BigTV English

HHVM Losses : రత్నం 15 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్‌లో బయ్యర్లు ఫిర్యాదు ?

HHVM Losses : రత్నం 15 కోట్లు ఇవ్వాలి… ఫిల్మ్ ఛాంబర్‌లో బయ్యర్లు ఫిర్యాదు ?

HHVM Buyers Demands Movie Losses: పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా నష్టాలు ప్రొడ్యూసర్ ఎఏం రత్నంను వీడటం లేదు. ఇప్పటికే ఈ మూవీకి దాదాపు 55 నుంచి 60 కోట్ల వరకు నష్టం వచ్చిందని తెలుస్తుంది. దీని ప్రభావం రత్నం చాలా ఉంది. దీంతో పాటు ఇప్పుడు మరో 15 కోట్ల వరకు ఆయనపై భారం పడబోతుందని తెలుస్తుంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం..


నాకు సంబంధం లేదు.. 

పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రిన్ పై కనిపించిన సినిమా హరి హర వీరమల్లు. 6 ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ జూలై 24న రిలీజ్ అయింది. సినిమా మంచి టాక్ వచ్చినా… VFX కారణంగా నెగిటివ్ రివ్యులు వచ్చాయి. అలాగే కొంత మంది యాంటి ఫ్యాన్స్ చేసిన నెగిటివ్ ట్రెండ్ ఎఫెక్ట్ కూడా హరి హర వీరమల్లుపై పడింది. దీంతో కమర్షియల్‌గా హరి హర వీరమల్లు సినిమా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. దీని వల్ల దాదాపు 55 – 60 కోట్ల వరకు నష్టం వచ్చినట్టు ట్రెడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. ఈ నష్టాలతో ఇప్పటికే నిర్మాత రత్నం చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ టైంలో ఆయనకు మరో షాక్ తగిలిందని తెలుస్తోంది. ఈ సినిమా నష్టాల్లో కనీసం GST అయినా ఇప్పించాలని బయ్యర్లు నిర్మాత ఏఎం రత్నంను కోరారట.


ఆయన తనకు సంబంధం లేదు అనటడం హరి హర వీరమల్లు బయ్యర్లు ఫిలిం ఛాంబర్‌ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మూవీ కారణంగా తాము నష్టపోయామని, కనీసం జీఎస్‌టీ అయినా ఇప్పించాలని డిమాండ్‌ చేస్తున్నారట బయ్యర్లు. కాగా మూవీ నష్టాలు పూర్తిగా పూడ్చలేకపోయిన.. కనీసం జీఎస్ట్‌ ఇప్పించాలని నిర్మాత ఏఎం రత్నంకు బయ్యర్లు ఫోన్‌ చేసి అడిగారట. దీనికి ఆయన స్పందిస్తూ.. తనకు ఏం తెలియదు అన్నట్టు మాట్లాడారట. ఇప్పటికే తాను చాలా నష్టాపోయానని, తన డబ్బులు లెవని చేతులెత్తేశారట. అంతేకాదు మూవీ నష్టం, లాభంతో తనకు సంబంధం లేదని, అది తమ బాధ్యత అన్నట్టుగా వ్యవహరించారట.  దీంతో కనీసం తమని ఏపీ డిప్యూటీ సీఎం, హీరో వపన్‌ కళ్యాణ్‌తో అయినా కలిపించాలని బయ్యర్లు ఫిలిం ఛాంబర్‌ను కోరారట. పవన్ మరో సినిమా చేస్తే దాని రైట్స్ తమకు తక్కువ ప్రైజ్ కి ఇస్తే తాము ఈ లాస్ లో నుంచి బయట పడే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఒక వేళ బయ్యర్లు అడుగుతున్న GST ఇవ్వాలంటే, రత్నం దాదాపు 12 నుంచి 15 కోట్ల వరకు బయ్యర్లకు ఇవ్వాల్సి ఉంటుంది.

Also Read: HHVM OTT: ఓటీటీలోకి వీరమల్లు.. క్లైమాక్స్‌లో మార్పులు… ఉన్న ఆ ఒక్క సంతృప్తి కూడా పోయింది

బయ్యర్లు ఫిల్మ్ ఛాంబర్ హామీ

దీంతో ఈ విషయమై పవన్ కళ్యాణ్‌తో మాట్లాడాతామని ఫిల్మ్ ఛాంబర్ బయ్యర్లకు హామీ ఇచ్చిచినట్టు సమాచారం. మరి దీనిపై పవన్‌ ఎలా స్పందిస్తారు.. బయ్యర్ల నష్టాలను ఎలా పూడ్చుతారనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌ గా మారింది. క్రిష్‌ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎన్నో వాయిదాల తర్వాత జూలై 24న వరల్డ్‌ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాగాలుగా తెరకెక్కున్న ఈ చిత్రం ఫస్ట్‌ పార్ట్‌ మంచి టాక్‌ వచ్చినా.. వీఎఫ్ఎక్స్‌ పరంగా నెగిటివ్ రివ్యూలు అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం కమర్షియల్‌గా ఫెయిల్‌ అయ్యింది. థియేటర్లలో మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ సినిమా నెల రోజుల ముందే ఓటీటీలో విడుదలైంది. నేడు ఆగష్టు 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చిన హరి హర వీరమల్లు మూవీ ఓటీటీ ప్రేక్షకులు షాకిచ్చింది. ఈ మూవీ క్లైమాక్స్‌ని మార్చేసి విడుదల చేశారు మేకర్స్‌. అసుర హననం పాటతో మూవీ శుభం వేసి పార్ట్‌ 2ని ప్రకటించారు. అయితే దీనిపై మూవీ లవర్స్‌, ఓటీటీ లవర్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. క్లైమాక్స్‌ మార్చడంపై ఆడియన్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Related News

Nandamuri Padmaja : ముగిసిన పద్మజా అంత్యక్రియలు.. వదినకు కొడుకులా మారిన బాలయ్య!

Nara Rohith: నేను ‘వార్‌ 2’ సినిమా చూడలేదు.. నారా రోహిత్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Mahesh Babu: ఛారిటీ కోసం ప్రతి ఏడాది మహేష్ ఎన్ని కోట్లు డొనేట్ చేస్తారో తెలుసా?

Nara Rohith: నా ఇంటి పేరే నాకు సమస్య… నారా రోహిత్ సంచలన వ్యాఖ్యలు!

Naga Chaitanya: దేవర డైరెక్టర్‌తో కాదు కానీ.. దేవర నిర్మాతలతో నాగచైతన్య మూవీ ?

HHVM Losses: వీరమల్లు నష్టాలు… బయ్యర్లపై పడిన భారమెంతంటే!

Big Stories

×