Ramayana Part 1:బాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ(RamayanaPart-1).. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం కూడా ఎక్కువగా ఇవ్వలేదు. కేవలం రాముడిగా రణబీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి, రావణుడిగా యష్ నటిస్తున్నట్లు మాత్రమే తెలిపారు. అంతేకానీ ఈ సినిమాకి సంబంధించిన మిగతా విషయాలు ఏవి కూడా ఎక్కువగా బయట పెట్టలేదు.
రామాయణ పార్ట్ వన్ నుండి అప్డేట్..
అయితే తాజాగా ఈ సినిమా గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. అదేంటంటే.. ఈ రామయణ మూవీ రెండు పార్ట్ లుగా రాబోతోంది. అయితే మొదటి పార్ట్ కి ఏకంగా ఇండియాలోనే హైయ్యెస్ట్ బడ్జెట్ పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఇంత మొత్తంలో బడ్జెట్ పెట్టలేదని.. ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ పెడుతున్న ఫస్ట్ సినిమా ఇదే అని తెలుస్తోంది. మరి ఇంతకీ రామాయణ పార్ట్ 1 కి పెడుతున్న బడ్జెట్ ఎంత అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
బడ్జెట్లో వెనుకడుగు వేయని నిర్మాత..
నితేష్ తివారి(Nitesh Tiwari) దర్శకత్వంలో సాయి పల్లవి(Sai Pallavi), రణబీర్ కపూర్ లు సీతారాములుగా యష్ (Yash) రావణుడిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకి నిర్మాతగా నమిత్ మల్హోత్రా(Namith Malhotra) వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే నమిత్ మల్హోత్రా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈయనకు విఎఫ్ఎక్స్ లో ఎంతో అనుభవం ఉంది. ఇప్పటివరకు ఏకంగా 8 సార్లు ఆస్కార్ అవార్డు అందుకున్న డిఎన్ఈజి (DNEG) అనే సంస్థకి సీఈవోగా కూడా ఉన్నారు. అలాగే ఈయనకు ప్రైమ్ ఫోకస్ (Prime Focus) అనే సొంత విఎఫ్ఎక్స్ కంపెనీ (VFX Company) కూడా ఉంది. అలా నిర్మాణ రంగంలో, విఎఫ్ఎక్స్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న నమిత్ మల్హోత్రా రామాయణ పార్ట్ 1 కి భారీ మొత్తంలో బడ్జెట్ పెడుతున్నట్టు తెలుస్తోంది.
పార్ట్ – 1 కోసం రూ.835 కోట్లు బడ్జెట్..
ఇక బాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం రామాయణ పార్ట్ 1 కి ఏకంగా 100 మిలియన్ డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం చూసుకుంటే.. రూ.835 కోట్లకు పైగానే బడ్జెట్ పెడుతున్నట్టు లీకులు వినిపిస్తున్నాయి.. ఈ లెక్కన చూసుకుంటే ఇప్పటివరకు ఇంత బడ్జెట్ తో ఇండియాలో ఏ ఒక్క సినిమా కూడా రాలేదు.
కల్కి సినిమాను బీట్ చేసిన రామాయణ పార్ట్ – 1
ఇండియాలో ఇప్పటివరకు హైయ్యెస్ట్ బడ్జెట్ తో వచ్చింది కల్కి2898AD (Kalki 2898 AD) సినిమా మాత్రమే వచ్చింది.అయితే ఇప్పుడు కల్కి సినిమాని బీట్ చేస్తూ ఏకంగా రూ.835 కోట్ల బడ్జెట్ తో రామాయణ పార్ట్ 1 మూవీ తెరకెక్కుతున్నట్టు బీ టౌన్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సినిమా పోస్టు ప్రొడక్షన్ కి దాదాపు సంవత్సర కాలం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమాకి సంబంధించి మొదటి పార్ట్ ఈమధ్యనే ఫినిష్ చేసినట్టు తెలుస్తోంది.
టీజర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా..
అలాగే రామాయణ పార్ట్ 1కి సంబంధించిన టీజర్ కూడా ఈరోజు విడుదల చేస్తున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ రామాయణ పార్ట్ 1 మూవీ 2026 దీపావళి కానుకగా విడుదల కాబోతున్న సంగతి మనకు తెలిసిందే. అలాగే పార్ట్ 2 ని 2027 దీపావళికి విడుదల చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎవరి ఊహలకు అందనంత ఎత్తులో ఉంటాయని, ఎన్ని వేల విఎఫ్ఎక్స్ ఉన్నాయో కూడా ఊహించుకోవడం చాలా కష్టం అంటూ సినిమాపై భారీ హైప్ పెంచుతున్నారు చిత్ర యూనిట్.. ఈ లెక్కన సినిమా ఏ లెవెల్ లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు చాలామంది నెటిజన్స్.ఇప్పటికే రామాయణం మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ నితేష్ తివారి ఈ సినిమాని మాత్రం మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ALSO READ:Bollywood Actor: ముంబై నుంచి గోవా.. 60 ఏళ్ల వయసులో 600 కి.మీ పరుగు.. ఈ హీరో సాహసానికి ఫిదా?