E-Paper
Advertisement

ఏపీ జలదోపిడీపై రేవంత్ సర్కార్ మౌనమెందుకు?: కేటీఆర్

ఏపీ జలదోపిడీపై రేవంత్ సర్కార్ మౌనమెందుకు?: కేటీఆర్
Advertisement

KTR: కృష్ణా జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతులు లేకుండా నీటిని తరలించుకుపోతోందని, దీనిని అడ్డుకోవడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సాగర్ నుండి అక్రమంగా పనులు జరుగుతున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటని ఆయన నిలదీశారు.

అనుమతులు లేకుండానే సాగర్ నుండి తరలింపు

Advertisement

నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి ఎటువంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం సొరంగం తవ్వి, 1,600 కిలోమీటర్ల మేర భారీ పైప్‌లైన్ నిర్మాణం చేపడుతోందని కేటీఆర్ ఆరోపించారు. తాగునీటి పథకం ముసుగులో 90 టీఎంసీల సాగునీటిని సైతం తరలించుకుపోయేందుకు కేవలం 8 నెలల్లోనే పనులు పూర్తి చేసేలా వేగంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని బయటపెట్టిన నమస్తే తెలంగాణ పత్రికకు ఆయన అభినందనలు తెలిపారు. ఒకవైపు శ్రీశైలం నుండి పోతిరెడ్డిపాడుకు నీటి తరలింపు కొనసాగుతుంటే.. మరోవైపు సంవత్సరం నుండి సాగర్ వద్ద నిర్మాణాలు జరుగుతున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.

బీజేపీ, కాంగ్రెస్, టీడీపీలపై విమర్శలు

Advertisement

ప్రధాని మోడీ ఆశీస్సులు, కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) అనుమతులు లేకున్నా ఏపీ ఈ జలదోపిడీకి పాల్పడుతోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలోని బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ అన్యాయంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు కుమ్మక్కై నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణకు కాకుండా చేస్తున్నాయని మండిపడ్డారు.

తాగునీటి నిల్వలపై స్పష్టత ఇవ్వాలి

తెలంగాణకు మిగిలిన 40 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాల కోసం కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం KRMBకి లేఖ రాసిందా లేదా చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల తాగునీటి అవసరాల కోసం కృష్ణా నదిలో ఉన్న నిల్వలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలన్నారు. హైదరాబాద్‌లో నీళ్లు లేవని, స్నానాలు చేయొద్దని సీఎం ఉచిత సలహాలు ఇస్తుంటే.. నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం ఇబ్బందే లేదని పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క అక్టోబర్ నెలలోనే నగరంలో రెండున్నర లక్షల ట్యాంకర్లు బుక్ అయ్యాయని గుర్తు చేశారు.

ప్రజా ఉద్యమానికి సిద్ధం

తమను నమ్మి ఓట్లు వేసిన దక్షిణ తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం సమైక్య పాలనలో జరిగిన ద్రోహం కంటే పెద్దదని కేటీఆర్ విమర్శించారు. ఏపీ జలదోపిడీని అడ్డుకోకపోతే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదని, అవసరమైతే న్యాయ పోరాటాలతో పాటు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించి భారీ ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.

Also Read: పులివెందులలో నామినేషన్ల వేళ ఉద్రిక్తత.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య రాళ్ల దాడి, పలువురికి గాయాలు

Tags

Related News

ఆ సారు కోపం ఇంకా చల్లారలేదా.. ఆసుపత్రుల్లో ప్రమోషన్ల ఫైళ్లకు బ్రేక్‌లు!

ఉన్న సిటీకే దిక్కులేదు.. ఫ్యూచర్ సిటీ ఎందుకు?: రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాండూరులో కారు బీభత్సం.. 12 బైకులు, ఆటో ధ్వంసం!

తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీపై విమర్శలా? కేటీఆర్‌కు చామల స్ట్రాంగ్ కౌంటర్!

సిద్దిపేటకు పట్టిన చీడ త్వరలో వదులుతుంది.. హరీష్ రావుకు మెట్టుసాయి మాస్ కౌంటర్

‘మరుజన్మ ఉంటే మధ్యతరగతిలో పుట్టించకు దేవుడా!’.. కన్నీరు పెట్టిస్తున్న వరంగల్ దంపతుల సూసైడ్ నోట్!

‘నా భార్య ఇజ్జత్ తీస్తోంది.. బతకాలని లేదు’.. సెల్ఫీ వీడియో పెట్టి యువకుడి అదృశ్యం

Big Stories

Advertisement
×