Hanuman Ansh: ఈ మధ్యకాలంలో స్టార్ తారాగణంతో పని లేకుండా కేవలం కంటెంట్ కే ప్రాధాన్యతనిస్తూ తెరకెక్కుతున్న చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాలను అందుకుంటున్నాయి . ఈ క్రమంలోనే ఎటువంటి అంచనాలు లేకుండా కేవలం 1.8 కోట్ల తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి.. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం హనుమాన్ అంశ్. హిందీలో విడుదల అయ్యి సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ముఖ్యంగా ఈ సినిమాను తెలుగు రైట్స్ ను ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దక్కించుకున్నట్లు ప్రకటించారు. కానీ ఎప్పుడు విడుదల చేయబోతున్నారు అనే విషయంపై ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ విడుదల చేయలేదు. దీంతో ఈ సినిమా విడుదలపై నెలకొన్న సందిగ్ధతకు ఇప్పుడు నిర్మాణ సంస్థ తెరదించింది.ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదీన తెలుగులో విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
వాస్తవానికి ఈ సినిమా తెలుగు వెర్షన్ సెప్టెంబర్ 18న విడుదల కావాల్సి ఉండగా.. త్రివిక్రమ్ తన ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ ద్వారా విడుదల చేయాల్సి ఉండగా దాన్నుంచి ఆయన తప్పుకున్నారు. దీంతో హైదరాబాదులో జరగాల్సిన తెలుగు ఈవెంట్ కూడా రద్దయింది. అందుకే ఈ సినిమా తెలుగు విడుదల కొద్ది రోజులు వాయిదా పడింది. దీంతో హోంబలే ఫిలిమ్స్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే బాధ్యతలను తీసుకుంది.
విశాల్ చతుర్వేది దర్శకత్వంలో నీమ్ కరోలి బాబా జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఆధ్యాత్మిక డ్రామా చిత్రం ఇది. ఇప్పటికే 400 కోట్లకు పైగా వసూలు రాబట్టి బాక్సాఫీస్ వద్ద ఘన విజయం అందుకుంది. శోభినవ్ సత్య కరోలి బాబా పాత్రలో నటించారు. మరి ఇప్పటికే బాలీవుడ్ లో భారీ కలెక్షన్లు రాబట్టి సంచలనం సృష్టించిన ఈ సినిమా.. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. మరి ఈ చిత్రాన్ని తెలుగు ఆడియన్స్ ను ఏ విధంగా ఆదరిస్తారో చూడాలి.
also read: తాజ్ మహల్’ హీరోయిన్ నుష్రత్ భరూచాకి ప్రమాదం.. ఇప్పుడెలా ఉందంటే?
అక్టోబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు హోంబలే ఫిలిమ్స్ అధికారికంగా ప్రకటించింది. అయితే అదే రోజున విక్టరీ వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆదర్శ కుటుంబం చిత్రంతో పాటు యంగ్ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న విభిన్న కథ చిత్రం కామ్రేడ్ కళ్యాణ్ కూడా థియేటర్లలో విడుదల కాబోతోంది. మరి ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్లతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనుమాన్ అంశ్ కూడా బరిలోకి దిగుతుండడంతో సినీ ప్రియులకు పండగ వాతావరణం నెలకొననుంది. మరి ఈ మూడు చిత్రాలలో ఏ సినిమా మంచి విజయం అందుకుంటుందో చూడాలి.
‘హనుమాన్ అంశ్’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం..!
We are delighted to bring the much loved #HanumanAnsh in TELUGU, for audiences to witness its divine brilliance on the big screen across the world. ❤️🙏#HanumanAnshTelugu Worldwide Release on OCTOBER 9th by @hombalefilms.… pic.twitter.com/kusXOCK3IV
— Hombale Films (@hombalefilms) October 2, 2026