BigTV English

Manchu Vishnu: ప్రభాస్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విష్ణు.. మళ్లీ ఏం చేస్తున్నావ్ సామి?

Manchu Vishnu: ప్రభాస్ కు బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన విష్ణు.. మళ్లీ ఏం చేస్తున్నావ్ సామి?

Manchu Vishnu: మంచు విష్ణు(Manchu Vishnu) ప్రస్తుతం కన్నప్ప సినిమా(Kannappa Movie) సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. చాలా రోజుల తర్వాత దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జూన్ 27వ తేదీ విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే చిత్ర బృందం ఈ సినిమాని మంచి విజయం చేసిన ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం మొత్తం పాల్గొన్నారు. అలాగే సినిమాకు సంబంధించి ఎన్నో విషయాలను కూడా తెలియజేశారు.


రుద్ర పాత్రలో ప్రభాస్..

ఇక ఈ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ సెలబ్రిటీల నుంచి మొదలుకొని ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు. అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్ వంటి తారాగణం ఈ సినిమాలో నటించిన నేపథ్యంలో సినిమా పట్ల కూడా మంచి అంచనాలు ఏర్పడడం, అంచనాలకు అనుగుణంగా సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందని చెప్పాలి. ముఖ్యంగా చివరి ఒక గంట సినిమా మరో లెవెల్ లో ఉందని చెప్పాలి. ముఖ్యంగా ప్రభాస్ (Prabhas ) రుద్ర(Rudra)పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చిన సమయంలో సినిమా ప్రేక్షకులను మరింతగా ఆకట్టుకుంటుంది.


ప్రభాస్ వల్లే భారీ ఓపెనింగ్స్..

ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ సెలబ్రిటీలు మొత్తం నటించిన నేపథ్యంలో విష్ణు వారందరికీ కూడా భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ (Remuneration) ఇచ్చి ఉంటారని చెప్పాలి. అయితే మోహన్ లాల్, ప్రభాస్ మాత్రం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని స్వయంగా విష్ణు తెలిపారు. ప్రభాస్ దగ్గర రెమ్యూనరేషన్ గురించి మాట్లాడితే విష్ణు గాడిని చంపేస్తానని చెప్పు బావ అంటూ నాన్న దగ్గర మాట్లాడారు . నాన్న కోసం ప్రభాస్ కాదనకుండా ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా సినిమా చేసినట్లు తెలిపారు. ఇక మంచు విష్ణు కెరియర్ లో ఏ సినిమాకు లేనివిధంగా ఓపెనింగ్స్ కన్నప్ప సినిమాకు వచ్చాయి అంటే అది కేవలం ప్రభాస్ నటించడం వల్లే అని చెప్పాలి.

ఏదైనా కానుకను ఇవ్వబోతున్నారా?

ఈ విషయాన్ని విష్ణు కూడా ఒప్పుకున్నారు ప్రభాస్ లేకపోతే ఈ సినిమాకు ఇంత మంచి ఓపెనింగ్స్ రావని కేవలం ప్రభాస్ కారణంగానే అది సాధ్యమైందని తెలిపారు. ఇక ప్రభాస్ రెమ్యునరేషన్ తీసుకోకపోవడంతో తనకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశానని అదేంటో స్వయంగా నా స్నేహితుడికే తెలియజేస్తాను అంటూ ఈ సందర్భంగా విష్ణు తెలిపారు. బహుశా ప్రభాస్ కోసం ఏదైనా ఖరీదైన కానుకను అందజేస్తారేమోనని అభిమానులు భావిస్తున్నారు అలాగే మరికొందరు ఇంకా మా హీరోతో ఎలాంటివి ప్లాన్ చేస్తున్నావ్ స్వామి, ఇక మా హీరోని వదిలేయ్ అంటూ ప్రభాస్ అభిమానులు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్నారు. త్వరలోనే ఈయన కూడా ది రాజా సాబ్ (The Raja Saab)అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఐదో తేదీ విడుదల కానుంది.

Also Read:  Danush: ఆ ఇద్దరి బయోపిక్ చేయటమే నా కోరిక.. ఇన్నాళ్లకు బయటపెట్టిన ధనుష్!

Related News

Coole Vs War 2: కూలీ, వార్ 2 ప్లస్.. మైనస్ లు.. బాక్సాఫీసు క్లాష్ లో బాలీవుడ్ కి తడబాటు తప్పదా?

Tollywood workers Strike: చర్చలు ఫెయిల్… సమ్మెపై నిర్ణయం ఇదే

Paradha Trailer: పిల్లల్ని కనడానికి పెళ్లి ఎందుకు? ఇలా పరదా వేసుకుంటే చాలు.. ఆసక్తిగా అనుపమ పరదా ట్రైలర్

Colie Movie: రజనీకాంత్ మూవీ రిలీజ్.. సెలవులు వచ్చేస్తున్నాయిరో..

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Big Stories

×