Assam Election 2026: అస్సాంలోనూ రాజకీయ పోరు రసవత్తరంగా కనిపిస్తోంది. హ్యాట్రిక్ కొట్టి.. మూడోసారి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ తహతహలాడుతోంది. అయితే.. గత ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నాయో ఓసారి పరిశీలిస్తే.. 2016 ఎన్నికల్లో బీజేపీ 60 స్థానాల్లో గెలిచింది. 2021 ఎన్నికల్లో మళ్లీ 60 స్థానాల్లో గెలిచింది. రెండుసార్లూ.. మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినా, బీజేపీనే అధికారం దక్కించుకుంది. ఇక.. కాంగ్రెస్ 2016లో 13 స్థానాలు గెలిస్తే, గత ఎన్నికల్లో 16 స్థానాలు గెలిచింది. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ 2016లో 13 సీట్లు గెలిస్తే.. గత ఎన్నికల్లో 16 స్థానాలు సాధించింది. అసోం గానా పరిషత్ 2016లో 14 సీట్లు గెలిస్తే.. 2021లో 9 సీట్లకే పరిమితమైంది. ఈసారి కూడా బీజేపీ అధికారం నిలబెట్టుకుంటుందా? 60 కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తుందా.. మళ్లీ 60 దగ్గరే ఆగుతుందా? అంతకంటే తక్కువ సాధిస్తుందా? అనేది ఇంట్రస్టింగ్‌గా మారింది.
అస్సాంలో.. బీజేపీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది. కూటమిలోని పార్టీలతో.. బలమైన భాగస్వామ్యం ఉంది. స్థానికంగానూ, ఆదివాసీల్లోనూ బీజేపీకి మంచి ఆదరణ కనిపిస్తోంది. మోడీ, హిమంత నాయకత్వంలో.. అభివృద్ధి, పాలన సమపాళ్లలో సాగుతున్నాయనే ప్రచారం ఉంది. ముఖ్యంగా.. సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పన, ఆక్రమణలకు వ్యతిరేకంగా.. హిమంత బిశ్వ శర్మ పాలన కొనసాగుతోంది. ఇదే సమయంలో.. పదేళ్ల పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకత కొంతమేర నష్టం చేసే అవకాశాలున్నాయి. జాతి, సాంస్కృతిక ఉద్యమాలు పెరగడంతో.. కొన్ని సున్నితమైన నియోజకవర్గాల్లో.. బీజేపీ పట్టు కోల్పోతుందనే వాదనలు వినిపిస్తున్నాయ్.
అయితే.. మహిళలు, విద్యార్థుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం లాంటివి కొంత మేర ప్రయోజనం చేకూర్చే ఛాన్స్ ఉంది. సీఎం హిమంత.. అస్సాంలో ఎన్డీయే కూటమిని.. అస్సాం గుర్తింపుని కాపాడే రక్షణ కవచంగా నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. చొరబాట్లను అడ్డుకునేందుకు ఎంతో కృషి చేశారనే చర్చ కూడా పాజిటివ్‌గా కనిపిస్తోంది. అయితే.. అస్సాంలో కాంగ్రెస్ ఎలా వ్యవహరించబోతోంది? ఎలాంటి పాచికలను పారిస్తుందనే దానిమీదే.. బీజేపీ భవితవ్యం ఆధారపడి ఉంది. కూటమిలో సీట్ల పంపకాల్లో ఎలాంటి విభేదాలు తలెత్తుతాయనేది కూడా చర్చకు వస్తోంది. ఈ విషయంలో తేడాలొస్తే.. భాగస్వామ్య పార్టీలు ఎన్డీయేకు నష్టం చేసేలా వ్యవహరించే ఛాన్స్ ఉందంటున్నారు.
కాంగ్రెస్ విషయానికొస్తే.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అస్సాంలో చేసిన అభివృద్ధిని చూపించి ఓట్లు అడిగే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలనే.. ప్రచారాస్త్రాలుగా మలచుకోనున్నారు. మైనార్టీలు, టీ గార్డెన్ వర్కర్ల మద్దతు కూడగట్టేందుకు.. కాంగ్రెస్ ట్రై చేస్తోంది. ఏజేపీ, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. కానీ, ఇది కుదురుతుందా? లేదా? అనేది డౌటే. పదేళ్ల బీజేపీ పాలనపై ఉన్న ప్రజా వ్యతిరేకతే.. కాంగ్రెస్‌కు తిరుగులేని అస్త్రంగా కనిపిస్తోంది. చొరబాట్ల అంశం కూడా కాంగ్రెస్‌కు మేలు చేస్తుందనే చర్చ జరుగుతోంది. ఆలిండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కూడా అస్సాంలో కీలకంగా కనిపిస్తోంది. లోయర్ అస్సాంలో.. ముస్లిం మైనార్టీలకు శాశ్వత బేస్ కల్పించేందుకు పోరాడింది. అయితే, కమ్యూనిటీ ఓన్లీ అనే ఇమేజ్.. ఏఐయూడీఎఫ్ విస్తరణకు బ్రేకులు వేస్తోంది. అయినప్పటికీ.. అస్సాంలో హంగ్ గనక వస్తే.. ఈ పార్టీనే కింగ్ మేకర్‌గా అవతరించే అవకాశాలున్నాయి. మైనార్టీలను తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్ విఫలమైతే.. ఆ ఓట్లన్నీ ఏఐయూడీఎఫ్‌కు టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాంటి రాజకీయ పరిస్థితుల్లో.. అస్సాంలో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. మరి.. అస్సాం ప్రజల తీర్పు, ఆలోచన ఎలా ఉన్నాయో.. మే 4న తేలిపోతుంది.
Also Read: బెంగాల్ రణక్షేత్రం.. మమతకు చెక్ పెట్టేందుకు మోదీ మాస్టర్ ప్లాన్!
Story by: Anup, Big Tv