E-Paper
Advertisement

సీతారామం ఫస్ట్ ఛాయిస్ మృణాల్ కాదా..ఇన్నాళ్ళు బయట పెట్టిన సీత!

సీతారామం ఫస్ట్ ఛాయిస్ మృణాల్ కాదా..ఇన్నాళ్ళు బయట పెట్టిన సీత!
Advertisement

Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ వెండి తెర సీతమ్మగా తెలుగు ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోయారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమయ్యారు. ఇలా సీతారామం సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న మృణాల్ తదుపరి తెలుగులో వరుస అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ సినిమాలతో పాటు తెలుగు, పాన్ ఇండియా సినిమాలలో కూడా నటించే అవకాశం అందుకుంటున్నారు..

రష్మిక మందన్న పాత్రలో ఆఫ్రిన్..

మృణాల్ ఠాకూర్ వరుస సినిమాల షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె సీతారామం సినిమాకి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. సీతారామం సినిమాలో నన్ను మొదట సీత పాత్ర కోసం సంప్రదించలేదంటూ తాజాగా ఈ విషయాన్ని బయట పెట్టారు. డైరెక్టర్ హను రాఘవపూడి మొదటగా ఈ సినిమాలో రష్మిక మందన్న నటించిన ఆఫ్రిన్ పాత్ర కోసం తనని సంప్రదించారట. ఇలా ఈ పాత్ర గురించి తనకు చెబుతున్న సమయంలో ఆయన తన మనసు మార్చుకున్నారని మృణాల్ ఠాకూర్ తెలిపారు.

ఆఫ్రిన్ పాత్ర కోసం మృణాళ్..

Advertisement

ఇలా ఆఫ్రిన్ పాత్ర కోసం నన్ను సంప్రదించగా ఈ సినిమాలో సీత పాత్రకు తానే కరెక్ట్ గా సూట్ అవుతానని భావించిన హను రాఘవపూడి ఈ సినిమాలో తనకు సీతామహాలక్ష్మి పాత్ర చేసే అవకాశం ఇచ్చారని ఈమె ఈ సందర్భంగా తెలియజేశారు. డైరెక్టర్ హను దాదాపు ఐదు గంటల పాటు ఎంతో ఓపికగా, భావోద్వేగాలతో ఈ కథను తనకు వినిపించారని, ఆ నెరేషన్ తనను ఎంతగానో కదిలించిందని మృణాల్ ఠాకూర్ ఈ సందర్భంగా తెలియచేశారు. ఇలా ఈ సినిమా విడుదలైన ఇన్ని సంవత్సరాలకు తాను సీత పాత్ర కోసం ఎంపిక కాలేదని ఆఫ్రిన్ పాత్ర కోసం ఎంపిక అయ్యాను అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

సీతామహాలక్ష్మిగా చెరగని ముద్ర..

సీతారామం సినిమాలో సీతామహాలక్ష్మి పాత్ర మృణాల్ నటన వేరే లెవెల్ అని చెప్పాలి సీత పాత్రలో ఈమె తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పటికీ గుర్తుండిపోయారు. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. అద్భుతమైన ప్రేమ కథ కావ్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో క్లాసిక్ సినిమాగా నిలిచిపోయిందని చెప్పాలి అయితే ఈ సినిమాకు సీక్వెల్ వస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు కానీ ఈ సినిమాకు ఒక అద్భుతమైన ఎండింగ్ వచ్చిందని సీతా రామం సినిమాకు ఎలాంటి సీక్వెల్ లేదని తెలియజేశారు.

Advertisement

Also Read: ఓటీటీ విడుదలకు సిద్ధమైన సీఎం కొడుకు ఫస్ట్ సినిమా!

Related News

కావ్య అనిరుద్ వెడ్డింగ్ ఇన్విటేషన్ చూశారా? కాస్ట్ ఎంతో తెలిస్తే మతి పోవాల్సిందే!

చిరంజీవి టాక్ షో ‘మెగా వర్స్’ షూటింగ్ నేడే ప్రారంభం.. ఫస్ట్ గెస్ట్ లు వీళ్ళే!

పెళ్లితో వార్తల్లోకి వచ్చిన అర్జున్ చిన్న కూతురు..ఆమె చేసే బిజినెస్ ఏంటో తెలుసా ?

ఆదర్శ కుటుంబం గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఎప్పుడు ?ఎక్కడంటే?

హీరోయిన్ గా దేవయాని కూతురు.. హీరో ఎవరంటే?

ఆర్. పి పట్నాయక్ మాటిచ్చి మోసం చేశారు..ఆ హిట్ సాంగ్స్ నావే: గరివిడి లక్ష్మి

ఆదర్శ కుటుంబం సినిమాకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. భారీగా టికెట్ ధరలు పెంపు!

Big Stories

Advertisement
×