Peddi Movie: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో పెద్ది సినిమా ఒకటి. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇక బుచ్చిబాబు విషయానికి వస్తే కనిపించడానికి సైలెంట్ గా ఉన్నా కూడా, అతనిలోనే టాలెంట్ మాత్రం బీభత్సమైన వైలెంట్. మొదటి సినిమాతోనే దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేశాడు. అది కూడా ఒక హీరోని పరిచయం చేస్తూ.
ఉప్పెన సినిమా తర్వాత బుచ్చిబాబు ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా వస్తుంది అని అందరూ ఊహించారు. కానీ అది జరగలేదు. మొత్తానికి రామ్ చరణ్ తో సినిమా అనౌన్స్ చేశాడు. సినిమా అనౌన్స్ చేయడం మాత్రమే కాకుండా భారీ టెక్నీషియన్స్ ని ఈ సినిమాలో ఇన్వాల్వ్ చేశాడు బుచ్చిబాబు. ఆ టెక్నీషియన్స్ ని అనౌన్స్ చేస్తేనే చాలామందికి ఆశ్చర్యం కలిగింది.
పెద్ది కోసం అతిపెద్ద నిర్ణయం
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే ఇదివరకే విడుదలైన ఫస్ట్ షాట్ బీభత్సమైన అంచనాలను పెంచింది. చాలా రోజులు పాటు చరణ్ ఆటిట్యూడ్, మ్యానరిజమ్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ముఖ్యంగా క్రికెట్ ఆడే సీన్లు చాలామంది రీ క్రియేట్ చేశారు. ఇకపోతే ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. విజయనగరం ప్రాంతాన్ని ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్నారు. దాదాపు 250 కోట్లు ఖర్చుపెట్టి విజయనగరం సెట్ వేస్తున్నారు. రోడ్లు, రైల్వే స్టేషన్ లో కూడా దీనిలో ఒక భాగం. ఇప్పటికే 300 కోట్లు ఖర్చు అయినట్లు సమాచారం వినిపిస్తుంది. దీనిని బట్టి సినిమాను ఏ స్థాయిలో నమ్ముతున్నారో అని అందరికీ ఒక క్లారిటీ వస్తుంది.
Also Read: Movie Ticket Price : గుడ్ న్యూస్ చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం… మల్టీప్లెక్స్‌ల్లో టికెట్ 200లే
భారీ ఓటిటి డీల్
ఈ సినిమాకి సంబంధించి ఓటిటి డీల్ కూడా ఫినిష్ అయిపోయింది. దాదాపు 100 కోట్లకు పైగా రైట్స్ తో నెట్ఫ్లిక్స్ దీనిని కొనుగోలు చేసింది. రామ్ చరణ్ కి జంటగా జాన్వీ కపూర్ నటిస్తుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కంప్లీట్ గా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడనున్నాడు. ఈ సినిమాలో గౌరు నాయుడు అనే పాత్రలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్నట్లు రీసెంట్ గానే అనౌన్స్ కూడా చేశారు. అయితే గురువు పాత్రలో నటిస్తున్నాడు అని తెలుస్తుంది. ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Also Read: SSMB29 : ఏసీ గదుల్లో నుంచి బయటికి రాని బాబు… జక్కన్న మూవీనే పెద్ద కౌంటర్