Viral Video: సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్‌కు ఉన్నంత పాలోయింగ్ మరేదానికి లేదనుకుంటా.. చిన్న పెద్ద అనే తేడా లేకుండా పొద్దున లేసింది మొదలు.. రాత్రి పడుకునే వరకు రీల్స్ చూస్తునే ఉంటారు. కొంచెం సమయం దొరికితే చాలు ఫోన్ ఆన్ చేసి రీల్స్ చూస్తునే ఉంటారు. అయితే బట్టల షాపు వాళ్లు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా బిజినేస్ బాగా నడిపిస్తున్నారు. అదేలా అనుకుంటున్నారా.. ఇన్‌స్టాలో ఈ క్లాత్ కేవలం 100 రూపాయిలే.. ఈ షర్ట్ రూ.200కే అంటూ తెగ రీల్స్ చేస్తున్నారు. తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఏముండదు.. అంతా ఫేక్.. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. రెండు రూపాయలకే షర్ట్ అంటూ ఇన్‌స్టాలో ప్రచారం చేశారు ఓ షాప్ ఓనర్..
రెండు రూపాయలకే షర్ట్ అంటూ ఇన్‌స్టాలో ప్రచారం
2 రూపాయలకే షర్ట్ అంటూ ఇన్ స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు బట్టల షాప్ యజమాని. ఉదయం 11 గంటల నుంచి 11 గంటల 10 నిమిషాల వరకు రెండు రూపాయలకే షర్ట్ ఇస్తానని ప్రచారం చేశారు. దీంతో మెదక్ జిల్లా, నర్సాపూర్‌లో ఉన్న బట్టల షాప్‌కి భారీ ఎత్తున యువకులు షాప్ వద్దకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో యువకుల మద్య తోపులాట జరిగింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు యువకులను చెదరగొట్టారు. మరో వైపు యువకులు అధికంగా రావడంతో షాపు ఓనర్ దుకాణం మూసి వేసి పరారైయ్యాడు.
Also Read: జాగ్రత్త! నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట..
ఈ విషయంపై మరిన్ని వివరాలు:
ఈ ఇన్‌స్టాగ్రామ్ రీల్ స్థానికంగా భారీ ఆసక్తిని రేకెత్తించింది, ఫలితంగా బట్టల దుకాణం వద్ద జనం గుండెలు పట్టుకునేలా రద్దీ ఏర్పడింది. 2 రూపాయలకే షర్ట్ వస్తుండడంతో యువకులు ఎంతో ఆశతో వెళ్ళారు.. కానీ అక్కడికి భారీగా రద్దీ రావడంతో షాపు ఓనర్ చేతన్ బయపడి షాపు క్లోజ్ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు యజమాని చేతన్‌పై కేసు నమోదు చేసి, అతని కోసం గాలింపు ప్రారంభించారు. ఈ రకమైన ప్రచారాలు బాధ్యతాయుతంగా లేకపోతే సమస్యలు తలెత్తవచ్చని హెచ్చరిస్తున్నారు.
రూ. 2 లకే షర్ట్ అంటూ Instaలో పోస్ట్
దింతో బట్టల షాప్ కి భారీగా వచ్చిన యువకులు
యువకులు ఎగబడడంతో షాప్ మూసేసి పరారైన యజమాని
సూర్యాపేట జిల్లా నర్సాపూర్ లో ఘటన pic.twitter.com/e7XutqYDE5
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2025