HHVM Trailer:2021లో ప్రముఖ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రకటించిన చిత్రం హరిహర వీరమల్లు(Hari Hara Veera mallu). మధ్యలో కరోనా లాక్ డౌన్ విధించడం , పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉండడం వల్ల 60 శాతం షూటింగ్ పూర్తి అయిన తర్వాత సినిమాను ఆపివేశారు. ఆ తర్వాత మళ్లీ ఈ సినిమా పట్టాలెక్కలేదు. చాలాకాలం ఎదురుచూసిన క్రిష్ జాగర్లమూడి అనూహ్యంగా సినిమా నుండి తప్పుకున్నారు. అయితే ఆ సినిమా బాధ్యతలను డైరెక్టర్ జ్యోతి కృష్ణ (Jyoti Krishna)కు అప్పగించి మరీ ఆయన తప్పుకోవడం జరిగింది. ఇక మరోవైపు ఆంధ్రప్రదేశ్ కి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఈ ఏడాది హరిహర వీరమల్లు సినిమా కోసం డేట్స్ కేటాయించారు పవన్ కళ్యాణ్.
హరిహర వీరమల్లు ట్రైలర్ పై కాపీ కామెంట్స్..
అలా దాదాపు కొన్ని సంవత్సరాల నిరీక్షణ తర్వాత 14 సార్లు వాయిదా పడుతూ ఇప్పుడు జూలై 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక విడుదలకు కేవలం 20 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ అభిమానులకు మంచి ఫీస్ట్ అందించినా.. సామాన్య సినీ ప్రేమికులు మాత్రం ట్రైలర్ పై కొన్ని నెగటివ్ కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రైలర్లో పవన్ కళ్యాణ్ ని ఎక్కువగా ఫోకస్ చేశారని, మిగతా పాత్రలను తక్కువ చేశారని, అక్కడక్కడ షార్ట్లు కట్ చేసి ఒకచోట చేర్చి విడుదల చేసినట్లు ఉంది అని ఇలా ఎవరికి వారు తమ అభిప్రాయాలుగా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇప్పుడు ఈ ట్రైలర్ పైనే కాపీ ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఆర్ ఆర్ ఆర్ సినిమాను కాపీ కొట్టారంటూ..
హరిహర వీరమల్లు ట్రైలర్ లాస్ట్ లో పవన్ కళ్యాణ్ నక్కతో పోరాడిన సన్నివేశం ఒకటి హైలెట్గా నిలిచినప్పటికీ ఇది కాపీ అని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో ఎన్టీఆర్(NTR ), రామ్ చరణ్ (Ram Charan) నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్ (RRR). ఈ సినిమా స్టార్టింగ్ లోనే ఎన్టీఆర్ కి – పులికి మధ్య ఒక క్లోజ్ సన్నివేశం సినిమాకే హైలెట్గా నిలిచింది. ఇప్పుడు దీనినే కాపీ కొడుతూ ఇక్కడ పవన్ కళ్యాణ్ – నక్కకి మధ్య సీన్ క్రియేట్ చేశారు. ఇది చూసిన పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ఈ షార్ట్ తప్ప మరొకటి దొరకలేదా? ఆర్ఆర్ఆర్ ని చూసి ఎందుకు కాపీ కొట్టారు? అంటూ డైరెక్టర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ట్రైలర్ లో ఆ సీన్ కాపీ.. తెరపైకి పూనమ్ ట్వీట్..
ఇకపోతే ట్రైలర్ చూసిన తర్వాత పూనమ్ చేసిన ట్వీట్ నిజమని ఇప్పుడు అందరూ కామెంట్లు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళ్తే ఈరోజు ఉదయం ఆమె తన ట్విట్టర్ హ్యాండిల్ లో..”ఒరిజినల్ కంటెంట్, బౌండెడ్ స్క్రిప్టు ఉన్న డైరెక్టర్ క్రిష్ కి కూడా గుర్తింపు లభించలేదు. కానీ కాపీ రైట్స్ ఇష్యూస్ ఉన్న ఆ దర్శకుడికి మాత్రం అంత గుర్తింపు ఇస్తున్నారు”అంటూ పూనమ్ ట్వీట్ చేసింది. అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దానిని డిలీట్ చేయడం గమనార్హం.
పూనమ్ మాటలు నిజమయ్యాయా?
వాస్తవానికి క్రిష్ జాగర్లమూడి 60 శాతం సినిమా షూటింగ్ పూర్తి చేశారు. సినిమా నుండి తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలను జ్యోతి కృష్ణ తీసుకున్నా.. త్రివిక్రమ్ పర్యవేక్షణలోనే సినిమా షూటింగ్ సాగిందని సమాచారం. దీనికి తోడు టైటిల్ కార్డ్స్ లో ఈయనకు స్పెషల్ థాంక్స్ మెన్షన్ చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా కాపీ కొట్టే డైరెక్టర్ కా పట్టం కట్టేది అని పూనం అలా ట్వీట్ పెట్టిందో లేదో.. ఇంతలోనే ట్రైలర్లో ఆర్ఆర్ఆర్ ను కాపీ కొట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.దీన్ని బట్టి చూస్తే నిజంగానే పూనమ్ చేసిన ట్వీట్ లో అర్థం ఉంది అంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర బంధం ఏ విధంగా క్లారిటీ ఇస్తుందో చూడాలి.