BigTV English

Zomato Boys: ఉప్పల్‌లో రోడ్డెక్కిన జొమోటో డెలివరీ బాయ్స్…

Zomato Boys: ఉప్పల్‌లో రోడ్డెక్కిన జొమోటో డెలివరీ బాయ్స్…

Zomato Boys: హైదరాబాద్ ఉప్పల్‌లో జొమాటో డెలివరీ బాయ్స్‌ రోడ్డెక్కారు. గత రెండు మూడు నెలలుగా తమ కష్టానికి తగిన డబ్బులు ఇవ్వడం లేదని, ఇచ్చే ఇన్సెంటివ్స్‌ కూడా రావట్లేదని నిరసన వ్యక్తం చేశారు. 12 గంటలకు పైగా డ్యూటీ చేసినా.. ఐదు వందలు రూపాయలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ జీవితాలకు.. ఇన్సురెన్స్ లాంటివి కూడా లేవని.. ఎండనకా.. వాననకా పనిచేస్తుంటే తమ పేర్లమీద టారిఫ్‌లు తీసుకుని వాళ్ల జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. నిరసన వ్యక్తం చేస్తే పోలీస్ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడుతున్నారు.


రోజుకు 14 గంటలకు పైగా డ్యూటీ చేస్తున్న డెలివరీ బాయ్స్
గత ఐదు, ఆరు సంవత్సరాలుగా జొమోటోలో పని చేస్తున్నాము. వర్షంలోను పనిచేస్తాము. వర్షానికి డెలివరీ టారిఫ్‌లు, డెలివరీ బాయ్స్‌కి ఇవ్వాలని టారి‌ఫ్‌లు కస్టమర్‌పై ఎక్కువగా వేస్తారు. అంతేకాకుండా వర్షంలోను డెలివరీ బాయ్స్‌కి వచ్చే అధిక టారిఫ్ డబ్బులు కూడా జోమోటా యాజమాన్యమే తీసుకుంటుందని డెలివరీ బాయ్స్ ఆరోపణ చేస్తున్నారు. రోజూ ట్రాఫిక్ జామ్ అయ్యే హైదరాబాద్ లాంటి సిటీలో డెలివరి బాయ్ జాబ్ చేయడం అంటే మాములు విషయం కాదని అన్నారు.

Also Read: పులివెందులలో కాక రేపుతున్న జడ్పీటీసీ ఉప ఎన్నికలు


తమ కష్టానికి తగిన డబ్బులు ఇవ్వడం లేదని నిరసన
దీని వల్ల మేము డెలివరి కరెక్ట్ టైంకి ఇవ్వాలన్ని ఒత్తిడి, అలాగే ట్రాఫిక్, పోల్యుషన్ ఇలా అనేక రకాల సమస్యలు ఉంటాయి. దీంతో శారీరకంగా, మానసికంగా మేము ఎంతో శ్రమిస్తాం.. కానీ దీనికి తగిన ఫలితం దక్కడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా కష్టానికి తగిన డబ్బులు ఇన్సెటివ్‌లు, ఇన్సూరెన్స్ ఇస్తారా లేదా అని డిమాండ్ చేస్తున్నారు. దీనికి మరి జొమాటో యాజమన్యం దిగొచ్చి వారికి న్యాయం చేస్తుందా? లేదా? అనే విషయంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related News

Congress: బీసీ రిజర్వేషన్ల కోసం.. హస్తినలో తెలంగాణ కాంగ్రెస్ మహాధర్నా

Weather Alert: బీ అలర్ట్..! తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ కుండపోత వర్షాలు.. నేడు ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు..

KTR In Delhi: కేటీఆర్ ఢిల్లీ ముచ్చట్లు.. ఆ భేటీ ఉద్దేశమేంటి?

KCR Big Sketch: గువ్వల రిజైన్ వెనుక కేసీఆర్ కొత్త స్కెచ్ ?

Farmers: సొంత భూమి ఉంటే చాలన్నా.. సింపుల్‌గా రూ.50వేలు పొందండిలా..?

Chiranjeevi: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో చిరంజీవి? కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం కేటీఆర్

Big Stories

×