Woakes : టీమిండియా తో ఐదో టెస్ట్ లో ఇంగ్లాండ్ జట్టు పెద్ద షాక్ తగిలిందనే చెప్పాలి. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ క్రిస్ వోక్స్ భుజం గాయం కారణంగా మ్యాచ్ మొత్తానికి దూరమయ్యడు. ఈ విషయాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. తొలి రోజు ఆటలో క్రిస్ వోక్స్ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపే ప్రయత్నంతో అతని భుజానికి తీవ్ర గాయమైంది. జెమీ ఓవర్టన్ వేసిన 57వ ఓవర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ లో ఐదో బంతిని కరుణ్ నాయర్ మిడాఫ్ దిశగా షాట్ ఆడగా.. వోక్స్ బంతిని ఆపేందుకు పరుగెత్తుకుంటూ వెల్లాడు. ఆ ప్రయత్నంలో వోక్స్ ఎడమ భుజం నేలకు బలంగా తాకింది. దీంతో పాపం అతను నొప్పితో విలవిలలాడిపోయాడు. వెంటనే ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. స్కానింగ్ తీయగా.. బలమైన గాయమని తేలింది.
Also Read : Test Cricket Records : ఒకే ఇన్నింగ్స్ లో 903 పరుగులు.. టెస్ట్ హిస్టరీలోనే తోపు మ్యాచ్..!
వోక్స్ ఔట్..
దీంతో అతను ఐదో టెస్ట్ మ్యాచ్ నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు. ఈ మ్యాచ్ లో వోక్స్ లేని లోటు ఇంగ్లాండ్ విజయావకాశాలను తప్పక ప్రభావితం చేస్తుంది. ఇంగ్లాండ్ తమ స్టార్ పేసర్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్ లేకుండానే ఈ మ్యాచ్ బరిలోకి దిగింది. తాజాగా వోక్స్ కూడా దూరం కావడంతో టీమిండియా కి శుభవార్త అనే చెప్పాలి. 2025 టెండూల్కర్-అండర్సన్ ట్రోఫీలో వోక్స్ 9 ఇన్నింగ్స్ లో 52.18 సగటుతో 11 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో 10.66 సగటుతో 64 పరుగులుచేశాడు. వోక్స్ ఇవాళ మ్యాచ్ లో లేకపోయినప్పటికీ టీమిండియా ఆలౌట్ అయింది. ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్ లు ఆడిన వోక్స్ 18.1 ఓవర్లు వేసి 11 వికెట్లు తీశాడు. గాయపడటానికి ముందు కూడా వోక్స్ ఓ వికెట్ తీశాడు. టీమిండియా కీలక బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక మ్యాచ్ విషయాానికి వస్తే.. నిన్న ఆట ముగిసే సమయానికి టీమిండియా 6 వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. కానీ ఇవాళ కేవలం 20 పరుగులు జోడించి ఆలౌట్ కావడం గమనార్హం.
భారత్ ఆలౌట్
ఇక టీమిండియా బ్యాటర్లలో యశస్వి జైస్వాల్ 2, కేఎల్ రాహుల్ 14, సాయి సుదర్శన్ 38, శుబ్ మన్ గిల్ 21, రవీంద్ర జడేజా 09, ధ్రువ్ జురెల్ 19 చేసి నిన్న ఔట్ కాగా.. ఇవాళ కరుణ్ నాయర్ 57, వాషింగ్టన్ సుందర్ 26 పరుగులు చేసి ఔట్ అయ్యారు. ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ద్ ముగ్గురు డకౌట్ కావడం గమనార్హం. దీంతో టీమిండియా టపా టపా వికెట్లను కోల్పోయింది. కేవలం 224 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఇంగ్లాండ్ జట్టు బ్యాటింగ్ కి దిగింది. 22 ఓవర్లకు 130 పరుగులు చేసింది. క్రాలీ 64, బెన్ డకెట్ 43 ఔట్ అయ్యారు. ప్రస్తుతం పోప్ 18, రూట్ 4 బ్యాటింగ్ చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ 90 పరగులు చేస్తే.. ఇండియా స్కోర్ ని చేరుకుటుంది. సునాయసంగా ఇంగ్లాండ్ 90 పరుగులు చేస్తుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.