BigTV English
Advertisement

National Awards 2025: జాతీయ అవార్డులలో సత్తా చాటిన తెలుగు సినిమాలు!

National Awards 2025: జాతీయ అవార్డులలో సత్తా చాటిన తెలుగు సినిమాలు!

National Awards 2025: సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే పురస్కారాలలో జాతీయ చలనచిత్ర అవార్డులు(National Awards) కూడా ఒకటి. ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటిస్తూ ఉంటారు. అయితే తాజాగా 2023లో దేశవ్యాప్తంగా విడుదలైనటువంటి  సినిమాలలో ఉత్తమ చిత్రాలను ఎంపిక చేసి ఈ జాతీయ అవార్డులకు ఎంపిక చేయడం జరిగింది. ఇక ఈ నేషనల్ అవార్డులను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విజేతల వివరాలను వెల్లడించారు. ఇక ఈ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా తెలుగు నుంచి ఏ ఏ సినిమాలు, ఏ ఏ క్యాటగిరీలో అవార్డులను అందుకున్నాయి అనే విషయానికి వస్తే…


ఉత్తమ సినిమా..

71 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా బాలకృష్ణ (Balakrishna)హీరోగా నటించిన భగవంత్ కేసరి(Bhagavanth Kesari) సినిమాకు గాను ఉత్తమ చిత్రంగా అవార్డు లభించింది డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ ఈ సినిమాలో నటించడం 2023 దసరా పండుగను పురస్కరించుకొని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది.


ఉత్తమ సినీ గేయం..

ఉత్తమ సినీ గేయంగా ఈ 71 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా బలగం సినిమా(Balagam Movie) నుంచి “ఊరు పల్లెటూరు” అనే పాట ఎంపిక అయ్యింది. గేయ రచయిత కాసర్ల శ్యామ్ ఎంపికయ్యారు. వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకోవడమే కాకుండా ఎన్నో పురస్కారాలను సొంతం చేసుకుని తాజాగా నేషనల్ అవార్డును కూడా అందుకుంటుంది.

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రఫీ..

71వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఉత్తమ యాక్షన్ డైరెక్షన్, స్టంట్ కొరియోగ్రాఫర్ గా నందు, పృథ్వీ హనుమాన్ సినిమా(Hanuman Movie) ఎంపిక అయింది. ఈ సినిమా 2023 లో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది.

బెస్ట్ స్క్రీన్ ప్లే:

బెస్ట్ స్క్రీన్ ప్లే క్యాటగిరి లో భాగంగా బేబీ మూవీ డైరెక్టర్ సాయి రాజేష్(Sai Rajesh) ఎంపిక అయ్యారు.

బెస్ట్ సౌండ్ డిజైన్..

బెస్ట్ సౌండ్ డిజైన్ క్యాటగిరిలో భాగంగా యానిమల్ సినిమా(Animal Movie) ఎంపిక అయింది.

బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్..

బెస్ట్ మేల్ ప్లే బ్యాక్ సింగర్- బేబీ (పివి ఎన్ఎస్ రోహిత్)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి(Sukruthi Veni) (సుకుమార్ కుమార్తె) – గాంధీ తాత చెట్టు సినిమా ఈ అవార్డును సొంతం చేసుకుంది.

2023 సంవత్సరంలో విడుదలైనటువంటి తెలుగు సినిమాలకు 71 వ జాతీయ చలనచిత్ర అవార్డులలో భాగంగా ఈ సినిమాలు వివిధ కేటగిరీలో ఎంపిక కావడంతో సినీ సెలబ్రిటీలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక  అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Also Read: Balakrishna Movie: బాలకృష్ణ సినిమాకు నేషనల్ అవార్డు

Related News

Manchu Manoj: రాజ్యం లేదు కానీ రాణిలా చూసుకుంటా.. మనసును హత్తుకుంటున్న మనోజ్ మాట!

Dance master: నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులు..మరీ ఇంత దారుణమా?

Prakash Raj: కేరళ రాష్ట్ర అవార్డులు.. ప్రకాశ్ రాజ్ పై చైల్డ్ ఆర్టిస్టు ఫైర్

Megastar Chiranjeevi : అన్నపూర్ణ స్టూడియోలో మన శంకరవరప్రసాద్ గారు, సినిమా పూర్తయ్యేది అప్పుడే

Sai Durgha Tej : స్టార్డం అంటే హీరోలతో ఫోటోలు దిగడం కాదు, సాయి తేజ్ అలా అనేశాడేంటి?

Ram Charan: ఆ బాలీవుడ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ సినిమా, ఈసారి హిట్ ఖాయం

Thiruveer: ఆ సినిమా టికెట్ కౌంటర్ లోనే చచ్చిపోతా అనుకున్నా

Kaantha First Spark: దుల్కర్ కాంత.. చాలా గట్టిగానే ఉండబోతున్నట్టుందే

Big Stories

×