Alimony Rumors: హృతిక్ రోషన్ ,సుసానే ఖాన్ …దేశవ్యాప్తంగా మోస్ట్ అడోరబుల్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ఈ జోడి 2014లో విడాకులు తీసుకుంటున్నప్పుడు అభిమానులు ఎంతగా బాధపడిపోయారో చెప్పక్కర్లేదు .‘కహో నా ప్యార్ హై’వంటి సూపర్ హిట్ తో ఓవర్ నైట్ సూపర్ స్టార్ గా మారిన హృతిక్ రోషన్ తన చిన్ననాటి స్నేహితురాలు సుసానేను 2000 డిసెంబర్‌లో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు .అయితే దాదాపు 14 ఏళ్ల వివాహ బంధం తర్వాత ఈ జంట విడిపోవాలని డిసైడ్ అవ్వడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ .
అయితే ఆ విడాకులు తీసుకున్న ప్రకటన వచ్చిన వెంటనే సుసానే ఖాన్ తనకు హృతిక్ నుంచి ఏకంగా 400 కోట్ల భరణం డిమాండ్ చేసిందంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఒక వార్త తెగ సర్క్యులేట్ అయింది.దీంతో హృతిక్ ఎంత స్టార్ హీరో అయితే మాత్రం ఇంత భారీ మొత్తాన్ని డిమాండ్ చేస్తుందా అంటూ తీవ్రంగా ట్రోల్ చేశారు నెటిజెన్లు.అయితే దాదాపు 12 ఏళ్లుగా నలిగిపోతున్న ఈ న్యూస్ పై తాజాగా సుసానే ఖాన్ సోదరి బాలీవుడ్ ప్రముఖ జ్యవెలరీ డిజైనర్ ఫరా ఖాన్ అలీ అసలు నిజాలని బయటపెట్టింది.
అసలు ఆ సమయంలో ఏం జరిగిందనే దానిపై క్లారిటీ ఇస్తూ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వార్తల్ని ఖండించింది హృతిక్ నుంచి సుసానే ఖాన్ఎకౌంట్ కనీసం ఒక్క రూపాయి కూడా భరణంగా తీసుకోలేదని 400 కోట్ల రూపాయలు అనేది కేవలం సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్పలె అని స్పష్టం చేసింది .ఇక తమ కుటుంబం సంస్కారవంతమైనదని భౌతిక సుఖాల కంటే బంధాలకి ఎక్కువ విలువ ఇస్తామని చెప్పుకొచ్చింది ఫరా.
సుసానే ఖాన్ సొంతంగానే సక్సెస్ ఫుల్ ఇంటీరియర్ డిజైనర్ అని ,అలాంటి ఆమె ఎవరి దగ్గర డబ్బు ఆశించదని ,ఆమెని గోల్డ్ డిగ్గర్ లాగా చిత్రించడం తనని ఎంతో బాధించిందని ఆవేదన వ్యక్తం చేసింది.నిజానికి ఈ విడాకుల వ్యవహారం నడుస్తున్న సమయంలో క్రిష్ 3 బ్యాంగ్ బ్యాంగ్ వంటి భారీ సినిమా సక్సెస్ లతో హృతిక్ రోషన్ కెరీర్ పిక్స్ లో ఉందని అలాంటి సమయంలో వచ్చిన ఈ రూమర్లని సుసానే ఎంతో ఓపికతో ఎదుర్కొందని గుర్తు చేసుకుంది ఫరా .సమాజం, మీడియా ఏమనుకున్నా తన పర్సనల్ లైఫ్ పై ఎవరికి ఎప్పుడు వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదనేది సుసానే నమ్మకమని చెప్పింది.
also read:ఆ బూతు బొమ్మలని తక్షణమే తొలగించండి.. టెక్ దిగ్గజాలపై కోర్టుకెక్కిన బాలీవుడ్ బ్యూటీ
అందుకే ఆ పుకార్లపై తను ఎప్పుడు స్పందించలేదని, తన ప్రైవసీని కాపాడుకుంటూనే సొంత వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుందని ఆకాశానికి ఎత్తేసింది ఫరా .సాధారణంగా బాలీవుడ్లో విడాకులు తీసుకున్న జంటలు కోట్లు మెట్లు ఎక్కడం వారిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం చాలా కామన్ .కానీ 12 ఏళ్ల అయినా వారి విషయంలో ఇలాంటివి కనిపించకపోవడం విశేషం.
ఇక హృతిక్ రోషన్,సుసానే ఖాన్ ల జోడికి హృహాన్, హృదాన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిద్దరు విడిపోయిన కూడా సుసానే హృతిక్ తల్లిదండ్రులతో ఇప్పటికీ అనుబంధాన్ని కొనసాగిస్తుండడం విశేషం. ఇక వీధి మధ్య ఎలాంటి ఆర్థిక విభేదాలు లేవటానికి ఇదే ఒక ప్రత్యక్ష సాక్ష్యం.చూడాలి మరి ఫరాఖాన్ ఇచ్చిన క్లారిఫికేషన్ తో అయినా ఆ 400 కోట్ల భరణం పుకార్లకు చేపడుతుందో లేదో!