Hero Darshan:కన్నడ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న దర్శన్ (Darshan ) గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా ఈయన సినిమాల కంటే కూడా అభిమానిని హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తూ మరింత పాపులారిటీ సొంతం చేసుకున్నారు. భార్య ఉండగానే ప్రేయసితో 10 సంవత్సరాలకు పైగా రహస్యంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసిన దర్శన్.. ఈమధ్య వీరి బంధాన్ని వ్యతిరేకించిన అభిమానిని చంపి వార్తల్లో నిలిచారు. దీనికి తోడు గత కొద్ది రోజులుగా బెయిల్ మీద ఉన్న ఈయనకు.. సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసి జైలుకు పంపాల్సిందే అంటూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. అలా ఇప్పుడు జైల్లో మగ్గిపోతున్న దర్శన్ కి సంబంధించిన మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
దర్శన్ భార్య విజయలక్ష్మి కి వేధింపులు..
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. దర్శన్ భార్య విజయలక్ష్మి(Vijayalakshmi) కి సోషల్ మీడియా వేదికగా వేధింపులు ఎదురవుతున్నట్లు సమాచారం. దర్శన్ భార్య విజయలక్ష్మి, ఆమె కుమారుడు వినీష్ లపై కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టడం కలకలం రేపింది. ఈ మేరకు తన అభిమాన నటుని భార్య, కుమారులను లక్ష్యంగా చేసుకొని అశ్లీల, అనుచిత పోస్టులు పెట్టి వేధిస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ మహిళా కమిషన్ కి దర్శన్ వీరాభిమాని భాస్కర ప్రసాదు ఫిర్యాదు చేశారు. దీంతో దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు కమిషన్ తెలిపింది. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
బెయిల్ రద్దు.. జైల్లో మగ్గిపోతున్న దర్శన్..
కన్నడ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దర్శన్.. నటి పవిత్ర గౌడ (Pavitra Gowda) తో రిలేషన్ మెయింటైన్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరి బంధాన్ని తప్పుపడుతూ నటి పవిత్ర గౌడపై చిత్రదుర్గాకు చెందిన రేణుక స్వామి(Renuka Swamy) అనే దర్శన్ అభిమాని ఆమెపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.. దీంతో కక్షగట్టిన ఆమె దర్శన్ తో పాటు మరో ఏడు ఏడుగురి సహాయంతో రేణుక స్వామిని అత్యంత దారుణంగా హతమార్చారు. ఈ కేసులో A1గా పవిత్ర గౌడ, A2 గా దర్శన్ ఉన్న విషయం తెలిసిందే. కర్ణాటక హైకోర్టు తీర్పు మేరకు.. వీరి ఇరువురు షరతులతో కూడిన బెయిల్ తీసుకొని బయటకొచ్చారు. కానీ రేణుక స్వామి కుటుంబ సభ్యులు బెంగళూరు పోలీసులను ఆశ్రయించగా.. వారు హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. సుప్రీంకోర్టులో కేస్ పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఇకపోతే విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును కొట్టివేస్తూ వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇక గత 15 రోజుల క్రితం అటు పవిత్ర గౌడ ,ఇటు దర్శన్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంతలోనే ఇప్పుడు దర్శన్ భార్య, పిల్లలకు వేధింపులు ఎదురవడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.
ALSO READ:Bigg Boss Agnipariksha Promo : సామాన్యులను ఆఖరికి పని మనుషులను చేశారు కదరా!