Heavy rain: హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. కుండపోత వర్షానికి నగరంలో చాలా ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి. సికింద్రాబాద్, బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట్, ప్యాట్నీ ప్యారడైజ్, మారేడుపల్లి, చిలకలగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నారాయణగూడ, ముషీరాబాద్, ఖైరతాబాద్, లక్డీకపూల్, మాదాపూర్, కూకట్ పల్లి, హైదర్ నగర్, అమీర్ పేట, వివేకానంద నగర్, హిమాయత్ నగర్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, బేగంపేట పలు ప్రాంతాల్లో రోడ్లపై భారీ వరద నీరు చేరడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
కాసేపట్లో ఈ జిల్లాల్లో భారీ వర్షం..
తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. మరో రెండు గంటల్లో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, వికారాబాద్, నల్గొండ, భూపాలపల్లి, మంచిర్యాల, నిజామాబాద్ జిల్లాల్లో మరో గంట సేపట్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వివరించింది. ఈ జిల్లా వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.
హైదరాబాద్‌లో ఈ ప్రాంతంలో భారీ వర్షం..
ఇక హైదరాబాద్ మహానగరంలో వెస్ట్ హైదరాబాద్, కూకట్ పల్లి, రాయదుర్గ్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, కూకట్ పల్లి హౌజింగ్ బోర్డు, మూసాపేట్, హఫీజ్ పేట, తదితర ప్రాంతాల్లో మరో గంట సేపట్లో భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రాంత వాసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అన్నారు. కొన్నిచోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉందని అధికారులు అలర్ట్ చేశారు.
కుత్బుల్లాపూర్‌లో రికార్డ్ వర్షపాతం..
ఇక ఈ ఏడాది అత్యధిక రికార్డ్ వర్షపాత నమోదు అయ్యింది. నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి కుత్బుల్లాపూర్‌లో 151 మి.మీ., బంజారా హిల్స్‌లో 125 మి.మీ వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఇదే అత్యధిక వర్షపాత మని చెప్పారు. ఆగస్టు నెలలో భారీ వర్షాలకు ఇది కొంత పవర్ ప్యాక్ ప్రారంభమని చెప్పవచ్చు. ఈ నెలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భారీ వర్షాలకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.
పిడుగులు పడుతున్నాయి.. జాగ్రత్త..!!
సోమవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి నగరంలో పిడుగు పడిన విషయం తెలిసిందే. గచ్చిబౌలి పరిధి ఖాజాగూడలోని లంకోహిల్స్ సర్కిల్ HP పెట్రోల్ బంక్ ఎదురుగా భారీ శబ్ధంతో పిడుగు పడింది. రోడ్డు పక్కన ఉన్న తాటిచెట్టుపై ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడడంతో జనం భయపడి పరుగులు తీశారు. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో ఆ ప్రాంతంలో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు. నేడు కూడా పిడుగులు పడే ఛాన్స్ ఉండడంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు..
ALSO READ: MLA Rajagopal Reddy: అందుకే నాకు మంత్రి పదవి దక్కలేదు.. ఎమ్యెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ALSO READ: Union Bank of India: యూనియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు.. అక్షరాల రూ.93,960 జీతం.. క్వాలిఫికేషన్ ఇదే..