BigTV English

HHVM Trailer: వీరమల్లు ట్రైలర్ 7 సార్లు చూసిన పవన్.. వెంటనే ఆ డైరెక్టర్ కు ఫోన్?

HHVM Trailer: వీరమల్లు ట్రైలర్ 7 సార్లు చూసిన పవన్.. వెంటనే ఆ డైరెక్టర్ కు ఫోన్?

HHVM Trailer: పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా ఈనెల 24వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. నిజానికి ఈ సినిమా గత నెల 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని పనులు పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాని వాయిదా వేస్తూ జూలై 24వ తేదీ విడుదల చేయబోతున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయబోతున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారకంగా ట్రైలర్ తేదీని ప్రకటించారు. జూలై 3వ తేదీ ఉదయం 11:10లకు కేటాయించిన థియేటర్లలో ఈ ట్రైలర్ విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ట్రైలర్ విడుదలకు సంబంధించి అన్ని పనులకు కూడా పూర్తి అయ్యాయి.


వెంటనే త్రివిక్రమ్ కు ఫోన్…

ఇక ట్రైలర్ విడుదల చేయబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం నటుడు పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకంగా అన్నపూర్ణ స్టూడియోలో ఈ ట్రైలర్ చూపించారట. ఇలా పలువురు చిత్ర బృందంతో కలిసి పవన్ కళ్యాణ్ ట్రైలర్ చూసి ఎంతో సంతోషపడ్డారని, ట్రైలర్ అద్భుతంగా ఉందని చిత్ర బృందం పై ప్రశంశలు కురిపించినట్టు తెలుస్తోంది. ఇలా ట్రైలర్ మొదటిసారి చూసి నచ్చగానే వెంటనే పవన్ కళ్యాణ్ తన ఆప్త మిత్రుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కి ఫోన్ చేసి మరి అన్నపూర్ణ స్టూడియోకి పిలిపించుకొని మరి త్రివిక్రమ్ తో కలిసి వరుసగా ఈ ట్రైలర్ ఏడుసార్లు చూసినట్టు చిత్ర బృందం వెల్లడించారు. ఇలా మూడు నిమిషాల పాటు విడుదల చేయబోయే ఈ ట్రైలర్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలను పెంచేస్తుందని తెలుస్తుంది.


బాగా కష్టపడ్డావు.. డైరెక్టర్ పై ప్రశంసలు…

ఇకపోతే ట్రైలర్ అద్భుతంగా కట్ చేయడంతో డైరెక్టర్ జ్యోతి కృష్ణ(Jyothi Krishna) పై కూడా పవన్ కళ్యాణ్ ప్రశంసలు కురిపించినట్టు తెలుస్తుంది. “సినిమా కోసం నువ్వు చాలా కష్టపడ్డావు”అంటూ గీతా కృష్ణ పై ప్రశంసలు కురిపించడంతో దర్శకుడు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.హైదరాబాద్ బాలానగర్ ప్రాంతంలోని విమల్ థియేటర్‌లో ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్ విడుదల కార్యక్రమం జరగనుంది. దీనికి టాలీవుడ్ మీడియా హాజరు కానుంది. అలాగే అభిమానుల కోసం ఏపీ, తెలంగాణలోని ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో విడుదల చేయబోతున్నారు.

ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మొఘల్ వంశస్థులు, రాజ్యాన్ని పరిపాలించిన ఔరంగజేబుగా ఆయన కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా నిధి అగర్వాల్ హీరోయిన్ పాత్రలో సందడి చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు మొదట డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి పనిచేశారు అయితే కొన్ని కారణాలవల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ ఈ సినిమాలో భాగమయ్యారు. ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రముఖ నిర్మాత ఏ.యం రత్నం నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు ఆస్కార్ అవ్వాలి గ్రహీత ఎం.ఎం కీరవాణి సంగీతం అందించారు. ఇక ఈ సినిమాలో విలన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబి డియోల్ సందడి చేయబోతున్నారు.

Also Read: అసలు గేమ్ ఛేంజర్ తో శిరీష్ కి సంబంధమే లేదు… ఆ బాధ్యత నాదే

Related News

Karan Johar: అత్యంత ధనిక దర్శకుడిగా కరణ్.. ఎన్ని వేల కోట్లో తెలిస్తే షాక్!

Tollywood: రొమాన్స్ వదిలేస్తున్న హీరోయిన్లు… కానీ అవి వర్కౌట్ అయ్యేనా?

Kalki 2: కర్ణ 3102 బీసీలో మొదటి ప్రాముఖ్యత ఎవరికి.. క్రేజీ న్యూస్ వైరల్!

Upcoming Movies Theater : అక్టోబర్ లో రఫ్ఫాడించేందుకు రెడీ అవుతున్న సినిమాలు..

Actress Hema: ఆ క్షణం ఎవరినైనా చంపేయాలనిపించేది..ఎమోషనల్ అయిన హేమ!

Bahubali The Epic: బాహుబలి ది ఎపిక్.. బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన జక్కన్న?

OG 2: పవన్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్.. ఓజి 2లో అకీరా .. థియేటర్లు తగలబడి పోవాల్సిందే!

Salman Khan: సల్మాన్‌ ఖాన్‌ ఇంట సంబరాలు.. మరోసారి తండ్రైన ఆర్భాజ్ ఖాన్‌!

Big Stories

×