Rocking Rakesh: బుల్లి తెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ (Jabardasth)కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన వారిలో కమెడియన్ రాకింగ్ రాకేష్(Rocking Rakesh) ఒకరు. ఈ కార్యక్రమంలో ఈయన చిన్నపిల్లలతో కలిసి స్కిట్లు చేస్తూ పెద్ద ఎత్తున తన స్కిట్ ద్వారా అందరిని నవ్విస్తూ సందడి చేశారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఈయన మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా సినిమాలలో కూడా అవకాశాలు అందుకోవడం జరిగింది. ఇక ఈయన ఏకంగా నిర్మాతగా హీరోగా మారి ఇటీవల కేసీఆర్ (KCR)అనే ఒక సినిమాని కూడా చేసిన విషయం మనకు తెలిసిందే.
తల్లి కోరికను నెరవేర్చిన రాకేష్..
ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న రాకేష్ ఇప్పటికే ఎంతోమందికి ఎన్నో విధాలుగా సహాయం చేశారు. తాజాగా ఇద్దరు చిన్నారులకు కూడా ఈయన ఒక జీవితాన్ని ఇచ్చారని చెప్పాలి. తాజాగా జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా ఎప్పటిలాగే రాకింగ్ రాకేష్ చిన్నపిల్లలతో కలిసి ఒక స్కిట్ చేశారు. అయితే అందులో ఇద్దరు చిన్నారుల గురించి రాకేష్ మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ఇద్దరు చిన్నారులు తిరుపతిలోని ఒక మారుమూల కుగ్రామానికి చెందిన వారని ఎలాగైనా జబర్దస్త్ లో వారిని చూడాలన్నదే తన తల్లి కోరిక అని రాకేష్ తెలిపారు.
జబర్దస్త్ లో అవకాశం…
ఇలా తన పిల్లలను జబర్దస్త్ స్టేజ్ పై చూడాలన్న కోరికతో ఆమె హైదరాబాద్ వచ్చి ఎన్నో కష్టాలు పడిందని ,ఎన్నో రాత్రులు కృష్ణానగర్ రోడ్లపై పడుకున్నారని స్వయంగా ఆమె బాధలు నేను చూశానని రాకేష్ తెలిపారు. ఇలా ఆ తల్లి కష్టం చూసి చిన్నారులకు తన స్కిట్ లో అవకాశం కల్పించినట్టు రాకేష్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఆ చిన్నారుల తల్లి కూడా వేదికపై చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో రాకేష్ మంచి మనసు పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక రాకేష్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్, జోర్దార్ సుజాతను(Sujatha) ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. జోర్దార్ వార్తలు ద్వారా ఎంతో ఫేమస్ అయిన సుజాత బిగ్ బాస్(Bigg Boss) కార్యక్రమంలోకి అడుగు పెట్టారు అనంతరం ఈవెంట్ జబర్దస్త్ కార్యక్రమంలో రాకేష్ స్కిట్ లో అవకాశం అందుకున్నారు .ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్న సమయంలోనే ఇద్దరు ప్రేమలో పడటం పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ఈ దంపతులకు ఇటీవల కుమార్తె జన్మించిన విషయం తెలిసిందే. ఇక సుజాత కూడా ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంతో పాటు బుల్లితెర కార్యక్రమాలలో కూడా సందడి చేస్తున్నారు అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.
Also Read: వీరమల్లు ట్రైలర్ 7 సార్లు చూసిన పవన్.. వెంటనే ఆ డైరెక్టర్ కు ఫోన్?