Actress Prerana: బుల్లితెర నటిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న వారిలో ప్రేరణ (Prerana)ఒకరు. ఈమె కన్నడ నటి అయినప్పటికీ తెలుగు సీరియల్స్ లో నటిస్తూ ఇక్కడ కూడా ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. స్టార్ మా లో ప్రసారమైన కృష్ణ ముకుందా మురారి సీరియల్ లో కృష్ణ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ప్రేరణ అనంతరం బిగ్ బాస్ 8 (Bigg Boss 8) కార్యక్రమంలో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో ఈమె టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత కొత్త సీరియల్స్ కు కమిట్ అవ్వకపోయినా బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తూ ప్రేక్షకులకు కావలసిన వినోదాన్ని అందజేస్తున్నారు.
డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్…
తాజాగా ఓ బుల్లితెర కార్యక్రమంలో పాల్గొన్న ప్రేరణ ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎంతో ఎమోషనల్ అయ్యారు. ఓంకార్(Omkar) హోస్ట్ గా వ్యవహరిస్తున్న డాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ (Dance Ikon 2 wild fire) కార్యక్రమం ఆహాలో (Aha) ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేరణ చెల్లెలు ప్రకృతి (Prakruthi)మెంటర్ గా ఛాన్స్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఓంకార్ ఈ కార్యక్రమానికి ప్రేరణ కూడా ఆహ్వానిస్తూ తన చెల్లెలు సక్సెస్ గురించి ఆమెను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ప్రేరణ మాట్లాడుతూ తన చెల్లి ఎప్పుడూ కూడా నాకంటే మంచి సక్సెస్ అందుకోవాలని నేను కోరుకుంటాను అంటూ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు.
మోడల్ కావాలన్న కల…
సాధారణంగా తల్లిదండ్రులు మేము మా జీవితంలో ఇది కావాలని కోరుకుంటారు కానీ, కొన్ని కారణాలవల్ల వారి కల నెరవేరదు అది వారి పిల్లల ద్వారా నెరవేరాలని ఆశపడతారు. అలాగే నేను కూడా నా జీవితంలో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి మంచి సక్సెస్ కావాలనుకున్నాను కానీ ఆ కోరిక తీరలేదు. నేను కాస్త పొట్టిగా, చబ్బిగా ఉండటం వల్ల అది నెరవేర లేకపోయింది కానీ నా చెల్లెలు “ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ” టైటిల్ గెల్చుకోవడం ఆనందంగా ఉంది అంటూ తన చెల్లి సక్సెస్ తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇలా తాను ఎప్పుడు నాకంటే జీవితంలో మంచిగా ఉండాలని ఈమె కోరుకున్నారు.
ఇక ప్రకృతి కూడా తన అక్క గురించి మాట్లాడుతూ.. నిత్యం నా గురించి ఆలోచిస్తూ .. తనకు ఎంతో సపోర్టివ్ గా ప్రేరణ నిలిచారు అంటూ తన అక్క పై ప్రశంసలు కురిపించారు. ఇలా వీరిద్దరి అక్కచెల్లెల బాండింగ్ చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో మానస్, యశ్ మాస్టర్, బ్రహ్మ ముడి కావ్య, జాను లిరి డాన్స్ మెంటర్స్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమానికి శేఖర్ మాస్టర్(Sekhar Master) జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ఆహా విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ అవుతుంది. ఇక ప్రేరణ బిగ్ బాస్ తర్వాత ఓంకార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఇస్మార్ట్ జోడి (Ismart Jodi)కార్యక్రమానికి వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హాజరయ్యారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ప్రేరణ శ్రీపాద్ దంపతులు విజేతలుగా నిలిచిన విషయం తెలిసిందే.
Also Read: లో బడ్జెట్ పవన్ కళ్యాణ్.. ‘సోలో బాయ్ ’మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో షాకింగ్ సర్‌ప్రైజ్