Uttarapradesh Crime: ఆమె ఒక వివాహిత.. భర్తపై గృహహింస కేసు పెట్టి కోర్టులో వాయిదాలకు తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఓవ్యక్తితో పరిచయం. ఆ పరిచయం కాస్త మరో వివాహానికి దారితీసింది. అతడితో ఆరేళ్లుగా కలిసి ప్రయాణం సాగించింది. ఉన్నపళంగా రెండో భర్త మరణించాడు. ఈ క్రమంలోనే అతని అన్నతో రిలేషన్ నడిపించింది. భర్త ఆస్తిపై కన్నేసింది. సీన్ కట్ చేస్తే ఆ ఆస్తిని వివాహితకు నిరాకరించింది అత్త. దీంతో అత్తను హత్యచేసి ఎలైగైనా కాజేయాలనుకుంది. చివరకు కటకటాలపాలైంది. దైవస్ కేసుతో ప్రారంభమైన ఈమె స్టోరీ హత్య, లివింగ్ రిలేషన్ సీరియల్ క్రైమ్ లాగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో పూజా జాతవ్ అనే వివాహిత జీవిస్తోంది. పెళ్లైన కొంత కాలానికి భర్తతో విభేదాలు కారణంగా గృహహింస కేసు పెట్టింది. ఈ కేసు నేపథ్యంలో కోర్టు చుట్టూ వాయిదాలకు తిరుగుతోంది. సరిగ్గా అదే సమయంలో కోర్టు ఆవరణలో కళ్యాణ్ అనే వ్యక్తి పూజా జాతవ్‌కు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. మొదటి భర్తకు సంబంధించి గృహ హింస కేసు విచారణలో ఉండగానే కళ్యాణ్‌ను రెండోపెళ్లి చేసుకుంది. అలా కళ్యాణ్ ఇంటికి వెళ్లి సంసారం సాగిస్తోంది. ఈ పెళ్లి కల్యాణ్ తల్లి సుశీలా దేవికి ఇష్టం లేదు. అయినప్పటికీ కోడలితో కలిసి జీవిస్తోంది.
ఇదిలా ఉంటే పెళ్లైన ఆరునెలలకే కళ్యాణ్ సస్పీషియస్‌గా చనిపోయారు. రోడ్డు ప్రమాదంగా కేసు నమోదు అయింది. దీనికి సంబంధించిన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక సీన్ కట్ చేస్తే రెండో భర్త కళ్యాణ్ చనిపోయిన తర్వాత తన అన్న సంతోష్‌తో రిలేషన్ పెట్టుకుంది పూజ. దీనిని సంతోష్ భార్య ఎప్పటికప్పుడు వ్యతిరేకిస్తూ వచ్చింది. అయినప్పటీ పూజ ఎక్కడ కూడా తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబంలో గొడవలు ప్రారంభమయ్యాయి. కళ్యాణ్ తన భర్త అని మొత్తం ఆస్తిలో సగం వాటా కావాలని పూజా డిమాండ్ చేసింది. అందుకు అత్త సుశీలా దేవి అంగీకరించలేదు. అయితే ఆస్తి విషయంలో మామ, బావల మద్దతు లభించడంతో సుశీలా దేవి వెనక్కు తగ్గింది. ఈ క్రమంలోనే వరుసకు మామ అయినప్పటికీ సుశీలదేవి భర్తతో పూజా రిలేషన్ కొనసాగించింది. ఈ విషయం తెలుసుకున్న సుశీల దేవి కోపంగా పూజను హెచ్చరించింది. తనపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. అత్త అడ్డుతొలగించుకోవాలని పథకం వేసింది.
ఇప్పుడు అసలైన ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆస్తిని ఎలాగైనా దక్కించుకోవాలన్న ఆలోచనలో భాగంగా తన ప్రియుడు అనీల్ వర్మను, సోదరి కామికాను రంగంలోకి దింపింది. కుట్రలో భాగంగా జూన్ 24 వ తేదీ సాయంత్రం అనీల్, కామినీలు యూపీలోని ఝాన్సీకి చేరుకున్నారు. ఈ క్రమంలోనే పూజ తన కుటుంబ సభ్యులను బయటకు పంపించేందుకు ప్లాన్ వేసింది. అందరు బయటకు వెళ్లిన తర్వాత అనీల్, కామినీలు ఇంట్లోకి ప్రవేశించి పూజ అత్త సుశీలా దేవికి విషం ఎక్కించి గొంతు నులిమి చంపేశారు.
Also Read: ప్రియుడి ప్రేమ కోసం.. భర్తని చంపేందుకు షూటర్లు, అనూహ్యంగా చిక్కిన నవ వధువు
అదే సందర్భంలో బీరువాలోని ఎనిమిది లక్షలు విలువ చేసే నగదు, డబ్బు తీసుకుని పారిపోయారు. అత్త సుశీలాదేవి అంత్యక్రియలు అయిపోయిన తర్వాత పూజ కనిపించకపోవడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. దీంతో అసలు విషయం బయటకు వచ్చింది. పూజ ముబైల్ నెంబర్ ఆధారంగా ట్రేస్ చేశారు పోలీసులు.. ఆమె కాల్ రికార్డింగ్ పరిశీలించి నిందుతురాలిగా పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా పూజను విచారించగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేవలం ఆస్తి కోసమే ఈ విధంగా మర్డర్, రిలేషన్ షిప్ ప్లాన్ చేశానని చెప్పినట్లు పోలీసులు వెల్లడించారు.