Hari Hara Veera Mallu Censor Report: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. జూలై 24న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంరతం పవన్ నుంచి వస్తున్న తొలి చిత్రమిది. దీంతో ఈ సినిమా కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ అంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామా వస్తున్న ఈ చిత్రంపై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపై మరింత బజ్ పెరిగింది. ఇప్పుడు హరి హర వీరమల్లుపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. మూవీ రిలీజ్ కు ఎన్నో అడ్డుంకులు వచ్చినా.. బజ్ మాత్రం తగ్గలేదు.
వీరమల్లుపై బోర్డు ప్రశంసలు
మరో పది రోజుల్లో మూవీ థియేటర్లలోకి రానున్న నేపథ్యంతో చిత్ర బృందం ప్రమోషన్స్ జోరు పెంచింది. తాజాగా ఈ సినిమా సెన్సార్ వర్క్ ని పూర్తి చేసుకుంది. ఈ మేరకు బోర్డు సభ్యులు మూవీ రిపోర్టును ఇచ్చింది. ఈ సినిమా చూసిన బోర్డు సభ్యులు మూవీపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఈ మూవీ కథనం బోర్డు సభ్యులను బాగా ఆకట్టుకుందట. అయితే సినిమాని ప్రశంసించిన బోర్డు సభ్యులు.. కొన్ని సన్నివేశాలపై అభ్యంతరం తెలిపాయ. దీంతో హరి హర వీరమల్లుకు భారీ కట్స్ విధించారు. అలాగే ట్రైలర్ ప్రధాన బలంగా ఉన్న అర్జున్ దాస్ వాయిస్ కు కూడా కత్తేర పెట్టారట. పవన్ ఏరికోరి మరి అర్జున్ దాస్ తో వాయిస్ ఓవర్ ఇప్పించుకున్నాడు.
వీరమల్లు సెన్సార్ పూర్తి
పవన్ ఎంతో ఇష్టంగా పెట్టుకున్న ఆయన వాయిస్ కి సెన్సార్ కట్ చెప్పడం ఫ్యాన్స్, పవన్ కి షాక్ అనే చెప్పాలి. అలాగే సినిమాలో మొత్తం 24 సెకన్ల వరకు కట్ చెప్పిందట బోర్డు. ఇంతకి కట్టింగ్ కి గురైన ఆ సన్నివేశాలు ఏంటీ? అర్జున్ దాస్ వాయిస్ కి ఎందుకు కట్ చెప్పారో చూద్దాం! క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రం షూటింగ్ జ్యోతికృష్ణ డైరెక్షన్ తో ముగిసింది. ఈ సినిమాకు క్రిష్, జ్యోతికృష్ణలు దర్శకత్వం వహించారు. మెగా సూర్య్ ప్రొడక్షన్ పై బ్యానర్ పై ఏఏమ్ రత్నం నిర్మించారు. రెండు భాగాలుగా రూపొందిన ఈ సినిమా తొలి భాగాన్ని ‘హరి హర వీరమల్లు: కత్తి వర్సెస్ స్వార్డ్’ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ బోర్డు నుంచి యూ/ఏ సర్టిఫికెట్ ను పొందింది.
ఆ సన్నివేశాలపై బోర్డు అభ్యంతరం
అయితే ఈ సినిమాకి మాత్రం బోర్డు సభ్యులు భారీ కట్స్ చెప్పారు. సెన్సార్ బోర్డు సూచన మేరకు మూవీ టీం సుమారు 24 సెకన్ల సినిమాని కట్ చేసి, 34 సెకన్లు యాడ్ చేశారట. ఇందులో 5 సన్నివేశాలని తొలగించాలని బోర్డు మూవీ టీం ఆదేశించింది. అందులో అర్జున్ దాస్ వాయిస్ తో సీన్ కూడా ఉండట గమనార్హం. పవన్ ఎంతో ఇష్టంగా అర్జున్ దాస్ తో వాయిస్ ఓవర్ ఇప్పించుకున్నాడు. మొత్తం అతడి వాయిస్ లో 10 సెకన్ల కట్ విధించిందట బోర్డు. గర్బిణీ స్ట్రీ విజువల్ ని తగ్గించాలని సూచించింది. అలాగే టెంపుల్ డోర్ ను తన్నే సన్నివేశాన్ని తొలగించాలని బోర్డు సభ్యులు మూవీ టీంని ఆదేశించింది. ఇలా మూవీని ప్రశంసిస్తూనే వీరమల్లుకు భార కట్స్ విధించింది బోర్డు. మరోవైపు వీరమల్లు మూవీ సెన్సార్ పూర్తి చేసుకోవడం, బోర్డు సభ్యులు మూవీని ప్రశంసించడం తెలిసి అభిమానుల మాత్రం ఫుల్ ఖుష్ అవుతున్నారు. సెన్సార్ బోర్డు సభ్యుల రివ్యూ ప్రకారం చూస్తే జూలై 24న థియేటర్లలో వీరమల్లు జాతర మాములుగా ఉండదంటున్నారు.
Also Read: దీనస్థితిలో ప్రముఖ నటి.. మతిస్థిమితం కోల్పోయి రోడ్డుపై అనాథలా.. రక్షించిన పోలీసులు