Allu Arjun: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు అల్లు అర్జున్ (Allu Arjun). స్టైలిష్ స్టార్ గా , ఐకాన్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఈయనకు పుష్ప(Pushpa ) సినిమాతో దేశవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. అంతేకాదు ఇప్పుడు విదేశాలలో కూడా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈయనకి ఇప్పుడు ఘోర అవమానం జరిగిందని తెలిసి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి అల్లు అర్జున్ అవమానించింది ఎవరు? అలా అవమానించడం వెనుక అసలు కారణం ఏంటి? అసలేంజరిగింది ? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
విమానాశ్రయంలో బన్నీకి ఘోర అవమానం..
అల్లు అర్జున్ , సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో పుష్ప సినిమా చేసి, పాన్ ఇండియా హీరోగా మారిపోయారు. అంతేకాదు ఈ సినిమాతో బెస్ట్ యాక్టర్ విభాగంలో నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకున్నారు. ఈ సినిమా సీక్వెల్ పుష్ప2 (Pushpa 2) సినిమా తర్వాత అల్లు అర్జున్ ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ (Atlee) దర్శకత్వంలో AA22xA6 అనే వర్కింగ్ టైటిల్ తో అంతర్జాతీయ ప్రామాణాలతో సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కోలీవుడ్ బడా ప్రొడక్షన్ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ రూ.1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతూ ఉండగా.. షూటింగ్ నిమిత్తం అల్లు అర్జున్ హైదరాబాదు నుండి గత నెల ముంబై కి వెళ్లారు. ఇక నిన్న షూటింగ్ పూర్తి కావడంతో ముంబై నుంచి హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ముంబై విమానాశ్రయంలో అల్లు అర్జున్ కి అవమానం జరిగింది.
అవమానం వెనుక అసలు కారణం ఇదే..
అసలు విషయంలోకి వెళ్తే.. హైదరాబాద్ కి వెళ్లడానికి ముంబై ఎయిర్పోర్ట్ కి వెళ్లారు అల్లు అర్జున్. అయితే కళ్ళజోడు మాస్క్ పెట్టుకోవడంతో అక్కడ చెకింగ్ అధికారి అల్లు అర్జున్ ను గుర్తుపట్టలేకపోయారు. పక్కనే ఉన్న అల్లు అర్జున్ అసిస్టెంట్ ఆయన అల్లు అర్జున్ అని చెప్పినా సదరు అధికారి అంగీకరించలేదు. ముఖం చూపించాల్సిందే అని పట్టుబట్టడం తో తప్పనిసరి పరిస్థితుల్లో.. కళ్ళజోడు , మాస్క్ తీసి అల్లు అర్జున్.. ఆఫీసర్ కి తన ముఖాన్ని చూపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వైరల్ వీడియోపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
ఇది చూసిన కొంతమంది అల్లు అర్జున్ ని గుర్తుపట్టలేకపోయారా? అని కామెంట్ చేస్తుంటే.. మరి కొంతమంది ఆఫీసర్ తన బాధ్యతను నిర్వర్తించారు అని కామెంట్లు చేస్తున్నారు. ఇలా మాస్క్, కళ్ళజోడు పెట్టుకొని పూర్తిగా ముఖాన్ని కవర్ చేసుకుంటే ఎవరైనా ఎలా గుర్తుపడతారు? అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం . మొత్తానికైతే ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అల్లు అర్జున్ సినిమాలు..
అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో ఈ సినిమా చేస్తున్నారు. ఇందులో దీపికా పదుకొనే (Deepika Padukone), రష్మిక మందన్న (Rashmika Mandanna) స్టార్ హీరోయిన్ లుగా భాగమైన విషయం తెలిసిందే. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా.. రష్మిక మందన్న నెగిటివ్ షేడ్స్ లో నటిస్తున్నట్లు సమాచారం.
అల్లు అర్జున్ కి అవమానం #AlluArjun #Airport #AA22 #AA22xA6 @alluarjun @Atlee_dir pic.twitter.com/cez56b1FrG
— BIG TV Cinema (@BigtvCinema) August 10, 2025
also read: War 2: ఫ్యాన్స్ కి సడన్ సర్ప్రైజ్.. ప్రీ రిలీజ్ డైలాగ్ ప్రోమో రిలీజ్!