SreeMukhi: ఆంటీ.. ఈ వివాదం గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ప్రముఖ యాంకర్ అనసూయ (Anasuya) ను కొంతమంది ఆంటీ అంటూ అవమానకరంగా పిలిచి ఆమెను ఇబ్బంది పెట్టారు. అయితే దానికామె సరైన రీతిలో సమాధానం ఇచ్చింది అది ఇంకో విషయం.. ఇప్పుడు పెళ్లి కాకుండానే శ్రీముఖి (Sreemukhi )ఆంటీ అయిపోయింది. అలా ఆంటీ అని పిలిచి ఆమె పరువు తీశారు ప్రముఖ కమెడియన్ ఎక్స్ప్రెస్ హరి (Express Hari). మరి దానికి శ్రీముఖి రియాక్షన్ ఏంటి ? హరి ఎందుకు అలా పిలవాల్సి వచ్చింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
స్టార్ మా పరివారం షోకి లిటిల్ హార్ట్స్ టీమ్..
యాంకర్ గా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్న బుల్లితెర రాములమ్మ అలియాస్ శ్రీముఖి ఇప్పుడు బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోతో పాటు ఆదివారం విత్ స్టార్ మా పరివారం అనే షోకి కూడా హోస్ట్ గా వ్యవహరిస్తోంది. తాజాగా ఈ వారం ఎపిసోడ్ కి ‘లిటిల్ హార్ట్స్’ మూవీ టీం ప్రమోషన్స్ కి వచ్చింది. ఇక్కడ మౌళి(Mouli ), శివాని నాగారం(Sivani Nagaram) ఇద్దరు ఈ పరివారంలో సందడి చేశారు. దీంతో మౌళితో కలిసి ముక్కు అవినాష్, ఎక్స్ప్రెస్ హరి సరదాగా ఒక స్కిట్ చేశారు.
మౌళి టీంతో స్కిట్ చేసిన హరి, అవినాష్..
స్కిట్ విషయానికి వస్తే మౌళి మనందరి కోసం ఒక క్వార్టర్ తెచ్చాను అని అవినాష్ చెబుతాడు. అవును నువ్వేంటి ఫేస్ డల్ గా పెట్టావని మౌళిని హరి అడగగా.. మందు అంటున్నారు కానీ ఓపెన్ చేయడం లేదేంటా? అని అనుకుంటున్నాను అంటూ మౌళి పంచ్ వేశాడు. ఇంతలో స్కిట్లో భాగంగా శ్రీముఖి, హీరోయిన్ శివాని నాగారం తల్లిగా వాళ్ల దగ్గరికి వచ్చి.. ఏంటి? మా అమ్మాయికి లైన్ వేస్తున్నారంట అంటూ అడిగింది. దమ్ముంటే నా ముందు ఐ లవ్ యు చెప్పు అని శ్రీముఖి అనగానే.. మౌళి ఐ లవ్ యు అంటూ చెప్పాడు. దీంతో నువ్వు అమ్మకి చెప్పావా? పిల్లకి చెప్పావా? అని హరి అడిగితే ఇద్దరికీ అంటూ మరో పంచ్ విసిరాడు మౌళి. అయినా నేను ఐ లవ్ యు చెప్పాను ఓకే.. కానీ తను నాకు థాంక్యూ చెప్పిందే అంటూ మౌళి అడిగాడు. మావాడు హ్యాపీ బర్తడే చెప్పాడా.. థాంక్యూ చెప్పడానికి అంటూ అవినాష్ అడిగాడు.
శ్రీముఖిని ఆంటీ అంటూ పిలిచిన హరి..
ఇంతలోనే మీరు మీ బ్యాచ్ అంతా రోజు గొడవలు చేస్తున్నారు అని శ్రీముఖి అంటుంటే.. వెంటనే హరి ఆంటీ కత్తిలా ఉంది అంటూ అరిచాడు. దీంతో శ్రీముఖి ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది. ఇలా ఈ ప్రోమోలో శ్రీముఖిపై హరి చేసిన కామెంట్లు హైలైట్ గా నిలిచాయి. ఏది ఏమైనా శ్రీముఖి పాపం ఎరక్కపోయి ఇరుక్కుపోయిందని సరదాగా కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. మరి ఈ ఆంటీ వర్డ్ ఏ దుమారం రేపుతుందో అని నెటిజెన్స్ కామెంట్లు చేయడం గమనార్హం.
ALSO READ:Hero Darshan: హీరో దర్శన్ భార్యకు వేధింపులు.. అశ్లీల మెసేజ్లతో!