Fire Accident: ఇండోనేషియాలో ఓ ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర సులవేసి ప్రాంతంలోని తలిసే ద్వీపం సమీపంలో పర్యాటకులు పర్యటిస్తున్న ఫెర్రీలో అగ్నిప్రమాదం సంభవించింది. కేఏం బార్సిలోనాఅనే ఈ ఫెర్రీ తలౌద్ దీవుల నుంచి మనాడో నగరానికి ప్రయాణిస్తుండగా.. ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో ఐదుగురు మృతిచెందినట్టు అధికారులు తెలిపారు. ఇందులో ఓ గర్భిణీ కూడా ఉన్నట్టు సమాచారం.
ఫెర్రీలో మొత్తం ఇప్పటివరకు 284 మందిని సురక్షితంగా రక్షించినట్లు అధికారులు తెలిపారు. ఫెర్రీలో ఆకస్మికంగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు కాపాడుకోవడానికి కొంతమంది సముద్రంలోకి దూకారు. ఇండోనేషియాలో 17,000 కంటే ఎక్కువ దీవులు ఉన్నాయి. ఫెర్రీలు అక్కడి ప్రజలకు ప్రధాన రవాణా సాధనంగా ఉన్నాయి. అయితే.. భద్రతా ప్రమాణాలు తక్కువగా ఉండటం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరగుతూనే ఉన్నాయి. ఈ ఘటనలో అగ్ని కారణం ఇంకా తెలియరాలేదు. దీనిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. సమీపంలోని సముద్ర రక్షణ బృందాలు, స్థానిక అధికారుల సహకారంతో, చిక్కుకున్న ప్రయాణికులను రక్షించేందుకు వేగంగా స్పందించాయి. చాలా మంది ప్రయాణికులు సముద్రంలోకి దూకినప్పటికీ.. రక్షణ బృందాలు వారిని సురక్షితంగా తీరానికి చేర్చాయి. ఈ ఘటన విషాదకరమైనప్పటికీ 284 మందిని కాపాడటం రక్షణ బృందాల సమర్థతను చాటుతుంది.ఈ ఘటన ఇండోనేషియాలో ఫెర్రీ రవాణా భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.
ALSO READ: Cricket stadium: తెలంగాణలో అద్భుతమైన క్రికెట్ స్టేడియం.. సీఎం కూడా గ్రీన్ సిగ్నల్..?
గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. భద్రతా ప్రమాణాలను మెరుగుపరచాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అగ్నిప్రమాద నివారణ వ్యవస్థలు, సిబ్బంది శిక్షణ, ఫెర్రీల నిర్వహణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మరణాల సంఖ్యపై అధికారిక సమాచారం బయటకు రాలేదు. ఈ ఘటన ఇండోనేషియాలో సముద్ర రవాణా భద్రతను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుంది.
ALSO READ: Coast Guard Jobs: కోస్ట్‌గార్డులో ఉద్యోగాలు.. లక్షకు పైగా వేతనం.. ఇంకా 3 రోజులే సమయం