BigTV English

AM Ratnam : OG OG కాదు.. ప్లీజ్ వీరా వీరా అనండి.. నిర్మాత ఆవేదన

AM Ratnam : OG OG కాదు.. ప్లీజ్ వీరా వీరా అనండి.. నిర్మాత ఆవేదన

AM Ratnam : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విశిష్టమైన దర్శకులలో ఏ ఎం రత్నం ఒకరు. కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడుగా కూడా సినిమాలు చేసిన అనుభవం ఆయనకు ఉంది. అలానే కొన్నిసార్లు పాటలకు కూడా సాహిత్యాన్ని అందించారు. తమిళ సినిమాలను అదే స్థాయిలో తెలుగు ప్రేక్షకులకు కూడా అందించిన ఘనత ఈయనకు ఉంది.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు అనే సినిమాను ఏఎం రత్నం నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావలసి ఉంది. కానీ కొన్ని కారణాల వలన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఒకవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అయిపోవడం కూడా ఈ సినిమా వాయిదాకు కారణం. మొత్తానికి ఈ సినిమా జులై 24న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

OG OG కాదు.. ప్లీజ్ వీరా వీరా అనండి


ఈ సినిమాకి సంబంధించిన ప్రెస్ మీట్ నేడు నిర్వహించింది చిత్ర యూనిట్. అలానే నేడు సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించే ఉంది. ఈ ఈవెంట్ పైన నిర్మాత ఏఎం రత్నం స్పందించారు. పవన్ కళ్యాణ్ బయట ఎక్కడ కనిపించినా చాలామంది ఫ్యాన్స్ ఓజి,ఓజి అని అరుస్తూ ఉండేవాళ్ళు. అది చూసి నాకు కొంచెం బాధగా అనిపించేది. ఆ సినిమా టైటిల్ చిన్నది కాబట్టి అలా అంటున్నారు, మా సినిమా టైటిల్ చాలా పెద్దది. అటువంటి తరుణంలో కనీసం వీరా అని అనండి అని అనుకునేవాడిని. కానీ మొత్తానికి కేవలం నాకోసం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ కి హాజరవ్వడం సంతోషంగా అనిపించింది. అంటూ ఏం రత్నం ప్రెస్ మీట్ తర్వాత ఒక మీడియాతో పంచుకున్నారు.

ఏం రత్నం పైన ప్రశంసలు 

పవన్ కళ్యాణ్ చాలా తక్కువ మంది గురించి మాత్రమే ప్రశంసిస్తూ ఉంటారు. పలు సందర్భాలలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈరోజు ప్రెస్ మీట్ కు హాజరుకావడానికి మెయిన్ రీజన్ ఏఎం రత్నం అంటూ చెప్పేశారు. సినిమాలు మీద అతనికి ఉన్న డెడికేషన్ గురించి మాట్లాడారు. అలానే ఎప్పుడు నా సినిమా చూడండి అని అడగని పవన్ కళ్యాణ్ ఈ సినిమా విషయంలో మాత్రం చూడండి అని పిలుపునిచ్చారు. అలానే ఎప్పుడు సోషల్ మీడియాలో తన సినిమాలు గురించి పోస్ట్ పెట్టండి పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి పోస్ట్ పెట్టారు. ఏదేమైనా ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కొన్ని పనులు చూస్తుంటే నిర్మాత పైన ఎంత అభిమానం ఉందో కూడా అర్థమవుతుంది.

Also Read: HHVM Pre Relese Event : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆ దర్శకుడు కూడా… ఫ్యాన్స్‌కు పూనకాల స్పీచ్ లోడింగ్

Related News

Coolie vs War 2 : వార్‌కి ఇది సరిపోదు… మిగిలింది ఈ ఒక్క ఛాన్సే

Vadde Naveen: పదేళ్ల తర్వాత రీఎంట్రీ.. ఈ కానిస్టేబుల్ కష్టాలేందుకు నవీన్..

Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!

Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!

Aamir Khan Brother: ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఏవేవో మందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టాడు.. ఆమిర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు

Bad Girlz : స్టేజ్‌పైనే బట్టలు విప్పేసిన హీరోయిన్లు… వామ్మో అసలు వీళ్లకు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Big Stories

×