Sarfaraz Khan Father : టీమిండియా క్రికెటర్ సర్పరాజ్ ఖాన్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇతను చూడటానికి చాలా లావుగా కనిపిస్తుంటాడు. ఇతను టెస్టుల్లో ఆరంగేట్ర మ్యాచ్ లోనే అదురగొట్టాడు. ఇంగ్లాండ్ పై ఆరంగేట్రం చేసి స్పిన్ బౌలర్ల ను అలవొకగా ఎదుర్కొని తనదైన శైలిలో పరుగులను సాధించాడు. అయితే ఇతన్ని మాత్రం టీమిండియా సెలక్టర్లు ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఎంపిక చేయకపోవడం గమనార్హం. ఇంగ్లాండ్ తో టెస్ట్ ఆడతానని.. సెలక్ట్ అవుతానని కఠోర శ్రమ పడ్డాడు. ఇదిలా ఉంటే.. తాజాగా సర్పరాజ్ ఖాన్ తండ్రి గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. నౌషాద్ ఖాన్ ఇటీవల 122 కేజీలు బరువు కలిగి ఉన్నాడు. అయితే జిమ్ లో కఠోరంగా శ్రమించి ఎక్సర్ సైజ్ చేసి.. స్విమ్మింగ్ చేసి దాదాపు 22 కిలోల బరువు తగ్గాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతను జిమ్ లో చేసిన వర్కౌట్ కి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Rinku Singh : రింకూ సింగ్ ను కుక్కలా తిప్పించుకుంటున్న కాబోయే పెళ్ళాం… రోడ్లపై ఫోటోలు వైరల్
కఠోరంగా శ్రమించిన కోచ్
సర్పరాజ్ తండ్రి 22 కేజీలు తగ్గాడా..? కొందరూ ఆశ్యర్యపోవడం గమనార్హం. వాస్తవానికి సర్పరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్ క్రికెట్ కోచ్. ఇక్బాల్ అబ్దుల్లా, కమ్రాన్ ఖాన్ వంటి యువ క్రికెటర్లను పెంచి పోషించాడు. ఉత్తరప్రదేశ్ లోని అజంగఢ్ లో నివాసం ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇంగ్లాండ్ తో జరుగుతున్న 5 టెస్టుల సిరీస్ కోసం సర్పరాజ్ ఖాన్ కఠోరంగా శ్రమించాడు. చాలా లావుగా ఉన్న అతను.. ఏకంగా 10 కేజీల బరువు కూడా తగ్గాడు. నిత్యం ప్రాక్టీస్ చేయడం.. డైట్ ఫాలో కావడంతో 10 కేజీలు తగ్గాడు. ఎలాగైనా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ కి ఎంపికై తాను ఏంటో నిరూపించుకోవాలని భావించాడు. కానీ అతన్ని సెలెక్ట్ చేయకపోవడంతో చాలా బాధపడ్డాడు. తన కెరీర్ లో టీమిండియా తరుపున ఇంగ్లాండ్ పై ఆరంగేట్రం చేసిన ఈ బ్యాటర్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.
ఇంగ్లాండ్ పై సర్ఫరాజ్ అద్భుత ఇన్నింగ్స్..
గతంలో రాజ్ కోట్ లో నిర్వహించిన టెస్ట్ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 66 బంతుల్లో 62 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 72 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో ఇంగ్లాండ్ పై అద్భుతంగా బ్యాటింగ్ చేయగలడని అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు గత ఏడాది న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో తొలి ఇన్నింగ్స్ లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ సాధించాడు సర్పరాజ్. 110 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో ఒక టెస్ట్ మ్యాచ్ లో సున్నాతో సెంచరీ చేసిన ప్రత్యేక బ్యాట్స్ మెన్ ల జాబితాలో సర్పరాజ్ ఖాన్ చేరాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 183 మంది ఆటగాళ్లు మాత్రమే సున్నాతో పాటు సెంచరీ చేసిన అరుదైన రికార్డును సాధించారు. అందులో సర్పరాజ్ ఖాన్ 183వ బ్యామ్స్ మెన్ కావడం విశేషం.
?igsh=NnkxcjR2c2x5NGVi