E-Paper
Advertisement

‘తాజ్ మహల్’ హీరోయిన్ నుష్రత్ భరూచాకి ప్రమాదం.. ఇప్పుడెలా ఉందంటే?

‘తాజ్ మహల్’ హీరోయిన్ నుష్రత్ భరూచాకి ప్రమాదం.. ఇప్పుడెలా ఉందంటే?
Advertisement

Nushrratt Bharuccha: సెలబ్రిటీలకు అనుకొని ఆపదలు అభిమానులను తీవ్రత ఆందోళనలకు గురి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే ఒక హీరోయిన్ పనిమీద విదేశాలకు వెళ్లగా అక్కడ అనుకోకుండా యాక్సిడెంట్ జరిగిందట. అయితే ఆ ప్రమాదంలోఆమె వెన్నెముక విరగడంతో అక్కడే ఆమెకు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఆమె ఎవరో కాదు ‘తాజ్ మహల్ ‘ సినిమాతో అందరి దృష్టిని ఆకట్టుకున్న నుష్రత్ భరూచా (Nushrratt bharuccha). 2010లో తాజ్ మహల్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఎక్కువగా బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆడియన్స్ కు చేరువ అవుతున్న ఈ బాలీవుడ్ నటి ఇటీవల ప్రమాదానికి గురయ్యారు.

హీరోయిన్ కి ప్రమాదం.. విరిగిన వెన్నెముక..

ఇండోనేషియాలోని బాలిలో ఒక పని నిమిత్తం లేదా విహారయాత్ర నిమిత్తం ఆమె బాలికి వెళ్ళగా.. అక్కడ జరిగిన ఒక దురదృష్టకర ప్రమాదంలో ఆమె వెన్నెముకకు తీవ్ర గాయం అయిందట. ప్రమాదం జరిగిన వెంటనే ఆమెను బాలిలోని స్థానిక ఆసుపత్రిలో చేర్పించి ప్రాథమిక చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఇకపోతే ఆమె వెన్నెముక ఫ్రాక్చర్ అవ్వడం వల్ల ముంబైలో సర్జరీ చేయించాల్సి ఉంటుందని ఆమె పీఆర్ టీం అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. ముఖ్యంగా ఆమెను బాలి నుండి ముంబైకి తీసుకురావడానికి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారట. ఇక సర్జరీ తర్వాత కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేటట్టు కనిపిస్తోందని , దీనివల్ల ఆమె తదుపరి షూటింగ్ షెడ్యూల్ కూడా వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. అంతేకాదు ఈ కష్ట సమయంలో ఆమె వ్యక్తిగత గోప్యతను గౌరవించాలని, నుష్రత్ భరూచా బృందం అభిమానులను కోరింది.

ఆందోళన చెందుతున్న అభిమానులు..

Advertisement

నుష్రత్ భరూచా వెన్నెముక ఫ్రాక్చర్ అయ్యిందని ఆమె అధికారిక పిఆర్ టీమ్ ప్రకటించడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అంటూ ఆరా తీస్తున్నారు. అయితే నుష్రత్ భరూచా కు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఏ ప్రమాదంలో ఆమెకు ఇలా వెన్నెముక గాయమైంది అనే విషయంపై ఆమె పీఆర్ టీమ్ స్పష్టత ఇవ్వలేదు.

also read: తెల్ల కాగితం మూవీ రివ్యూ.. హర్ష్ రోషన్ హిట్ కొట్టాడా?

షూటింగ్ వాయిదా పడనున్న నుష్రత్ భరూచా సినిమాలు..

Advertisement

నుష్రత్ భరూచా సినిమాల విషయానికి వస్తే ..ప్రస్తుతం ఈ ఘూస్ఖోర్ పండత్ అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా తో పాటు బన్ టిక్కీ అనే సినిమాలో నటిస్తోంది.అలాగే అజయ్ దేవగన్ , రణబీర్ కపూర్ నటిస్తున్న ఒక చిత్రంలో కూడా ఈమె భాగమైంది. మరోవైపు సైడ్ హీరోస్ అనే మరో చిత్రంలో నటిస్తోంది. అయితే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఏదేమైనా ఈమె ప్రమాదానికి గురికావడంతో ఈమె నటిస్తున్న సినిమాల షూటింగ్లు కొంతవరకు వాయిదా పడే అవకాశాలున్నట్లు సమాచారం. ఈమె త్వరగా రికవరీ అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Related News

అలనాటి ఈ అందాల తారలు ఇప్పుడెలా ఉన్నారో చూసారా?

రేణుకాస్వామిని ఇంత దారుణంగా హత్య చేశారా?

గాయం తర్వాత బాలయ్య ఫుల్ స్వింగ్‌లోకి.. ‘దాదా’కు ఇక పరుగులే!

చీరలో స్రవంతి చొక్కారపు.. చూపు తిప్పుకోనివ్వడం లేదుగా!

పోస్టర్లు అదిరిపోయాయి.. సినిమాలు మాత్రం బొక్కబోర్లా పడ్డాయి!

జానీ మాస్టర్ లవ్ స్టోరీ తెలుసా?..అసలు ట్విస్ట్ ఇదే!

రెండు వారాల్లోనే రూ. 1.3 కోట్ల ఆదాయం.. విజయ్ దేవరకొండ ‘అన్ హైప్’ దూకుడు!

Big Stories

Advertisement
×