Priyamani: ప్రియమణి (Priyamani).. సౌత్ స్టార్ హీరోయిన్ గా పేరు సొంతం చేసుకున్న ఈమె 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తన అద్భుతమైన నటనతో మంచి పేరు సొంతం చేసుకుంది. పలువురు స్టార్ హీరోల సినిమాలలో మెయిన్ లీడ్ పోషిస్తూనే.. ఇటు సెకండ్ హీరోయిన్ గా కూడా నటించి ఆకట్టుకుంది. ఒకవైపు గ్లామర్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. వెంకటేష్ (Venkatesh) ‘నారప్ప’ లాంటి చిత్రాలలో డీ గ్లామర్ పాత్రలు పోషించి ఆకట్టుకుంది. అంతేకాదు రానా దగ్గుబాటి (Rana daggubati) నటించిన ‘విరాటపర్వం’ సినిమాలో నక్సలైట్ పాత్ర పోషించి ఆకట్టుకుంది. ఇలా పాత్ర ఏదైనా పరకాయ ప్రవేశం చేసి నటిస్తూ మంచి పేరు సొంతం చేసుకుంది ప్రియమణి.
బాలీవుడ్ పై విరుచుకుపడ్డ ప్రియమణి..
ప్రస్తుతం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా మారిన ఈమె బుల్లితెర డాన్స్ షోలకి జడ్జిగా కూడా వ్యవహరించింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. బాలీవుడ్ పై సంచలన కామెంట్స్ చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ లో వివక్షత చూపిస్తున్నారు అంటూ డైరెక్ట్ గానే కామెంట్లు చేసింది. ప్రియమణి మాట్లాడుతూ..” కొంతమంది నన్ను ఆడిషన్ చేసేటప్పుడు సౌత్ ఇండియన్ క్యారెక్టర్ ఉంది కాబట్టే మిమ్మల్ని తీసుకున్నామని చెప్పారు.మేము సౌత్ ఇండియా కు చెందిన వాళ్ళమే. అనర్గళంగా అన్ని భాషలు కూడా మాట్లాడుతాం. నార్త్ నటీనటుల లాగా తెల్లగా ఉండకపోవచ్చు.. కానీ అందంగా ఉంటామని మాత్రం మేము ధైర్యంగా చెప్తాము.
కలర్ బైయాస్ పై ఊహించని కామెంట్స్..
చర్మ రంగు ముఖ్యం కాదు.. ప్రతిభ ఉండాలి.. ఇప్పటికీ బాలీవుడ్ లో పాత్రలు ఇస్తూ రంగు, ప్రాంతం వంటి విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. నటీనటుల నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం లేదు. కాలం మారుతోంది. ప్రతిభకు ప్రతి ఒక్కరు విలువ ఇస్తున్నారు. ఇప్పటికైనా మారండి” అంటూ కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చింది ప్రియమణి. మరి ఇప్పటికైనా బాలీవుడ్ లో ఈ పరిస్థితి మారాలి అని పలువురు కామెంట్లు చేస్తున్నారు.
వాస్తవానికి ఒకప్పుడు సౌత్ సినీ పరిశ్రమను బాలీవుడ్ చాలా చిన్నచూపు చూసిందని వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు సౌత్ పరిశ్రమ ఎల్లలు దాటింది. అంతర్జాతీయ స్థాయిలో పేరు సొంతం చేసుకుంది. అటు హాలీవుడ్ నటీనటులు కూడా సౌత్ సినిమాలలో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇలాంటి టైంలో కూడా ఇంకా సౌత్ , నార్త్, కలర్ అంటూ బాలీవుడ్ కూర్చుంటే ఇక భవిష్యత్తులో బాలీవుడ్ వైపు చూసే వాళ్లే ఉండరు అని మరికొంతమంది హెచ్చరిస్తూ ఉండడం గమనార్హం.
ప్రియమణి సినిమాలు..
ప్రియమణి సినిమాల విషయానికి వస్తే.. తెలుగులో పెళ్లయిన కొత్తలో, యమదొంగ, నవవసంతం, ద్రోణ, శంభో శివ శంభో, చారులత, మిత్రుడు, రగడ ఇలా పలు చిత్రాలలో నటించింది. అటు హిందీలో జవాన్, మైదాన్ వంటి భారీ చిత్రాలలో నటించిన ఈమె.. తమిళంలో కూడా పలు చిత్రాలు చేసి ఆకట్టుకుంది.
also read: Allu Arjun: విమానాశ్రయంలో బన్నీకి ఘోర అవమానం.. అసలేం జరిగిందంటే?