Actor Shot dead:విధిరాతను ఎవరు తప్పించలేరు అని ఇప్పటికే ఎంతోమంది ప్రూవ్ చేశారు కూడా.. సాధారణంగా ఎవరైనా సరే పక్క వారు ఆపదలో ఉన్నారు అంటే ఆదుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆ ప్రయత్నంలో ఒక్కోసారి తమకే ఎదురుదెబ్బలు తగలవచ్చు. అయితే ఇక్కడ ఒక సినీనటుడు ఏకంగా ప్రాణాలనే కోల్పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ముఖ్యంగా ఆయన మరణించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
సహాయం చేయడానికి వెళ్లి మృతి చెందిన సినీనటుడు..
అసలు విషయంలోకి వెళ్తే.. వర్జీనియాలోని రిచ్ మండ్ కు చెందిన ప్రముఖ సినీ నటుడు ఆడమ్ టర్క్ హత్యకు గురయ్యాడు. ప్రస్తుతం ఆయన వయసు 35 సంవత్సరాలు. ట్రాఫిక్ స్టాఫ్ లో గృహహింస బాధితుడికి సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుండగా.. 19 ఏళ్ల వ్యక్తి అతడిపై కాల్పులు జరిపాడు అని పోలీసులు స్పష్టం చేశారు. దీంతో ఆ కాల్పుల్లో ఆడమ్ చనిపోయారు అని కూడా చెప్పారు. “అవసరంలో ఉన్న వ్యక్తిని రక్షించడానికి ఆడమ్ తన ప్రాణాలను పణంగా పెట్టాడు. ఈ త్యాగానికి మేము అతనిని ఎప్పటికీ గుర్తించుకుంటాము” అని ఆడమ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సహాయం చేయడానికి వెళ్లి ఏకంగా ప్రాణాలనే కోల్పోయారు అంటూ అభిమానులు నిట్టూరుస్తున్నారు.
ఆడమ్ టర్క్ కెరియర్..
ఆడమ్ టర్క్ కెరియర్ విషయానికి వస్తే.. థియేటర్ అండ్ ఫిట్నెస్ కమ్యూనిటీలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఓల్నీ థియేటర్ నేషనల్ ప్లేయర్స్ తో కలిసి దేశ పర్యటన చేశారు. ఆ తర్వాత బక్స్ కౌంటింగ్, పెన్సిల్వేనియా నుండి రిచ్మండ్ కి మారి అక్కడే సెటిల్ అయిపోయారు. అక్కడ స్థానిక కళా రంగంలో హీరోగా పేరు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రిచ్మండ్ థియేటర్ కమ్యూనిటీ సర్కిల్ అవార్డులకు చాలా సార్లు నామినేషన్ కూడా అందుకున్నారు. ఇక 2018లో ‘హ్యాండ్ టు గోడి’ చిత్రంలో నటించిన ఈయన ఉత్తమ నటుడిగా అవార్డు కూడా సొంతం చేసుకున్నారు.
కన్నీటి పర్యంతమవుతున్న సినీ ప్రముఖులు..
ఆడమ్ టర్క్ ఇలా కాల్పుల్లో చనిపోవడంతో ఆయన అభిమానులు, సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. అందులో ఒక వ్యక్తి..”మా జిమ్ కమ్యూనిటీలోనే కాదు థియేటర్ కమ్యూనిటీలో కూడా ఇలాంటి గొప్ప వ్యక్తి లేడు. ఒకరకంగా చెప్పాలి అంటే ప్రపంచ సినీ రంగంలోనే ఇలాంటి గొప్ప వ్యక్తి ఎక్కడ తారసపడడు.. అంత గొప్ప వ్యక్తిని కోల్పోవడం నిజంగా బాధాకరం” అంటూ తెలిపారు.
ఇంకొక సినీనటుడు..” ప్రజలు పుస్తకాలలో ఈయన పేరును చేరుస్తారు. ఇంతకంటే గొప్ప వ్యక్తి మనకు గాని ఇంకెవరికి గాని దొరకడు.. ప్రపంచం ఇప్పుడు చీకటి అయిపోయింది” అంటూ ఇలా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆడమ్ లాంటి ఒక గొప్ప వ్యక్తి కాల్పుల్లో మరణించడాన్ని అక్కడివారు తట్టుకోలేకపోతున్నారు.
ALSO READ:Annapurna Studios: అన్నపూర్ణ స్టూడియోలో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త.. అసలేమైందంటే?