AkiraNandan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కంప్లీట్ గా బిజీగా మారిపోవడం వలన అభిమానులు కొద్దిపాటి నిరాశలో ఉన్నారు. ఒకవైపు పాలిటిక్స్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కూడా బిజీగా మారాడు కళ్యాణ్.
పవన్ కళ్యాణ్ సినిమాలలో బిజీ అయిపోయిన పరవాలేదు. కానీ పవన్ కళ్యాణ్ ప్లేస్ ను భర్తీ చేయడానికి అకిరా నందన్ ఎంట్రీ ఇవ్వాలని చాలామంది ఎదురుచూస్తున్నారు. అకిరా కూడా చూడటానికి చాలా బాగుంటాడు. మంచి హైట్ తో పాటు ఫిజిక్ కూడా ఉంటుంది. ఒక హీరోకి కావలసిన లక్షణాలు అన్నీ కూడా అకిరా కు ఉన్నాయి.
ఫ్యూచర్ పవర్ స్టార్ కు భారీ కటౌట్
అయితే అకీరా పూర్తిస్థాయిలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వకు ముందు నుంచే ఆదరణ విపరీతంగా లభిస్తుంది. పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాలకు అఖీరా సంధ్య థియేటర్ కు వచ్చాడు. మొహం కంప్లీట్ గా కనిపించక పోయినా కూడా అఖీరాను గుర్తుపడతారు కొంతమంది జనాలు. సంధ్య థియేటర్లో అకీరా సినిమా చూసిన వీడియోలు కూడా అప్పట్లో వైరల్ గా మారాయి. అయితే ఫ్యూచర్ పవర్ స్టార్ అంటూ బెంగుళూరు సంధ్య థియేటర్ దగ్గరకు అకీరా కు భారీ కటౌట్ పెట్టారు. మొత్తానికి ఆ కటౌట్ చూస్తుంటే అకిరా ఎప్పుడు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అని ఎంతమంది ఎదురుచూస్తున్నారో అర్థమవుతుంది.
సత్యానంద్ స్కూల్ లో
రేణు దేశాయ్ దర్శకత్వం వహించిన ఒక సినిమాలో కూడా ఇదివరకే కనిపించాడు అకీరా. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఎంత క్రేజ్ ఉంది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరి లెగిసిని వీళ్ళు పిల్లలు కంటిన్యూ చేస్తారని చాలామంది అంచనా వేస్తున్నారు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ఇదివరకే వన్ నేనొక్కడినే సినిమాలో కనిపించాడు. అకిరా హీరోగా త్వరలో సినిమా కూడా రానున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం కూడా వినిపిస్తుంది. ఇకపోతే సత్యానంద దగ్గర యాక్టింగ్ నేర్చుకున్నట్లు కూడా వార్తలు ఆ మధ్య కాలంలో వినిపించాయి.
Also Read : Pawan Kalyan : చాలా సంవత్సరాలు తరువాత నిర్మాత ఏం రత్నం కోసం ఆ పని చేస్తున్న పవన్ కళ్యాణ్