HHVM Pre Release Event:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆంధ్రప్రదేశ్ కి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రిలీజ్ చేయబోతున్న తొలి చిత్రం ‘హరిహర వీరమల్లు’. ప్రముఖ డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyothi Krishna) దర్శకత్వంలో మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.ఎమ్.రత్నం(AM Ratnam) నిర్మిస్తున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రతి పోస్టర్, గ్లింప్స్ కూడా అభిమానులలో అంచనాలు పెంచేశాయి. దీనికి తోడు ట్రైలర్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
మారిన ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక..
మొదట ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు సంబంధించిన వేదికను కూడా ఏర్పాటు చేశారు. అయితే కొన్ని కారణాలవల్ల ఇప్పుడు వేదికను మార్చినట్లు సమాచారం. విశాఖపట్నంలో హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యమంత్రి యోగినాథ్ తో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముఖ్య అతిథులుగా హాజరు కాబోతున్నట్లు సమాచారం. అలా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది
హరిహర వీరమల్లు సినిమా విశేషాలు..
2021 లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభం అయింది ఈ సినిమా. ఆ తర్వాత క్రిష్ సినిమా నుండి తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ రంగంలోకి దిగారు. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం జరిగింది. ఇందులో నిధి అగర్వాల్ (Nidhi Agarwal) హీరోయిన్గా నటిస్తోంది. ఎం ఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక భారీ అంచనాల మధ్య రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.
పవన్ కళ్యాణ్ సినిమాలు..
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమాను విడుదలకు ఉంచిన విషయం తెలిసిందే. మరొకవైపు ప్రముఖ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో ఓజీ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అలాగే ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాల తరువాత హరిహర వీరమల్లు 2 కూడా ఉండబోతుందని.. ఇందులో రామ్ చరణ్ కీలక పాత్ర పోషించబోతున్నారని సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి ఆలస్యంగా రీ ఎంట్రీ ఇచ్చినా వరుస సినిమాలతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చు.
ALSO READ:Kota Srinivasa Rao: కన్నీళ్లు పెట్టిస్తున్న కోట చివరి మాటలు.. ఇంతకంటే దారుణం ఉంటుందా?