఓ మహిళ ఏసీ కోచ్ లో ప్రయాణం చేస్తుంది. లోయర్ బెర్త్ లో ఆమె పడుకుని ఉంది. నైట్ టైమ్ కావడంతో చాలా మంది పడుకున్నారు. అదే సమయంలో ఆమె కోచ్ లోపలే సిగరెట్ వెలిచింది. హాయిగా స్మోక్ చేస్తుంది. ఇతర ప్రయాణీకులు పొగ కారణంగా ఇబ్బందికి గురయ్యారు. వెంటనే ఆబ్జెక్షన్ చెప్పారు. ఆమె తప్పైందని చెప్పాల్సిందిపోయి, ప్రశ్నించిన వారిపైనే తిరగబడింది. ఈ రైలు మీదా? అంటూ ఒంటికాలు మీద లేచింది. చేసిందే తప్పు, పైగా ఇందేంటని అడిగిన వారిపై ప్రతాపాన్ని చూపించడంతో కోచ్ లోని ఇతర ప్రయాణీకులు ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగరెట్ తాగాలనిపిస్తే, బయటకు వెళ్లి తాగాలి కానీ, కోచ్ లోపల తాగడం ఏంటని ప్రశ్నించారు. ఇతరులకు ఇబ్బంది కలగదా అంటూ మండిపడ్డారు. అదే సమయంలో ఈ తతంగాన్ని వీడియో తీస్తున్న యువకుడిపై ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేసింది. వెంటనే తన వీడియోను డిలీట్ చేయాలని మండిపడింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
రైలులోని ఏసీ కంపార్ట్మెంట్లో సిగరెట్ కాల్చి.. ప్రశ్నించిన వారిని దబాయించిన మహిళ
అభ్యంతరం తెలిపిన తోటి ప్రయాణికులపై రెచ్చిపోయిన మహిళ pic.twitter.com/cn7h2mEwCW
— Telugu Scribe (@TeluguScribe) September 15, 2025
Read Also: హైదరాబాద్ బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. ఆ పనులు మొదలయ్యాయ్!
ఈ వీడియోను చూసి నెటిజన్లు సదరు మహిళపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పు చేయడమే కాకుండా, ఇదేంటని అడిగిన వారి మీద రుబాబు చూపించడం ఆమె తల పొగరుకు నిదర్శనం అంటున్నారు. ఈ వీడియోపై రైల్వే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
Read Also: కళ్లలో లైట్లు కొడుతున్నారా? ఇక మీ ఆటలు సాగవు.. ఇలా చేయకపోతే జరిమానా తప్పదు!