Hrithik Roshan warns Jr NTR for sending Billboard under his house ahead of war 2 release
Hrithik vs Jr NTR:బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు హృతిక్ రోషన్ (Hrithik Roshan)త్వరలోనే వార్ 2(War 2) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. అయాన్ ముఖర్జీ(Ayan Mukerji) దర్శకత్వంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ (NTR)హీరోలుగా నటించిన ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు.. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ కూడా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా ఈ ఇద్దరు హీరోలు సరదాగా గొడవ పడుతూ చేస్తున్న వరుస ట్వీట్లు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
విభిన్న రీతిలో ప్రమోషన్స్…
ఇలా సరదా ఘర్షణలతో కూడా ఈ ఇద్దరు హీరోలు తమ సినిమాకు కావలసినంత హైప్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. సోషల్ మీడియా వేదికగా ఈయన తన ఇంటి బాల్కనీలో నిల్చోని ఉన్నటువంటి ఫోటోలను షేర్ చేశారు. అయితే తన ఇంటి ముందు ఒక వెహికల్ ఆగి ఉంది అయితే ఆ వెహికల్ కి ఉన్నటువంటి ఒక పోస్టర్ కి సంబంధించి ఈయన చేసిన ట్వీట్ వైరల్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోతో పాటు ఒక హెచ్చరికతో కూడిన బిల్‌బోర్డ్ ఉంది.
యుద్ధంలో గెలవలేరు…
ఈ బిల్ బోర్డుపై..”ఘుంగ్‌రూ టూట్ జాయేంగే పర్ హమ్సే యే వార్ జీత్ నహీ పాయోగే” (మీ కాళ్లు నొప్పి పెట్టినా కూడా మీరు మాతో జరిగే యుద్ధంలో గెలవలేరు )అని రాసి ఉంది. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన హృతిక్ రోషన్ “సరే తారక్..మీరు నా ఇంటి కింద అసలు బిల్‌బోర్డ్‌ను పంపుతూ చాలా దూరం తీసుకువచ్చారు. నేను మీ సవాల్ ను స్వీకరిస్తున్నాను గుర్తుపెట్టుకోండి మీ వల్లే ఇదంతా..#9DaysToWar2 “అంటూ ఈయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నెటిజన్లు విభిన్న రీతిలో స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా కూడా సినిమాలను ప్రమోట్ చేస్తారా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొందరు చాలా బోరింగ్ అంటూ కామెంట్లో పెడుతున్నారు. అలాగే మరి కొంతమంది అభిమానులు చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు.
Okay @tarak9999, now you've taken it too far by sending an actual BILLBOARD under my house! Alright, challenge accepted. Remember you brought this upon yourself. #9DaysToWar2 pic.twitter.com/WvjHiB3o3v
— Hrithik Roshan (@iHrithik) August 5, 2025
ఇక వార్ 2 సినిమా విషయానికి వస్తే యశ్ రాజ్ ఫిలిమ్ యూనివర్స్ నుంచి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేశారు. ఇప్పటికే సినిమా నుంచి విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలని పెంచేసింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక ఎన్టీఆర్ RRR సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ నటిస్తున్న మొదటి సినిమా కావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాపై చాలా మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి ఎన్టీఆర్ కు ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి గుర్తింపును తీసుకువస్తుందో తెలియాల్సి ఉంది.
Also Read: Lokesh Kanagaraj: ఆ హీరో కోసం 35 పేజీల స్టోరీ… విధ్వంసం సృష్టించబోతున్న లోకేష్ !