Hrithik Roshan..ప్రముఖ బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ (Hrithik Roshan) హీరోగా.. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ (NTR ) కలయికలో వస్తున్న చిత్రం ‘వార్ 2’. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా(Adithya chopra) నిర్మిస్తున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ (Ayan Mukherjee) దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఆగస్టు 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇందులో తొలిసారి ఎన్టీఆర్ విలన్ గా నటిస్తున్నారు. అంతేకాదు తొలిసారి బాలీవుడ్ రంగ ప్రవేశం చేస్తున్న సినిమా కూడా ఇదే కావడంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
రొమాంటిక్ పాటకు పాదం కలిపిన హృతిక్ తల్లి..
దీనికి తోడు గత నెల ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదల చేయగా.. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. ‘వార్’ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల కియారా అద్వానీ(Kiara advani) -హృతిక్ రోషన్ మధ్య చిత్రీకరించబడిన రొమాంటిక్ సాంగ్ “ఊపిరి ఊయలగా” అంటూ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ లిరికల్ సాంగ్ కి యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ లభించింది. ఇప్పుడు ఇదే పాటను హృతిక్ రోషన్ మరోసారి పంచుకుంటూ తన తల్లి వేసిన హుక్ స్టెప్ కు సంబంధించిన వీడియోని కూడా అభిమానులతో షేర్ చేశారు.
ఊపిరి ఊయలగా పాట హుక్ స్టెప్ ను ప్రాక్టీస్ చేసిన హృతిక్ తల్లి..
అసలు విషయంలోకి వెళ్తే.. హృతిక్ రోషన్ తాజాగా తన తల్లి పింకీ రోషన్(Pinky Roshan) (71) ఊపిరి ఊయలగా పాట హుక్ స్టెప్ ను ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోని హృతిక్ రోషన్ సోషల్ మీడియా ఖాతా ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తూ.. “అమ్మ మన పాటకు డాన్స్ చేసింది అంటే.. ఇక సూపర్ హిట్ అని అర్థం. అద్భుతంగా చేసావు అమ్మ.. లవ్ యూ ” అంటూ తన ప్రేమను పంచుకున్నారు హృతిక్ రోషన్. ప్రస్తుతం పింకీ రోషన్ కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఈ వయసులో కూడా చాలా అద్భుతంగా డాన్స్ చేయడం చూసి అభిమానులే కాదు అటు సినీ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఈమె ఫిట్నెస్ కి ఫిదా అవుతున్నారు కూడా.
హృతిక్ రోషన్ కెరియర్..
తన అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో అదరగొడుతూ.. అందరినీ నటనతో కూడా ఆకట్టుకుంటున్నారు హృతిక్ రోషన్. అంతేకాదు అత్యంత ఆదాయం, ప్రజాదరణ పొందిన నటుడిగా ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో అనేకసార్లు కనిపించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హృతిక్ రోషన్.. ఇప్పటికీ కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. అంతేకాదు 51 సంవత్సరాల వయసులో కూడా అంతే ఎనర్జిటిక్గా సినిమాలు చేయడంపై అభిమానులు ఆయనకు ఫిదా అవుతున్నారు. ఇక ప్రస్తుతం వార్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హృతిక్ రోషన్.. ఈ సినిమాతో మరెలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి.
?utm_source=ig_web_copy_link
Also read: Deepika Padukone: ఇంస్టాలో అరుదైన రికార్డ్ సాధించిన దీపిక.. ప్రపంచంలోనే!