Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించేందుకు భారతీయ రైల్వే ఎప్పటికప్పుడు ట్రాక్ మెయింటెనెన్స్, ఇంటర్ లాకింగ్స్ వర్క్ తో పాటు మౌళిక వసతులను మెరుగుపరుస్తుంది. ఈ కార్యక్రమాలు దేశ వ్యాప్తంగా నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర రైల్వే (NR) పరిధిలోని లక్నో రైల్వే స్టేషన్ లో కొత్త కాన్ కోర్స్ ఫౌండేషన్ నిర్మాణ పనులను సులభతరం చేయడానికి కీలకమైన ట్రాఫిక్ బ్లాక్ ను ప్రకటించింది. జూలై 31 నుండి సెప్టెంబర్ 25 వరకు ఈ బ్లాక్ అమలులో ఉంటుందని వెల్లడించింది. ఈ బ్లాక్ కారణంగా 70కి పైగా రైళ్లకు ఎఫెక్ట్ కానున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. పలు రైళ్ల డైవర్షన్, షార్ట్ టెర్మినేషన్లు, రీషెడ్యూల్, ప్లాట్ ఫారమ్ మార్పులు జరుగుతాయని వెల్లడించారు.
బ్లాక్ కారణం ఎఫెక్ట్ అయ్యే రైళ్లు ఇవే!
ఢిల్లీ-మా బెల్హా దేవి ధామ్ ప్రతాప్‌గఢ్(14208), డెహ్రాడూన్-బనారస్(15120) సహా పలు రైళ్లను అలంనగర్- ట్రాన్స్ పోర్ట్ నగర్-ఉత్రాతియా మీదుగా దారి మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు అనుగుణంగా స్టాప్ లను సర్దుబాటు చేయనున్నట్లు తెలిపారు. అటు బాంద్రా-గోరఖ్‌పూర్(22921), గ్వాలియర్-బరౌని(11123) లాంటి మరికొన్ని రైళ్లను మనక్ నగర్- ఐష్ బాగ్-మల్ హౌర్ ద్వారా దారి మళ్లించనున్నట్లు ఉత్తర రైల్వే విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. అటు యశ్వంత్ పూర్-లక్నో(22683) రైళ్లను ఆగస్టు, సెప్టెంబర్ లో ఎంపిక చేసిన తేదీలలో లక్నో జంక్షన్ కు బదులుగా ఉత్రాతియా నుంచి నడిపించనున్నట్లు అధికారులు తెలిపారు.
పలు రైళ్ల షెడ్యూల్ లో మార్పులు
మరోవైపు లక్నో-గయా ఎక్స్ ప్రెస్(14260/14262) రైళ్ల షెడ్యూల్ మార్చుతున్నట్లు వెల్లడించారు. నిర్ణయించిన తేదీలలో రాత్రి 11:55 గంటలకు బదులుగా ఉదయం 00:15 గంటలకు ప్రారంభం కానుంది. అంటే సాధారణం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా ఈ రైళ్లు బయల్దేరుతాయి.
ప్లాట్ ఫారమ్ లు మారే రైళ్లు ఇవే!
అటు ఈ స్టేషన్ లో ప్లాట్ ఫారమ్ లకు సంబంధించి ప్రధాన పునర్నిర్మాణం కూడా ప్రణాళికలో ఉంది. ముఖ్యంగా, ఢిల్లీ-ఛప్రా ఎక్స్ ప్రెస్ (15116) ప్లాట్ ఫారమ్ 2 నుంచి ప్లాట్ ఫారమ్ 6కి మారుతుంది . బ్లాక్ వ్యవధిలో ప్లాట్ ఫారమ్ 2, 3 నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లు ఇప్పుడు ప్లాట్ ఫారమ్ 1, 4, 5, 6 నుంచి రాకపోకలు కొనసాగిస్తాయి.
Read Also: ప్రపంచంలో భయంకరమైన రైల్వే స్టేషన్లు, ధైర్యం ఉంటేనే వెళ్లండి బాస్!
ప్రయాణీకుల సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు దీర్ఘకాలంలో ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడం లక్ష్యంగా లక్నో రైల్వే స్టేషన్ లో మౌళిక వసతుల మెరుగుదల కొనసాగుతోంది. ఉత్తర ప్రదేశ్ లోని అత్యంత రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో లక్నో స్టేషన్ ఒకటిగా కొనసాగుతోంది. నిత్యం ఇక్కడి నుంచి వేలాది మంది ప్రయాణీకులు దేశంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
Read Also: భారత్ లో ఉన్న ఈ రైల్వే స్టేషన్ వెరీ వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా?