BigTV English

Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయా? ఇలా తప్పక చేయండి!

Talliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయా? ఇలా తప్పక చేయండి!

Talliki Vandanam Scheme: తల్లికి వందనం పథకం కింద నగదు జమ అయిందా? అయితే మీరు ఒక సర్వేలో పాల్గొనాల్సి ఉంది. ఈ సర్వేలో పాల్గొనడం వల్లే మీరు తదుపరి విడత నగదు కోసం అర్హులుగా కొనసాగుతారు. ప్రభుత్వంVillage Secretariat ద్వారా సర్వే నిర్వహిస్తూ, లబ్ధిదారుల సమ్మతిని డిజిటల్ పద్ధతిలో నమోదు చేస్తోంది. మీ పేరు జాబితాలో ఉందో లేదో తెలుసుకోవడం, డబ్బు వచ్చినట్లు ధృవీకరించడం ఎలాగో తెలియాలంటే ఈ కథనం పూర్తిగా చదవండి.


ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లుల పట్ల కృతజ్ఞతగా అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం ద్వారా లక్షలాది మంది మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఈ పథకం కింద రూ.13,000 వరకూ నగదు లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ అవుతోంది. అయితే ఈ డబ్బు మీ ఖాతాలోకి వచ్చిందా? లేదా అని తెలుసుకోవటమే కాదు, వచ్చినట్టు ప్రభుత్వానికి ధృవీకరించడం ఇప్పుడు అవసరమైంది. ఇందుకోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా Thank You CM Sir Survey అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

ఈ సర్వేలో మీ గ్రామం లేదా వార్డు సచివాలయం సిబ్బంది ప్రత్యక్షంగా మీ ఇంటికి వచ్చి, మీకు తల్లికి వందనం డబ్బులు వచ్చాయా లేదా అనే విషయాన్ని ఫేస్, ఐరిస్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా నమోదు చేస్తారు. మీరు సర్వేలో పాల్గొనడం వల్ల, మీకు డబ్బు అందిందని ప్రభుత్వం అధికారికంగా గుర్తించి, తరువాతి విడత డబ్బులు జమ చేయడంలో ఎటువంటి జాప్యం లేకుండా చూసేలా వ్యవస్థ పనిచేస్తోంది.


ఈ ప్రక్రియ కోసం గ్రామ సచివాలయ ఉద్యోగులు మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తున్నారు. ఈ యాప్‌లో Thank You CM Sir అనే ప్రత్యేక ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సిబ్బంది తమకు కేటాయించిన క్లస్టర్ ఆధారంగా లేదా లబ్ధిదారుడి ఆధార్ నెంబర్ ఆధారంగా వారి వివరాలను యాప్‌లో చూసి, ధృవీకరణ తీసుకుంటారు.

ధృవీకరణ సమయంలో, లబ్ధిదారుడి తల్లి పేరు, బ్యాంక్ ఖాతా నెంబర్, వచ్చిన డబ్బు మొత్తం, బ్యాంక్ పేరు, మొబైల్ నెంబర్, పిల్లల సంఖ్య, ఆధార్ చివరి నాలుగు అంకెలు వంటి వివరాలు యాప్‌లో చూపించబడతాయి. లబ్ధిదారులు ఈ సమాచారం చూసి ధృవీకరించాల్సి ఉంటుంది. ఒక్కసారి ధృవీకరణ పూర్తయితే, మీ పేరుపై డబ్బు వచ్చినట్లు ప్రభుత్వం అధికారికంగా నమోదు చేసుకుంటుంది.

Also Read: AP land pooling 2025: ఏపీ ప్రభుత్వం భారీ స్కెచ్..! అమరావతిలో నిర్మాణాలకు ఏకంగా అన్ని వేల ఎకరాలా?

ఇలా సర్వేలో పాల్గొనడం వల్ల మీరు బ్రతికి ఉన్నారన్న ధృవీకరణను ప్రభుత్వం పొందుతుంది. దీని వల్ల తల్లికి వందనం పథకంలో తరువాతి విడతలో మీకు డబ్బులు జమ చేయడంలో ఎటువంటి సమస్య రాకుండా ఉంటుంది. మీరు ఈ సర్వేలో భాగం కాకపోతే, తరువాతి విడత డబ్బులు మిస్ అయ్యే ప్రమాదం ఉంటుందని టాక్ నడుస్తోంది.

ఈ సర్వే ప్రాసెస్ పూర్తయిన వారు, సచివాలయ సిబ్బందికి ధన్యవాదాలు చెప్పటమే కాకుండా, ప్రభుత్వానికి తమ ధన్యవాదాన్ని తెలియజేసే విధంగా ఇది రూపకల్పన చేయబడింది. అందుకే దీనికి Thank You CM Sir Survey అనే పేరు పెట్టారు. ప్రజలు కూడా ప్రభుత్వంపై విశ్వాసంతో ముందుకు సాగేందుకు ఇది ఒక చక్కటి అవగాహన కార్యక్రమంగా మారుతోంది.

ఈ సర్వే వివరాలు తెలుసుకోవాలంటే, ప్రభుత్వం అందించిన లింక్‌ ద్వారా General Reportలోకి వెళ్లి, అందులో Thank You CM Sir – Thalliki Vandanam Scheme Payment Acknowledgement Report పై క్లిక్ చేయాలి. అక్కడ మీ పేరుతో డబ్బు వచ్చిందా? సర్వే పూర్తయిందా? వంటి సమాచారాన్ని పొందవచ్చు. మొత్తం మీద, తల్లికి వందనం పథకం ద్వారా డబ్బులు వచ్చినవారు ఈ సర్వేలో తప్పక పాల్గొనాలి. ఇది మీకు మాత్రమే కాదు, ప్రభుత్వానికి కూడా ఒక విశ్వసనీయ సమాచారం అవుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలు కూడా మీ ఇంటికే చేరే అవకాశం పెరుగుతుంది.

Related News

NTR fans protest: అనంతపురంలో ఉద్రిక్తత.. బహిరంగ క్షమాపణకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిమాండ్!

MLA Daggubati Prasad: ఆ ఆడియో నాది కాదు.. కానీ సారీ అంటూ ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెల్యే!

AP real estate: ఏపీలో రియల్ ఎస్టేట్ హవా.. 3 నెలల్లోనే మరీ ఇంత ఆదాయమా!

AP pensioners: ఏపీ వికలాంగులు, మెడికల్ పింఛనుదారులకు శుభవార్త.. వారికి మాత్రం వర్రీనే!

Terrorist Noor Mohammed: నూర్ మహమ్మద్ పై దేశద్రోహ కేసు.. 14 రోజుల రిమాండ్

Bay of Bengal depression: మళ్లీ భయపెడుతున్న మరో అల్పపీడనం.. వారం రోజుల వర్షాలకు రెడీగా ఉండాల్సిందే!

Big Stories

×