Buyers Losses For HHVM: భారీ అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఎట్టకేలకు ఈ ఏడాది జూలై 24న థియేటర్లలో విడుదలైంది. రిలీజ్‌కు ముందు ఈ సినిమాకు ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. ఒకానోక టైంలో ఈ చిత్రం ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ కళ్యాణ్ చొరవతో ఈ సినిమాకు ఉన్న సమస్యలు పోయి.. థియేటర్లలో రిలీజైంది. విడుదలకు ముందు మూవీపై విపరీతమైన బజ్ క్రియేట్ అయ్యింది.
మొత్తం వసూళ్లు రూ. 118 కోట్లు
కానీ, రిలీజ్ తర్వాత అంచనాలన్ని తారుమారయ్యాయి. మూవీ కథ పరంగా ఆకట్టుకున్న స్క్రీన్‌ప్లే, వీఎఫ్‌ఎక్స్ నిరాశ పరిచాయి. ఫస్టాఫ్ బాగున్నప్పటి సెకండాఫ్ నిరాశ పరించింది, వీఎఫ్‌ఎక్స్ కారణంగా మూవీకి నెగిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఇక యాంటీ ఫ్యాన్స్ మూవీపై నెగిటివ్ టాక్ ప్రచారం చేయడంతో ఆ ప్రభావం కలెక్షన్స్‌పై పడ్డాయి. మూవీ ఫస్ట్ డే మంచి వసూళ్లు సాధించిన.. ఆ తర్వాత కలెక్షన్స్ ఒక్కసారిగా డ్రాప్ అయ్యాయి. తొలి రోజు రూ. 41 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లు చేసిన ఈ సినిమా సెకండ్ డే దారుణంగా పడిపోయాయి. సింగిల్ నెంబర్స్ చూపించాయి. దీంతో మొత్తం ఈ సినిమా రూ. 118 కోట్ల గ్రాస్ మాత్రమే చేసింది. ఈ సినిమాను రూ. 250 కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు ఏఎం రత్నం.
మొత్తం నష్టం రూ. 60 కోట్లు
దీంతో ఈ సినిమా నిర్మాతతో పాటు బయ్యర్లు కూడా భారీగా నష్టాలు చూశారు. ఏరియా వైస్‌గా హరి హర వీరమల్లు మూవీ నస్టాలు వివరాలు ఇలా ఉన్నాయి. నైజాం – రూ. 12 కోట్లు, ఉత్తరాంధ్ర – రూ. 7 కోట్లు, వెస్ట్ గోదావరి – రూ. 1 కోటి, గుంటూరు – రూ. 4 కోట్లు, నెల్లూరు – రూ. 2 కోట్లు, సీడెడ్ – రూ. 9 కోట్లు మరి కొన్ని ఏరియాల్లో కలిపి – రూ. 5 కోట్లు వరకు మూవీకి నష్టాలు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇక ఓవర్సిస్‌లో సుమారు రూ. 15 కోట్ల వరకు నష్టాలు వచ్చినట్టు సమాచారం. దీంతో హరి హర వీరమల్లు మొత్తంగా రూ. 55 కోట్ల నుంచి రూ. 60 కోట్ల వరకు నష్టాలు వచ్చాయట. ఇక ఈ నష్టాలను కనీసం GST అయినా ఇప్పించాలని బయ్యర్లు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించారట.
Also Read: HHVM Losses : రత్నం 15 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్‌లో బయ్యర్లు ఫిర్యాదు ?
కాగా ఈ మూవీ నష్టాల విషయంలో ఏఎం రత్నం తనకు సంబంధం లేదని అంటున్నారట. తమ నష్టాలకు కనీసం జీఎస్టీ అయినా ఇవ్వాలని బయ్యర్లు నిర్మాతలను కోరారట. ఈ విషయమైన ఆయనకు ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో బయ్యర్లు ఫిల్మ్ ఛాంబర్ ను ఆశ్రయించారు. దీనిపై పవన్ కళ్యాణ్ ని కల్పించాలని కోరగా.. ఫిల్మ్ ఛాంబర్ ఈ మేరకు వారికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇవాళ ఈ సినిమా ఓటీటీలో విడుదలైన సంగతి తెలిసిందే. నెల రోజులు కూడా తిరక్కుండానే ఈ చిత్రం ఆమెజాన్ ప్రైం వీడియోలో రిలీజ్ అయ్యింది. అయితే మూవీ ఓటీటీ వెర్షన్ కు మేకర్స్ కట్ విధించారు. క్లైమాక్స్ పూర్తిగా మార్చేసి.. పవన్ కళ్యాణ్, బాబీ డియోల్ సంబంధించిన కీలక సన్నివేశాన్ని తొలగించారట.