BigTV English

Pawan Kalyan on Reviews : రివ్యూలపై పవన్ రియాక్షన్… యుద్ధం చేయాల్సిందే అంటూ

Pawan Kalyan on Reviews : రివ్యూలపై పవన్ రియాక్షన్… యుద్ధం చేయాల్సిందే అంటూ

Pawan Kalyan on Reviews : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిన కొన్ని రోజుల తర్వాత పేపర్ లో రివ్యూ వచ్చేది. రివ్యూ కూడా చాలా అర్థవంతంగా ఉండేది. టెక్నికల్ గా కూడా సినిమా గురించి అప్పట్లో చాలా మాట్లాడేవారు. ఆ రివ్యూకు కూడా ఒక పద్ధతి ఉండేది. ఇప్పుడు రివ్యూలకు మాత్రం పద్ధతిపాడు లేకుండా అయిపోయింది.


సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు సినిమాకి సంబంధం లేకుండా ఏవేవో మాట్లాడుతూ ఉంటారో కొంతమంది వ్యక్తులు. కేవలం వాళ్లు పదిమంది దృష్టిలో పడడానికి మాత్రమే కొన్నిసార్లు రివ్యూ చెప్తారు. ఏదేమైనా సినిమా పూర్తికాకముందే రివ్యూ ఇచ్చిన వ్యక్తులు కూడా ఉన్నారు. వీళ్ళందర్లో కూడా కొంతమంది జన్యూన్ రివ్యూ చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఈ రివ్యూ వలన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా నష్టం వాటిల్లుతుంది. దానిపైన పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు.

రివ్యూలపై పవన్ రియాక్షన్


హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఒక జర్నలిస్ట్ ఒక సినిమా చేయడం అంటే మీరు చెప్పినట్లు నిజంగానే ఒక యుద్ధం. స్క్రిప్ట్ దగ్గర నుంచి ల్యాబ్ నుంచి ప్రింట్ బయటకు వచ్చేవరకు చాలా యుద్ధాలు చేయాల్సి వస్తుంది. ఈ తరుణంలో కొంతమంది రివ్యూలు అంటూ, ట్విట్టర్ రివ్యూలు అంటూ సినిమాను కిల్ చేస్తున్నారు దీని గురించి ఏం చెప్తారు అని అడిగినప్పుడు. మనం తినే భోజనం వెనక్కి ఒక యుద్ధం చేయాల్సి ఉంటుంది. అలానే వీటన్నిటిని కూడా మనం ఎదుర్కోవాలి. ఒకవేళ నేను ఇలాంటి వాటికే భయపడి ఉంటే 151 యొక్క సీట్లున్న పార్టీని 11 సీట్లకు తీసుకురాలేను. ఏది వచ్చిన ఎదుర్కొని నిలబడాలి అని పవన్ కళ్యాణ్ ఇన్ డైరెక్ట్ గా రివ్యూల పైన రియాక్షన్ ఇచ్చారు.

పలు నిర్మాతలు కూడా మాట్లాడారు 

గతంలో రివ్యూలు గురించి పలు నిర్మాతలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. నాగవంశీ లాంటి నిర్మాతలు ఏకంగా నా సినిమాలకు రివ్యూలు ఇవ్వకండి అని మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. బాగున్న సినిమాలకు బాగుంది అని రివ్యూలు కూడా రాయరు అంటూ మాట్లాడారు. కొన్నిసార్లు రివ్యూలు బాగో లేకపోయినా కూడా కలెక్షన్లు మాత్రం అద్భుతంగా వస్తాయి అంటూ అప్పట్లో నాగ వంశీ తెలిపారు. బాబీ దర్శకత్వంలో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమాకి రివ్యూలు పెద్దగా పాజిటివ్ రాలేదు. కానీ సినిమా కలెక్షన్లు మాత్రం అద్భుతంగా వచ్చాయి. దీనితో రివ్యూలు సినిమా సక్సెస్ ను డిసైడ్ చేయలేవు అని అర్థమైంది. కన్నప్ప విషయానికి సంబంధించి కూడా పెద్దగా నెగిటివ్ రివ్యూలు కనిపించలేదు.

Also Read: Pawan Kalyan: నేను పవన్ కళ్యాణ్ కాలర్ పట్టుకున్నా.. యాక్టర్ వెంకట్

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×