Ram Miriyala Remuneration:రామ్ మిరియాల ..రెగ్యులర్ వాయిస్ లకన్నా భిన్నంగా వినిపించే ఈ గొంతుకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా జాతి రత్నాలు సినిమాలో ఆయన పాడిన చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే పాట అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపింది.ఇక ఆయన దసరా సినిమాలో పాడిన చమ్కీల అంగీలేసి పాట అయితే ఎన్నో బరాత్ లలో రీ సౌండ్ చేసింది.దీంతో అసలు ఆడియన్స్ ని తనవైన పాటలతో హుషారెత్తిస్తున్న రామ్ మిరియాల ఒక్కో పాటకి ఎంత తీసుకుంటాడా అంటూ ఆరాలు తీస్తున్నారు నెటిజన్లు.
‘చౌరస్తా’ బ్యాండ్‌ని ఏర్పాటు చేసి
రామ్ మిరియాల విషయానికి వస్తే 1993అక్టోబర్ 30 న ఆంద్రప్రదేశ్ ,తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం మండలంలోని కోలంక అనే చిన్న గ్రామంలో జన్మించాడు.ఇక తూగోజీలోనే ఇంటర్ పూర్తి చేసుకున్న రామ్ బీకామ్ ని మాత్రం హైదరాబాద్ వెస్లీ కాలేజీలో కంప్లీట్ చేశాడు.ఇక ఆ తర్వాత ఒక కార్పోరేట్ ఆఫీస్ లో పని చేసిన రామ్ మిరియాల రేడియో మిర్చిలో పని చేశాడు.ఇక ఆ తర్వాత యశ్వంత్, శ్రీని, బాల, అనంత్, అక్షయ్‌తో కలసి ‘చౌరస్తా’ బ్యాండ్‌ని ఏర్పాటు చేసి చేతులెక్కి మొక్కుతా, మాయ మాయ, ఊరెళ్ళి పోతా మామ వంటి పాటలతో మంచి గుర్తింపు సంపాదించారు. వీటిలో మరీ ముఖ్యంగా ఊరెళ్ళి పోతా అనే పాట నెట్టింటిని షేక్ చేసింది.
మొదటిసారి బ్రోచేవారెవరో అనే సినిమాలో
ఇక ఆ తర్వాత ‘చౌరస్తా’ బ్యాండ్ తో తెగ దెంపులు చేసుకున్న రామ్ మొదటిసారి బ్రోచేవారెవరో అనే సినిమాలో వగలాడి అనే పాటని పాడి అందరిని తన వైపుకి తిప్పుకున్నాడు.ముఖ్యంగా పాట వింటే ఇది రామ్ మిరియాల గొంతు నుండే వచ్చింది అని ఈజీగా పసిగట్టేలా ఉండేవి.ఇక ఆనంద్ దేవర కొండ హీరోగా వచ్చిన మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో రామ్ మిరియాల పాట పాడిన సాంబ శివ నీదు మహిమ అనే పాటతో ఇండస్ట్రీని మంచి పేరు తెచ్చుకున్నాడు.ఇక అక్కడి నుండి వెను తిరిగి చూసుకోకుండా వరుస పెట్టి పాటలు పాడిన రామ్ జాతి రత్నాలు సినిమాలోని చిట్టి నీ నవ్వంటే లక్ష్మి పటాసే పాట మంచి క్రేజ్ తెచ్చి పెట్టింది.పాట వచ్చినప్పుడు చిన్నా ,పెద్దా అంతా ఈ పాటకి ఫిదా అయిపోయారు.
భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్
ఇక రామ్ కెరీర్ లో అసలైన టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవాల్సిన సినిమా ఏదైనా ఉందంటే అది భీమ్లా నాయక్ సినిమాలోని టైటిల్ సాంగ్ అనే చెప్పాలి.ఇక మరీ ముఖ్యంగా సిద్దు జొన్నల గడ్డ హీరోగా వచ్చిన DJ టిల్లు సినిమాలోని టైటిల్ సాంగ్ తో ఆడియన్స్ ని ముఖ్యంగా యూత్ ని మెస్మరైజ్ చేశాడు.ఎక్కడ చూసినా, ఎక్కడ విన్న ఈ పాటే అప్పట్లో తెగ దర్శనమిచ్చేది మరి.ఇక బ్యాండ్ మేళం, రాకాస వంటి సినిమాలలో మంచి పాటలు పాడిన రామ్ మిరియాల గల్లీ రౌడీ,ఆయ్ అనే సినిమాలకి సంగీతం అందించడం కూడా విశేషం. అలాగే పుష్పక విమానం, DJ టిల్లు, లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ ,దాస్ కా దమ్కీ,టిల్లు స్క్వైర్ లోని కొన్ని పాటలకి కూడా సంగీతం అందించి మెప్పించాడు రామ్.
పారితోషికం విషయానికి వస్తే
ఇక రామ్ మిరియాల పారితోషికం విషయానికి వస్తే ఒక్కో పాటకి దాదాపు రెండు నుండి మూడు లక్షల వరకు తీసుకుంటాడన్న టాక్ వినిపిస్తుంది.ఇక డిమాండ్ ని బట్టి ఎక్కువగా,సందర్భాన్ని బట్టి తగ్గించి కూడా పాటల్ని పూర్తి చేస్తాడని సోషల్ మీడియాలో వినిపిస్తుంది.అయితే ఇది కేవలం సోషల్ మీడియాలో వచ్చే వార్తల ఆధారంగానే అని పరిగణించాలి.చూడాలి మరి నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై రామ్ ఎలా రియాక్ట్ అవుతాడో !
ALSO READ :మంగ్లీ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ వెనుక ఉన్నది ఈయనే.. మాట్ల తిరుపతి కథ తెలిస్తే షాకే!